ఉషా చౌమర్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సామజిక సేవకురాలు. ఆమె పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం చేస్తున్న పోరాటాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఉషా చౌమర్ ను 2020లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[1]

ఉషా చౌమర్
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుండి పద్మశీ అవార్డును అందుకుంటూ
జననం
వృత్తిసామజిక సేవకురాలు
పురస్కారాలుపద్మశ్రీ (2020)

జీవితాన్ని మార్చిన సంఘటన మార్చు

ఉషా చౌమర్‌ రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలోని దీఘ్‌ కుగ్రామంలో ఒక సామాన్య దళిత తోటీ కుటుంబంలో పుట్టిన ఆమె పారిశుధ్య కార్మికురాలిగా 'మానవ వ్యర్థాలను తలపై మోసే' కులవృత్తిని తన ఏడవ ఏట నుంచే తల్లికి సహాయంగా చీపురు పట్టింది. పది సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని గృహిణిగా ఆల్వార్‌ జిల్లా చేరుకొని భర్తకు సహాయంగా ఇదే పనిలో జీవితం కొనసాగించి ఎన్నో ఛీత్కారాలు, అంటరానితనాన్ని ఎదుర్కొంది.

సులభ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండర్‌, సంఘ సంస్కర్త డా. బిందేశ్వర్‌ పాఠక్‌ ఉషా నివసించే గ్రామాన్ని సందర్శించాడు. ఓ రోజు పనిముగించుకుని ఇంటికి వెళ్తున్న ఉషా బృందాన్ని ఆయన పిలిచాడు. 'మీరంతా ఈ పని ఎందుకు చేస్తున్నారు?' అని ఆయన వారిని ప్రశ్నించాడు. దానికి ఆమె 'ఇది మా కులవృత్తి. మా కులంలో ఆడవాళ్లంతా ఈ పనే చెయ్యాలి. మా అమ్మ, అమ్మమ్మ కూడా ఇదే పనిచేశారు.' అని సమాధానం ఇచ్చింది. 'ఈ పనిని ఆపేసి ఇతర వృత్తుల్లోకి రండి అని పిలుపునిచ్చిన బిందేశ్వర్‌ పాఠక్‌ మాటలు విన్న ఆమె కుల వృత్తిని మానేసి వృత్తివిద్య శిక్షణ కోసం ‘నయీ దిశ’ సంస్థ సభ్యురాలిగా మరి పచ్చళ్లు పెట్టడం, అప్పడాలు చేయడం, మెహందీ, ఎంబ్రాయిడరీ పని నేర్చుకుంది.

ఉషా చౌమర్ అలా తను కొత్త జీవితంలోకి వచ్చి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి చేతితో మలమూత్రాల ఎత్తివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది. ఉషా నేతృత్వంలోని మహిళా బృందాలకు 2002 నుంచి అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు లభించింది. ఆమె అమెరికా, పారిస్, దక్షిణాఫ్రికా వంటి పలు దేశాలలో పర్యటిస్తూ, ఎంతోమందిని తోటీ (మానవ వ్యర్థాలను తలపై మోసే) పని నుంచి బయటకు తీసుకువచ్చింది. ఆమె ప్రస్తుతం సులభ్‌ ఇంటర్నేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌కి అధ్యక్షురాలిగా పని చేస్తుంది. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు 2020లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[2][3]

మూలాలు మార్చు

  1. 10TV (25 January 2020). "రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ప్రకటించిన కేంద్రం" (in telugu). Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Sakshi (30 January 2020). "పంచ పద్మాలు". Archived from the original on 9 నవంబరు 2021. Retrieved 9 November 2021.
  3. Eenadu (9 November 2021). "ఈ మార్పు వేల మందిలో!". Archived from the original on 9 నవంబరు 2021. Retrieved 9 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉషా_చౌమర్&oldid=3954885" నుండి వెలికితీశారు