ఉర్సులా కె.లిగూన్

ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ కి ఒక బాలల కథా రచయిత్రికి జన్మించిన ఉర్సులా కె.లిగూన్ సహజంగానే కథా రచనపై చిన్న నాటినుండే అభిరుచి అలవడింది. ఈమె వ్రాసిన ప్రతి రచనా ఇంచుమించు ఏదో ఒక బహుమనో, సత్కారాన్నో సాధించి పెట్టింది. మీకు కథలెక్కడినుండి వస్తాయని ఎవరైనా అడిగితే ..... సింపిల్, దోస్తోవిస్కీని మరిచిపోతూ, సైన్ బోర్డులను తిరగ చదువుతూ...... ఆలోచిస్తా..... అని చెపుతుంది.

ఉర్సులా కె.లిగూన్
UrsulaLeGuin.01.jpg
Le Guin at a bookstore Q&A session, July 2004
పుట్టిన తేదీ, స్థలంUrsula Kroeber
(1929-10-21)1929 అక్టోబరు 21
Berkeley, California, USA/బెర్కలీ... కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.
మరణం2018 జనవరి 22(2018-01-22) (వయసు 88)
వృత్తిNovelist/నవలా రచయిత్రి
జాతీయతAmerican/అమెరికా
కాలంc. 1962–present
రచనా రంగంScience fiction, fantasy
జీవిత భాగస్వామిCharles Le Guin (m. 1953–present); 3 children
Website
www.ursulakleguin.com

తల్లిదండ్రులు/బాల్యముసవరించు

ఉర్సులా తండ్రి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బర్కిలి) లో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు ఆల్ఫ్రెడ్ లూయీక్రోబర్. తల్లి థియొడోరా. బాలల సాహిత్య రచయిత్రి. ఈ దంపతులకు ఈమె అక్టోబరు 1929 లో అమెరికాలో జన్మించారు. విద్యావంతులైన తల్లి దండ్రుల కారణంగా.... సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడడము, సాహిత్యాభినివేశమూ ఉర్సులాకు బాల్యంనుండే అలవడ్డాయి. చిన్నప్పుడు తండ్రి వళ్ళో కూర్చొని అమెరికన్ ఆదివాసుల జీవిత పద్ధతుల గురించి చెప్పగా విన్న కబుర్లు, తల్లివ్రాసిన పిల్లల కథలు ఆమెను బాగా ప్రభవితం చేశాయి.

విద్యాభ్యాసముసవరించు

రాడ్ క్లిప్ కాలేజ్, కొలంబియా యూనివర్సిటీల్లో విద్యాభ్యాసము చేసిన ఈమె మద్య యుగాల నాటి యూరోపియన్ సాహిత్యం మీద పరిశోధన చేసింది. రచనలు చేస్తూనే మెర్సర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆప్ ఖడాహో, పాసిపిక్, వాషింగ్ టన్, పోర్డ్ లాండ్ స్టేట్, రీడింగ్, కాలిపోర్నియా టులాన్ విశ్వవిద్యాలయాల్లో బోధనా వృత్తిని చేపట్టింది.

రచనా వ్యాసంగముసవరించు

సైన్స్ ఫిక్షన్ అంటే రేపటి కథ. ఉర్సులా తొలి రచనలు సైన్సు ఫిక్షన్ అభిమానుల్ని మాత్రమే అకర్షించినా తన రచన ది లెప్ట్ హాండి ఆఫ్ డార్క్ నెస్ తో ఆమె పరిది అధిగమించి సాహిత్య విమర్శకుల మన్ననలను కూడా పొందింది.

తన రచనలకు ప్రేరణసవరించు

అమెరికా రచయిత అయిన ఉర్సులా... తన రచనలకు ప్రేరణ... టాల్ స్టాయి, చెహోవ్, వర్జీనియా వుల్ఫ్ అంటుంది. వారి ప్రేరణతో ఈమె అనేక విలక్షణమైన రచనలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. మీకు కథలెక్కడినుండి వస్తాయి? అని అడిగితే..... ఉర్సులా.................. సింపిల్.... దోస్తోవ్ స్కీని మరచిపోతూ, సైన్ బోర్డులను తిరగ చదువుతూ ...... ఆలోచిస్తానని చెప్తోంది.

ఉత్తమ రచనలుసవరించు

ప్లానెట్ ఆప్ ఎకైస్ ల్ (1966) సిటీ ఆప్ ఇల్యూషన్స్ (1967) పోర్ వేస్ టు ఫర్ గివ్ నెస్ 1997 ది డిస్పోసెస్డ్ 1997 మొదలగునవి ఈమె వ్రాసిన వాటిలో ఉత్తమైనవిగా ఎంపికయ్యాయి. యువత కొరకు వ్రాసిన ఎ విజర్డ్ ఆఫ్ ఎర్త్ సీ 1968 థె టూంబ్స్ ఒఫ్ ఆట్వాణ్' 1971, ధి ఫారెస్ట్ షోర్ 1972 రచనలను విమర్శకులు ప్రశంచించారు.

లబించిన అవార్డులు... రివార్డులుసవరించు

ఈమె చేపట్టిన ప్రతిరచనా ఇంచుమించు ఏదో ఒక బహుమతికి లేదా ఒక సత్కారానికి ఎంపికయింది. ఈమెకు మొత్తం అయిదు హ్యూగో అవార్డులు, గాండాల్స్ అవార్డ్ (1979) నెబ్యూలా అవార్డులు 5 లభించాయి. ఈ నెబ్యులా అవార్డులు సైన్స్ ఫిక్షన్ కథలకు ఇచ్చే బహుమతులు. ఇవిగాక జూకేట్ హైడింగర్, కాఫ్కా బహుమతులు (1986) పుష్కార్డ్ ప్రైజ్ (1991) నేషనల్ బుక్ అవార్డులు కూడ ఈమెకు లభించాయి.

మూలంసవరించు

ముక్తవరం పార్థసారధి సంకలనం చేసి ప్రచురించిన ప్రపంచ రచయిత్రుల కథలు అనే పుస్తకము.