భరత్‌పూర్ జిల్లా, పశ్చిమ భారతదేశం లోని రాజస్థాన్ రాష్ట్రం లోని ఒక జిల్లా. భరత్‌పూర్ పట్టణం జిల్లా ప్రధాన కార్యాలయం, డివిజనల్ ప్రధాన కార్యాలయం.భరత్‌పూర్ జిల్లా భారతదేశ జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఒక భాగం.

భరత్‌పూర్ జిల్లా
రాజస్థాన్ జిల్లాలు
రాజస్థాన్‌ పటంలో భరత్‌పూర్ జిల్లా స్థానం
రాజస్థాన్‌ పటంలో భరత్‌పూర్ జిల్లా స్థానం
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
విస్తీర్ణం
 • Total5,066 కి.మీ2 (1,956 చ. మై)
జనాభా
(2011)
 • Total2,548,462
 • సాంద్రత500/కి.మీ2 (1,300/చ. మై.)
కాలమానంUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)

చరిత్రసవరించు

 
రాజస్థాన్‌లో భరత్‌పూర్ స్థానం: తూర్పు అంచున 30 వ సంఖ్య.

పూర్వం భరత్‌పూర్ రాజాస్థానంగా ఉంది.[1]

భౌగోళికంసవరించు

రాజస్థాన్ రాష్ట్టంలోని జిల్లాలలో భరత్‌పూర్ జిల్లా ఒకటి. భరత్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 5,066 చ.కి.మీ. ఉత్తర సరిహద్దులో హర్యానా రాష్ట్రానికి చెందిన గుర్‌గావ్ జిల్లా, తూర్పు సరిహద్దులో ఉత్తరప్రదేశ్కి చెందిన మథుర జిల్లా, ఆగ్రా జిల్లా, దక్షిణ సరిహద్దులో ధౌల్‌పూర్ జిల్లా, నైరుతీ సరిహద్దులో కరౌలి జిల్లా పశ్చిమ సరిహద్దులో దౌస జిల్లా, ఆల్వార్ జిల్లా ఉన్నాయి. జిల్లాలో బాణగంగా, రూప్‌రెల్, గంభీర్ నదులు ప్రవహిస్తున్నాయి. బాణగంగా, జైపూర్ జిల్లాలో పుట్టి దౌస, భరత్‌పూర్ జిల్లాలమధ్య ప్రవహించి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమనానదిలో సంగమిస్తుంది. గంభీర్ నది, కరౌలి జిల్లాలోని పచన ఆనకట్ట వద్ద మొదలై భయానా తాలూకాలో బాణగంగా నదిలో సంగమిస్తుంది. రూప్‌రెల్ ఆల్వార్ జిల్లాలో మొదలై భరత్‌పూర్ జిల్లాలోని కమన్ తాలూకాలో ప్రవేశిస్తుంది.

విభాగాలుసవరించు

భరత్‌పూర్ జిల్లాలో 10 రెవెన్యూ ఉపవిభాగాలు, 11 తాలూకాలు ఉన్నాయి. వెయర్ తాలూకా, భువనేశ్వర్ తాలూకాలు తప్ప మిగిలినవన్నీ అవి అదేపేరు అదే సరిహద్దులు కలిగి ఉన్నాయి. భయాన, భరత్పూర్ (ఉదయ్), డీగ్, కామన్, కుమ్హెర్, నద్బై, నగర్, పహారీ, రూప్వస్, (రుప్బస్) [2] తాలూకాలు ఉన్నాయి.

భరత్పూర్ జిల్లాలో: రెవెన్యూ పథకం [2]
ఉపవిభాగం భూమి రికార్డ్ పంట సర్కిల్స్ (ఐ.ఎల్.ఆర్.సి లు) పత్వర్ సర్కిల్స్ ఆక్రమిత గ్రామాలు నిర్జన గ్రామాలు మొత్తం గ్రామాలు
భయాన 6 51 181 16 197
భరత్పూర్ 6 57 185 21 206
డీగ్ 8 56 130 12 142
కమాన్ 6 46 119 13 132
కుమ్హెర్ 5 47 128 7 135
నద్బై 5 47 121 4 125
నగర్ 6 49 166 9 175
పహారీ 5 43 135 4 139
రూప్వస్ 5 49 148 16 164
వీర్ 5 51 154 8 162

