ఊకే అబ్బయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు బూర్గంపాడు, ఇల్లందు నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

ఊకే అబ్బయ్య
ఊకే అబ్బయ్య


ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 – 1985
ముందు పూనెం రామచంద్రయ్య
తరువాత చందా లింగయ్య
నియోజకవర్గం బూర్గంపాడు నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 1999
2009 - 2014
నియోజకవర్గం ఇల్లందు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం 2024 నవంబర్ 24
హైద‌రాబాద్‌
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ

తెలుగుదేశం పార్టీ

రాజకీయ జీవితం

మార్చు

ఊకే అబ్బయ్య సీపీఐ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో బూర్గంపాడు నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999లో ఇల్లందు నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం టీడీపీలో చేరి 2009లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

 
Honourable CM

ఊకే అబ్బయ్య 2014 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ లభించకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి ఇల్లందు నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన టికెట్ దక్కకపోడవడంతో[2] స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

సంవత్సరం నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
1983 బూర్గంపాడు ఊకే అబ్బయ్య సిపిఐ 17524 చందా లింగయ్య స్వతంత్ర 15803
1985 బూర్గంపాడు చందా లింగయ్య కాంగ్రెస్ 36947 ఊకే అబ్బయ్య సీపీఐ 34719
1989 ఇల్లందు గుమ్మడి నరసయ్య స్వతంత్ర 38388 ఊకే అబ్బయ్య సీపీఐ 30705
1994 ఇల్లందు ఊకే అబ్బయ్య సీపీఐ 44191 గుమ్మడి నరసయ్య స్వతంత్ర 38116
1999 ఇల్లందు గుమ్మడి నరసయ్య స్వతంత్ర 47806 ఊకే అబ్బయ్య స్వతంత్ర 22079
2009 ఇల్లందు ఊకే అబ్బయ్య టీడీపీ 41605 కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ 38659
2014 ఇల్లందు కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ 44945 ఊకే అబ్బయ్య టీఆర్ఎస్ 20865
2018 ఇల్లందు బానోతు హరిప్రియ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఊకే అబ్బయ్య స్వతంత్ర

ఊకే అబ్బయ్య అనారోగ్య స‌మ‌స్యలతో బాధపడుతూ హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2024 నవంబర్ 24న మరణించాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (4 March 2019). "ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే.. జంప్‌ జిలానీయే.. ఆరుగురు ఎమ్మెల్యేలదీ అదేబాట". Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
  2. Sakshi (24 November 2018). "రెబల్స్‌పై కాంగ్రెస్‌ అనూహ్య నిర్ణయం". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  3. Andhrajyothy (24 November 2024). "తెలంగాణలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. Prabha News (24 November 2024). "ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బ‌య్య‌ కన్నుమూత". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.