ఊనా
ఊనా హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం, ఊనా జిల్లాకు ముఖ్య పట్టణం. పట్టణ పాలన మునిసిపల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. మున్సిపల్ కౌన్సిల్ కింద 11 వార్డులు ఉన్నాయి. సిక్కుల మొదటి గురువు గురు నానక్ వారసుల నివాసమైన కోట ఊనాలో ఉంది.[1]
ఊనా | |
---|---|
పట్టణం | |
Coordinates: 31°28′05″N 76°16′16″E / 31.468°N 76.271°E | |
దేశం | India |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
జిల్లా | ఊనా |
Elevation | 369 మీ (1,211 అ.) |
జనాభా (2011) | |
• Total | 18,722 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
జనాభా వివరాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఊనా పట్టణ జనాభా 18,722. అందులో 9,851 మంది పురుషులు, 8,871 మంది మహిళలు. అక్షరాస్యత 86.21%, ఇది రాష్ట్ర సగటు 82.80% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 88.84 కాగా, స్త్రీల అక్షరాస్యత 83.29%. ఆరేళ్ల లోపు పిల్లలు 1,954 మంది. జనాభా లింగ నిష్పత్తి 901 పిల్లల లింగ నిష్పత్తి 918. ప్రధానంగా మాట్లాడే భాషలు హిందీ, పంజాబీ.[2]
రవాణా
మార్చురహదారులు
పంజాబ్ సరిహద్దుల నుండి హిమాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించే ప్రధాన ప్రవేశ కేంద్రాలలో ఊనా ఒకటి. నేషనల్ హైవే 503, నేషనల్ హైవే 503 ఎ ద్వారా ఊనా నుండి రాష్ట్రం లోని, దేశం లోని మిగిలిన ప్రాంతాలను చేరుకోవచ్చు. [3]
రైల్వేలు
ఊనా హిమాచల్ రైల్వే స్టేషన్ నుండి చండీగఢ్, ఢిల్లీ లకు రైళ్ళు నడుస్తాయి. అంబాలా కంటోన్మెంటుకు కూడా రైలు సౌకర్యం ఉంది
విమానాశ్రయం
కాంగ్రా విమానాశ్రయం 114 కి.మీ. దూరం లోఉ, చండీగడ్ః అంతర్జాతీయ విమానశ్రయం 127 కి.మీ. దూరం లోనూ ఉన్నాయి
భౌగోళికం, వాతావరణం
మార్చుఊనా 31°29′N 76°17′E / 31.48°N 76.28°E నిర్దేశాంకాల వద్ద ఉంది. సముద్ర మట్తం నుండి ఇది 369 మీటర్ల ఎత్తున ఉంది. చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాల కంటే ఇది చల్లగా ఉన్నప్పటికీ, వేసవిలో ఉష్ణోగ్రతలు 45 °C (113 °F) వరకు చేరతాయి.[4]
శీతోష్ణస్థితి డేటా - Una (1985–2010, extremes 1985–2011) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 31.0 (87.8) |
34.2 (93.6) |
39.4 (102.9) |
43.2 (109.8) |
45.2 (113.4) |
45.2 (113.4) |
42.2 (108.0) |
38.4 (101.1) |
38.6 (101.5) |
35.6 (96.1) |
33.4 (92.1) |
28.2 (82.8) |
45.2 (113.4) |
సగటు అధిక °C (°F) | 19.9 (67.8) |
23.1 (73.6) |
28.1 (82.6) |
34.3 (93.7) |
37.8 (100.0) |
37.9 (100.2) |
33.8 (92.8) |
32.8 (91.0) |
32.8 (91.0) |
31.1 (88.0) |
27.4 (81.3) |
22.3 (72.1) |
30.1 (86.2) |
సగటు అల్ప °C (°F) | 3.2 (37.8) |
5.7 (42.3) |
9.4 (48.9) |
13.5 (56.3) |
18.2 (64.8) |
21.2 (70.2) |
22.1 (71.8) |
21.9 (71.4) |
20.1 (68.2) |
13.8 (56.8) |
8.2 (46.8) |
4.0 (39.2) |
13.4 (56.2) |
అత్యల్ప రికార్డు °C (°F) | −5.8 (21.6) |
−1.6 (29.1) |
3.0 (37.4) |
6.7 (44.1) |
8.6 (47.5) |
14.7 (58.5) |
17.0 (62.6) |
16.3 (61.3) |
13.2 (55.8) |
5.1 (41.2) |
1.8 (35.2) |
−2.4 (27.7) |
−5.8 (21.6) |
సగటు వర్షపాతం mm (inches) | 37.0 (1.46) |
42.4 (1.67) |
42.3 (1.67) |
24.9 (0.98) |
37.1 (1.46) |
89.6 (3.53) |
323.2 (12.72) |
320.3 (12.61) |
162.2 (6.39) |
21.1 (0.83) |
10.7 (0.42) |
20.4 (0.80) |
1,131.2 (44.54) |
సగటు వర్షపాతపు రోజులు | 2.4 | 3.4 | 3.3 | 1.6 | 2.7 | 5.5 | 11.6 | 11.6 | 5.8 | 1.2 | 0.9 | 1.2 | 51.2 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 65 | 63 | 57 | 42 | 41 | 49 | 68 | 72 | 67 | 61 | 58 | 61 | 59 |
Source: India Meteorological Department[5][6] |
చూడదగ్గ ప్రదేశాలు
మార్చు- మాతా చింతాపూర్ణి దేవి మందిరం, భర్వాయ్
- తనీక్ పురా
- శివ మహాదేవ మందిరం, కోట్లా కలాన్
- ధున్సర్ (సదా శివ) మందిర్, తల్మెహ్రా
- శివ బారి మందిర్
- లఖ్దతా పీర్ నిగాహా, బసోలి, ఊనా
- మాతా జమసాని దేవి మందిరం, ధుండ్ల
- గోవింద్ సాగర్ సరస్సు, రాయ్పూర్ మైడియాన్
- బాబా గరీబ్ నాథ్ మందిర్, రాయ్పూర్ మాడియన్
మూలాలు
మార్చు- ↑ "Kila Baba Sahib Singh Ji Bedi Una Sahib". HP Tours. Archived from the original on 16 మే 2018. Retrieved 16 May 2018.
- ↑ "Una Population Census 2011". Census 2011 India. Retrieved 28 April 2018.
- ↑ "National Highways in Himachal Pradesh" (PDF). Himachal Pradesh Public Works Department. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2018. Retrieved 23 May 2018.
- ↑ "India heatwave temperatures pass 50 Celsius". Phys.org. 2 June 2019. Retrieved 2 June 2019.
- ↑ "Station: Una Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 775–776. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 15 February 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M73. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 15 February 2020.