ఉమ్మడి పౌరస్మృతి
యూనిఫాం సివిల్ కోడ్ (ఆంగ్లం: Uniform Civil Code; హిందీ: समान नागरिक संहिता) అనేది సామాజిక విషయాలకు సంబంధించిన భారతీయ చట్టం. ఇది వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం మొదలైన అంశాలలో అన్ని మతాల ప్రజలకు సమానంగా వర్తిస్తుంది. అంటే, భారతదేశం అంతటా భిన్న సంస్కృతులు, మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే న్యాయాన్ని అందించడానికి వీలు కల్పించడం అన్నమాట.[2]
పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, పిల్లలను దత్తత తీసుకోవడం, జీవనభృతి లాంటి సామాజిక విషయాలకు సంబంధించిన చట్టాలు దేశంలో అందరికీ ఒకేలా లేవు. పౌరులు ఆచరించే మతపరమైన అచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఉన్నాయి. అయితే, మతంతో సంబంధం లేకుండా, లింగ భేదాల్లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం ఆవశ్యకతను దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలోనే గుర్తించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 సారాంశం కూడా ఇదే. దీని ప్రకారం భారతదేశ భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళిని తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
స్వాతంత్ర్యం తరువాత
మార్చు- మహిళల పట్ల వివక్షను తొలగించేందుకు 1993లో బ్రిటీష్ కాలపు నాటి చట్టాలను సవరించారు. ఈ చట్టం వల్ల సెక్యులరిస్టులు, ముస్లింల మధ్య అగాధం పెరిగింది.
- భారతదేశంలో ట్రిపుల్ తలాక్ అనేది ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు "తలాక్" అని మూడుసార్లు పలకడం, వ్రాసి లేదా ఎలక్ట్రానిక్ రూపంలో పంపడం ద్వారా విడాకులు ఇచ్చే పద్ధతి. అయితే ఆర్డినెన్స్ రూపంలో సెప్టెంబరు 2018 నుంచి ఒక చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇస్తే మూడేళ్ల జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.[3]
ప్రపంచంలో
మార్చుప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఇటువంటి చట్టాలు ఉన్నాయి. అమెరికా, ఐర్లాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, టర్కీ, ఇండోనేషియా, సూడాన్, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తున్నాయి.
దీనికి బదులుగా భారతదేశంలో చాలా వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి.[4] హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు వ్యక్తిగత చట్టం ఉంది, ముస్లింలు, క్రైస్తవులకు వారి స్వంత చట్టాలు ఉన్నాయి. ఇతర మతాల చట్టాలు భారత రాజ్యాంగంపై ఆధారపడి ఉంటాయి.
మూలాలు
మార్చు- ↑ Schoettli, J. (2012). Vision and Strategy in Indian Politics: Jawaharlal Nehru’s Policy Choices and the Designing of Political Institutions. Routledge Advances in South Asian Studies. Taylor & Francis. p. 202. ISBN 978-1-136-62786-6.
- ↑ "సమతా భారత్‌కు ఉమ్మడి పౌరస్మృతి |". web.archive.org. 2023-07-07. Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "तीन तलाक अध्यादेश को चुनौती देने वाली याचिका खारिज". Naya India Team. 28 September 2018. Archived from the original on 28 सितंबर 2018. Retrieved 28 सितंबर 2018.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - ↑ Modern Indian Family Law Archived 2013-10-15 at the Wayback Machine - by Werner Menski