ఉమేష్ విశ్వనాథ్ కత్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బిన్నీపెట్ & గోవిందరాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 04 ఆగష్టు నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో అడవులు, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]

ఉమేశ్ కత్తి
ఉమేష్ కత్తి


అటవీ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 ఆగష్టు 4 - 2022 సెప్టెంబరు 6
ముందు అరవింద్ లింబావాలి

ఆహార & పౌరసరఫరాల శాఖ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
21 జనవరి 2021
ముందు కే. గోపాలయ్య

వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
23 సెప్టెంబర్ 2010 – 13 మే 2013
ముందు ఎస్.ఎ. రవీంద్రనాథ్
తరువాత కృష్ణ బైరె గౌడ

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2008
ముందు శశికాంత్ అక్కప్పి నాయక్
నియోజకవర్గం హుక్కేరి
పదవీ కాలం
1985 – 2004
ముందు విశ్వనాధ్ మల్లప్ప కట్టి
తరువాత శశికాంత్ అక్కప్పి నాయక్
నియోజకవర్గం హుక్కేరి

వ్యక్తిగత వివరాలు

జననం (1961-03-14) 1961 మార్చి 14 (వయసు 63)
ఖాదక్లెట్
మరణం 2022 సెప్టెంబరు 6(2022-09-06) (వయసు 61)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు *జనతా పార్టీ,
  • జనతా దళ్
  • జనతా దళ్ (యునైటెడ్)
  • జనతా దళ్ (సెక్యూలర్)

రాజకీయ జీవితం మార్చు

ఉమేశ్ కత్తి తన తండ్రి విశ్వనాధ్ కట్టి మరణాంతరం 1985లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో జనతా పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఉమేశ్ కట్టి 1989, 1994, 1999, 2008, 2008 ఉప ఎన్నిక, 2013, 2018లో వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1996లో జనతా దళ్ ప్రభుత్వంలో చెక్కర & పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా పని చేశాడు. అనంతరం బిజెపి పార్టీలో చేరి 2008లో ఉద్యానవన, వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశాడు. ఉమేశ్ కట్టి 2018లో జరిగిన అసెంబ్లీ హుక్కేరి నియోజకవరం నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించాడు.[3]

ఉమేష్ కత్తి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా 2021 జనవరి 21న భాద్యతలు చేపట్టాడు.

మరణం మార్చు

ఉమేష్ కత్తి 2022 సెప్టెంబరు 6 రాత్రి గుండెపోటుతో డాలర్స్ కాలనీలోని తన నివాసంలో మరణించాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.[4]

మూలాలు మార్చు

  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Eenadu (29 April 2021). "'బతకలేకపోతే.. చస్తే మరీ మంచిది'". Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  3. Deccan Chronicle (16 May 2018). "BJP's Umesh Katti creates record, wins Hukkeri for eighth time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  4. NTV Telugu (7 September 2022). "కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి మృతి". Archived from the original on 7 September 2022. Retrieved 7 September 2022.