జనాభా గణాంకాలుసవరించు

చారిత్రిక జనాభాసవరించు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19015,97,736—    
19115,47,233−0.88%
19214,83,536−1.23%
19314,93,852+0.21%
19415,74,192+1.52%
19516,04,896+0.52%
19617,85,805+2.65%
197110,29,930+2.74%
198112,98,278+2.34%
199116,50,724+2.43%
200121,00,020+2.44%
201125,48,462+1.95%
2020 est.28,61,513+1.30%
source:[3]

2011 గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో మొత్తం జనాభా 2,548,462. వీరిలో 1,355,726 మంది పురుషులు కాగా, 1,192,736 మంది మహిళలు ఉన్నారు. 2011 నాటికి జిల్లాలో మొత్తం 425,414 కుటుంబాలు నివసిస్తున్నాయి.సగటు సెక్స్ నిష్పత్తి 880. మొత్తం జనాభాలో 19.4% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా 80.6% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 79% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 67.9%. పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 887 కాగా, గ్రామీణ ప్రాంతాలు 878గా ఉందిజిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 436165, ఇది మొత్తం జనాభాలో 17%. 0-6 సంవత్సరాల మధ్య 233323 మంది మగ పిల్లలు, 202842 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భరత్‌పూర్ చైల్డ్ సెక్స్ రేషియో 869, ఇది భరత్‌పూర్ జిల్లాలోని సగటు సెక్స్ రేషియో (880) కన్నా తక్కువ.జిల్లా మొత్తం అక్షరాస్యత 70.11%. భరత్పూర్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత 69.62%, మహిళా అక్షరాస్యత రేటు 45.02%.[4]

2001 గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,549,121,[5]
ఇది దాదాపు. కువైట్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నెవాడా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 116వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 503 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.32%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 877:1000,[5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 71.16%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ప్రముఖులుసవరించు

  • ఆచార్య రాజేంద్రసూరి (1826–1906), జైన్ సంస్కర్త. భరత్‌పూర్‌లో జన్మించాడు.

పర్యాటక ఆకర్షణలుసవరించు

భరత్‌పూర్ జిల్లాలో కియోలడియో అభయారణ్యం ఉంది. ఇది పక్షులకు ప్రధాన శీతాకాల ఆశ్రయంగా ఉంది. కియోలడియో అభయారణ్యంని భరత్‌పూర్ రాజులు డక్- హంటింగ్ రిజర్వ్‌గా దీనిని నిర్ంవించారు. బ్రిటిష్ కాలంలో ఇది డక్ షూటింగ్‌కు గుర్తింపు పొందింది. 1956లో ఇది పక్షుల శరణాలయంగా ప్రకటించబడింది. తరువాత ఇది నేషనల్ పార్క్‌గా అభివృద్ధి చేయబడింది. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. కియోలడియో అభయారణ్యం 360 పక్షులను ఆకర్షిస్తుంది. ఇక్కడ భారతీయ పక్షులేకాక ఆఫ్ఘనిస్థాన్, తుర్కమేనిస్తాన్, సైబీరియా, చైనా, టిబెట్ నుండి పక్షులు వలస వస్తుంటాయి. వీటిలో ప్రబల సైబీరియన్ కొంగలు కూడా ఉన్నాయి. వర్షాకాంలో చిత్తడి భూములలో నీరు నిండి పోతుంది. తరువాత పక్షుల రాక మొదలౌతుంది.

సరిహధ్దులుసవరించు

మూలాలుసవరించు

  1. "Baratpur—Indian Princely State—the only political entity ever to have a chartreuse colored flag:". Archived from the original on 2009-02-11. Retrieved 2014-11-13.
  2. 2.0 2.1 "Administrative Setup". Bharatpur District. Archived from the original on 2013-05-11. Retrieved 2014-11-13.
  3. Decadal Variation In Population Since 1901
  4. "Bharatpur District Population Religion - Rajasthan, Bharatpur Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-02-23.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kuwait 2,595,62 line feed character in |quote= at position 7 (help)
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nevada 2,700,551 line feed character in |quote= at position 7 (help)

వెలుపలి లింకులుసవరించు