ఊతప్పం

(ఊతప్పము నుండి దారిమార్పు చెందింది)

ఊతప్పం ఒక భారతీయుల తిండి పేరు. ప్రధానంగా తమిళనాడు,, కర్ణాటక,, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో దీన్ని ఉదయం, సాయంత్రం దీన్ని అల్పాహారంగా భుజిస్తారు. దోశ కన్నా కొంచెం మందంగా ఉన్న అట్టుపై ఉల్లిపాయలు, టమోటాలు, జీలకర్ర, కొత్తిమీర, క్యాప్సికం, క్యాబేజీ, క్యారట్ లాంటివి చల్లడం సాధారణం.[1]

ఊతప్పం
మినీ ఊతప్పం
మూలము
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంకర్ణాటక, తమిళనాడు
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు బియ్యప్పిండి, మినప పిండి

కావలసిన పదార్థాలు మార్చు

సాధారణంగా ఊతప్పానికి దక్షిణ భారతదేశంలో ఇడ్లీలకు, దోశలకు వాడే పిండి సరిపోతుంది. ఈ పిండి బియ్యం,, మినుముల మిశ్రమంతో తయారు చేస్తారు. అన్నంలో వాడే సాధారణ బియ్యం నుంచి, బ్రౌన్ రైస్, బాస్మతి బియ్యం కూడా వాడవచ్చు. కొద్ది మంది బియ్యం బదులు ఓట్స్ కూడా వాడుతుంటారు.

తయారీ మార్చు

ఉల్లిపాయలు, టమోటాలను కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దీన్ని పులియ బెట్టిన బియ్యం, మినప పిండి మిశ్రమంతో కలిపి దళసరియైన అట్లుగా పెనం మీద వేయాలి. ఎక్కువగా దీనిమీద ఉల్లిపాయలు, టమోటా, పచ్చి మిరప కాయలు చల్లుతారు. ప్రత్యేకత కోసం క్యాప్సికం, క్యాబేజీ మిశ్రమం లేదా సన్నగా తరిగిన క్యారెట్ తురుం కూడా వేసుకోవచ్చు.

ఇతర వివరాలు మార్చు

మార్కెటెలో ఊతప్పం తయారు చేయడానికి కావలసిన రెడీమేడ్ పిండి ప్యాకెట్ల రూపంలో లభ్యమవుతుంది. దీన్ని కొద్దిగా నీళ్ళతో ఐదు, పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.

మూలాలు మార్చు

  1. గాయత్రి. "ఊతప్పం". gayatrivantillu.com. గాయత్రి వంటిల్లు. Archived from the original on 21 నవంబరు 2016. Retrieved 8 December 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=ఊతప్పం&oldid=3797352" నుండి వెలికితీశారు