ఉర్దూ అకాడమీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉర్దూ అకాడమి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగుతో పాటు రెండవభాష అయిన ఉర్దూ భాష పరిరక్షణకు 1976లో ఉర్దూ అకాడమిని స్థాపించింది. ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల 'అటానమస్' సంస్థ. ఉర్దూ భాషాభివృద్ధి, పరిరక్షణ దీని బాధ్యతలు. తన కార్యకలాపాలను విస్తరింపజేసేందుకు విజయవాడ, కర్నూలు, నిజామాబాద్ లలో ప్రాంతీయ కేంద్రాలను నెలకొల్పింది. ప్రస్తుతం ఈ అకాడమికి రాష్ట్రప్రభుత్వం ఆర్థికసహాయం అందిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మైనారిటీల సంరక్షణ విభాగం దీనిని పర్యవేక్షిస్తుంది.
దీని కార్యక్రమాలు :
- ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాల ప్రచురణ విషయాలు పర్యవేక్షించడం
- ఉర్దూ కవిత, నాటకం, విమర్శ, పరిశోధన విషయాలపై పుస్తకాల ప్రచురణ.
- రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ కంప్యూటరు కేంద్రాలను నడపడం.
- ఉర్దూభాష చదువుతున్న విద్యార్థులకు ఉపకారవేతనాలను అందించడం.
చేయవలసిన పనులు
మార్చు- తెలుగు అకాడమితో లేదా తెలుగు అధికారభాషా సంఘంతో కలిసి 1.తెలుగు-ఉర్దూ నిఘంటువు 2.ఉర్దూ-తెలుగు నిఘంటువు తయారు చెయ్యాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికారభాష అయితే ఉర్దూ రెండవ అధికారభాష . పూర్తికాకుండా ఉన్న ఈ పని అకాడమి స్థాపనోద్దేశాలలో ఒకటి.