ఊనా జిల్లా
ఊనా జిల్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాలలో ఒకటి. జిల్లా సరిహద్దులో హోషియార్‌పూర్, రూప్‌నగర్ జిల్లాలు (పంజాబు) ఉన్నాయి. దిగువ స్థాయి కొండలతో జిల్లా అధికంగా మైదానంగా ఉంటుంది. జిల్లా పారిశ్రామిక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది ధర్మశాల, కులు, మనాలి, జ్వాలాముఖి, చింత్పూర్ణి లకు వెళ్ళే మార్గంలో ఉంది. సిక్కుల మొదటి గురువు నివసించిన కిలా (కోట) ఊనా జిల్లాలోనే ఉంది.
ఊనా జిల్లా | |
---|---|
![]() హిమాచల్ ప్రదేశ్ పటంలో ఊనా జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | ఊనా |
మండలాలు | 4 |
ప్రభుత్వం | |
• లోకసభ నియోజకవర్గాలు | 5 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,549 km2 (598 sq mi) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 5,21,057 |
• సాంద్రత | 340/km2 (870/sq mi) |
• విస్తీర్ణం | 8.8% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 87.23% |
• లింగ నిష్పత్తి | 977 |
సగటు వార్షిక వర్షపాతం | 1253 మి.మీ. |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
ప్రజలుసవరించు
జిల్లాలో పంజాబీ, హిందీ భాషలు ప్రధానంగా ఉన్నాయి. ప్రజలలో యువకులు ధోవతి, ప్యాంట్, షర్ట్, ట్రైజర్స్ స్త్రీలు సల్వార్ కమీజ్ ధరిస్తుంటారు. 2001 గణాంకాల ఆధారంగా జనసంఖ్య 4,47,967. స్త్రీ: పురుషుల నిష్పత్తి 997:1000. అక్షరాశ్యత 81.09%. వైశాల్యం 1549 చ.కి.మీ.ప్రజలలో అధికంగా హిందువులు, సిక్కులు (అల్పసంఖ్య) ఉన్నారు.
భౌగోళికంసవరించు
ఊనా జిల్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్నేయాన ఉంది. జిల్లా పరిసరాలలో హిమాలయ పర్వతశ్రేణిలో భాగమైన అందమైన శివాలిక్ కొండలు ఉన్నాయి. 1972 సెప్టెంబర్ 1న కాంగ్రా జిల్లాను విభజించి ఊనా, హమీర్‌పూర్, కాంగ్రా ఏర్పరచారు. జిల్లాలో చింత్‌పూర్ని (చిన్నమస్తిక ధాం), భద్రకాళీమాతా మందిరం, గుగా జహర్ పీర్ (బదుర్ కాళీ గ్రామం), డేరా బాబా రుద్రు, బాబా మోనీ ఆలయం (గనారీ), జొగ్గి పంగా, ధర్మశాలా మహంతా, ధుంసర్ మహాదేవ్ ఆలయం, తాల్మెహ్రా, పీర్ నిగహా (బ్రహ్మభూతి) మొదలైన ప్రబలమైన ఆలయాలు ఉన్నాయి.ఊనా నుండి 20 కి.మీ దూరంలో ఉన్న ఆలయం ప్రపంచంలో ఉన్న రెండు బ్రహ్మదేవిని ఆలయాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. మరొకటి పుష్కర్ సరోవర తీరంలో ఉంది.
ఆర్ధికరంగంసవరించు
జిల్లాలో ప్రజలు అధికంగా వ్యవసాయం జీవనాధారవృత్తిగా స్వీకరిస్తున్నారు. ఊనా పాఋఇశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. జిల్లా కుటీరపరిశ్రమల కేమెరంగా ఉంది. కమల్ కథా ఉద్యోగ్, మాస్టర్ కథా ఉద్యోగ్ ప్రధానంగా కథా ఉత్పత్తి చేస్తున్నాయి.అదనంగా జిల్లాలో హిం సిలిండర్స్ (సిలిండర్ తయారీ), హిం అలాయ్స్ (స్టీల్ ఫ్యాక్టరీ) ఉన్నాయి. ఇంటర్నేషనల్ కార్స్, మోటర్ బ్రాంచి ఒకటి ఇక్కడ ఉంది. జీవన్ మార్కెటులో పలు దుకాణాలు ఉన్నాయి.
ప్రయాణ సౌకర్యాలుసవరించు
ఊనా జిల్లా రహదారులతో అనుసంధానించబడి ఉంది. ఒక రైలు మార్గం కూడా ఉంది. జాతీయరహదారి-22 ఊనా నగరం గుండా పయనిస్తుంది. ఊనా ఢిల్లీకి ఉత్తరంలో 375 కి.మీ దూరంలో, చంఢీగడ్ కు 120 కి.మీ దూరంలో ఉంది. జిల్లా బ్రాడ్‌గేజ్ రైలు మార్గంతో అనుసంధానించబడి ఉంది.రాష్ట్రం మొత్తంలో ఉన్న రైలు మార్గం కూడా ఇదొక్కటే. ఇక్కడ నుండి ఢిల్లీ చేరడానికి హిమాచల్ ఎక్స్ప్రెస్, జనశతాబ్ధి ఎక్స్ప్రెస్ దినసరి సేవలు అందిస్తూ ఉన్నాయి. జిల్లా సమీపంలో చంఢీగడ్ విమానాశ్రయం ఉంది.
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 521,057,[1] |
ఇది దాదాపు. | కేప్ వర్డే దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 543వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 338 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. |
16.24%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 997:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాశ్యత శాతం. | 87.23%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
పర్యాటక ఆకర్షణలుసవరించు
- మా చిత్పూర్ణి దేవి ఆలయం: సుందరమైన మా చిత్పూర్ణి దేవి ఆలయం
- శీతలా మాత మందిరం (ఊనా; తక్కా రోడ్డు) : ఈ ఆలయంలో మసూచి, కండ్ల కలక వంటి ఉష్ణ సంబంధిత వ్యాదుల ఉపశమనం కొరకు ప్రార్ధనలు జరుగుతుంటాయి.ఇక్కడ పూజారి ఇచ్చే లాకెట్ వ్యాధులను నయం చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
- శివ్ బారి ఆలయం.
- ధ్యూంసర్ మహాదేవ్ ఆలయం.
- డెరా బాబా రుద్రాశ్రమం
- బాబా బర్బాఘ్ సింఘ్.
- జోగి పంగా.
- జ్యోతి మాతా ఆలయం సమూర్ కలాన్ (ప్రాచీన శివాలయం)
- తనీక్ పురా.
- గరీబ్ నాథ్ మందిర్
- బాబా మోని ఆలయం ఘనారి.
బయటి లింకులుసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Cape Verde 516,100 July 2011 est.