ఊర్మిళ మహంత
ఊర్మిళ మహంత[1] అస్సాం రాష్ట్రానికి చెందిన సినిమా నటి. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నటనలో శిక్షణ పొంది, 2012 తమిళ క్రైమ్ థ్రిల్లర్ వజక్కు ఎన్ 18/9 సినిమాలో తొలిసారిగా నటించింది. అంతకుముందు నాటకాలు, షార్ట్ ఫిల్మ్‌లు, టెలివిజన్ సిరీస్‌లలో కూడా నటించింది. హిందీ, అస్సామీ, బెంగాలీ, మలయాళ చిత్రాలలో నటించింది.
ఊర్మిళ మహంత | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2012-ప్రస్తుతం |
జననం, విద్య
మార్చుఊర్మిళ, గిరిధర్ మహంత - రామలా మహంత దంపతులకు అస్సాం రాష్ట్రం, సోనాపూర్‌లో జన్మించింది. ఊర్మిళకు జుటికా మహంత, మున్మీ మహంత, మునీంద్ర మహంత అని ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు.[2] సోనాపూర్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసిన ఊర్మిళ, కామ్రూప్ జిల్లా, ఖేత్రిలోని డిమోరియా కళాశాల నుండి పట్టభద్రురాలైంది.[2] మహారాష్ట్రలోని ముంబైలో ఎక్కువకాలం గడిపిన[3] ఊర్మిళ, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరింది.[2]
కెరీర్
మార్చుచిన్నప్పటి నుంచి నాటకాల్లో నటించిన మహంత, ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.[2] దూరదర్శన్ లో వచ్చిన మర్డర్, తేజిమోలా వంటి అనేక టెలివిజన్ ధారావాహికలలో నటించింది.[4] 2012 ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ క్రిటిక్ అవార్డు గెలుచుకున్న ఆలియాఫిల్మ్ తోపాటు పలు విమర్శకుల ప్రశంసలు పొందిన దెయిర్ స్టోరీ, చెంగ్ కుర్తి వంటి లఘుచిత్రాలలో నటించింది.[4] అస్సామీ గాయని తరాలి శర్మ రూపొందించిన హెంగులియా ఆల్బమ్ లో కూడా కనిపించింది.
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు హాజరైన సందర్భంలో చూసిన దర్శకుడు బాలాజీ శక్తివేల్ తను రూపొందించిన వజక్కు ఎన్ 18/9 అనే సినిమాలో ఊర్మిళకు అవకాశం ఇచ్చాడు.[3][5] ఇంట్లో పనిమనిషిగా పనిచేసే మురికివాడలో నివసించే జ్యోతి పాత్రలో నటించిన మహంతకు ప్రశంసలు లభించాయి.[6][7][8] [9][6][10]
దిలీప్ కె. ముఖరియా దర్శకత్వం వహించిన పరేషాన్‌పూర్ సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది.[2] 2015లో మొదటి మలయాళ సినిమా ఉడల్, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన అకిరా (హిందీ) సినిమాల్లో నటించింది.[11]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2012 | వజక్కు ఎన్ 18/9 | జ్యోతి | తమిళం | తమిళ అరంగేట్రం |
రుస్తుం యొక్క బల్లాడ్ | Unknown | హిందీ - ఆంగ్లం | ||
2014 | చిరోడిని తుమీ జే అమర్ 2 | జ్యోతి | బెంగాలీ | |
టి,ఆర్.పి. అరు | పల్లవి | అస్సామీ | ||
2015 | మాంఝీ - పర్వత మనిషి | లౌకి | హిందీ | |
పరేషాన్‌పూర్ [12] | రాధిక | |||
2016 | కొతనోడి- ది రివర్ ఆఫ్ ఫాబెల్స్ | కేతేకి | అస్సామీ | |
బోకుల్ | బోకుల్ | |||
అకిరా[13] | అన్నా | హిందీ | ||
ఉడల్ | Unknown | మలయాళం | ||
2017 | పురబ్ కీ ఆవాజ్ [14] | కనక్లత బారువా, ఊర్మిళ | హిందీ, అస్సామీ | |
అంతరీన్ | తోరాలి | అస్సామీ | ||
చకల్లాష్‌పూర్ | చంపా | హిందీ | ||
విరామ్ | మతున్ | |||
2018 | ప్యాడ్ మ్యాన్ | సావిత్రి | ||
2021 | డయల్ 100 | గాయత్రి | జీ5 చిత్రం |
అవార్డులు, నామినేషన్లు
మార్చుసంవత్సరం | అవార్డు | సినిమా | వర్గం | ఫలితం |
---|---|---|---|---|
2012 | 2వ సైమా అవార్డులు | వజక్కు ఎన్ 18/9 | ఉత్తమ సహాయ నటి | ప్రతిపాదించబడింది |
ఉత్తమ తొలి సినిమా నటి | ప్రతిపాదించబడింది | |||
7వ విజయ్ అవార్డులు | ఉత్తమ తొలి సినిమా నటి | ప్రతిపాదించబడింది | ||
2016 | పాట్నా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ | బోకుల్ | ఉత్తమ నటి | గెలుపు |
శైలధర్ బారువా ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటి | గెలుపు | ||
అంతరీన్ | ఉత్తమ నటి | గెలుపు | ||
ప్రాగ్ సినీ అవార్డ్స్ నార్త్-ఈస్ట్ 2016 | ఉత్తమ నటి | గెలుపు |
ఇతర అవార్డులు
మార్చు- 2017లో దాల్మియా భారత్ సిమెంట్ లిమిటెడ్ ద్వారా "యంగ్ అచీవర్స్" అవార్డు
- 2016లో నీడ్స్ ఎన్జీవో నుండి "యూత్ ఆఫ్ ది ఇయర్" అవార్డు
- 2017లో "యూత్ ఐకాన్, డిమోరియా" అవార్డు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-03. Retrieved 2022-02-17.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "The Sentinel". Sentinelassam.com. Archived from the original on 2015-04-09. Retrieved 2022-02-17.
- ↑ 3.0 3.1 "Vazhakku was the best decision I ever made: Urmila Mahanta". Daily News and Analysis. 21 May 2012. Retrieved 2022-02-17.
- ↑ 4.0 4.1 "The Sentinel". Sentinelassam.com. Archived from the original on 2015-04-02. Retrieved 2022-02-17.
- ↑ "Urmila, a fresh face in Kollywood". Deccan Chronicle. Archived from the original on 23 April 2012. Retrieved 2022-02-17.
- ↑ 6.0 6.1 "Vazhakku Enn 18/9 movie review: Wallpaper, Story, Trailer at Times of India". The Times of India. Retrieved 2022-02-17.
- ↑ "Vazhakku Enn 18 / 9 Tamil Movie Review – cinema preview stills gallery trailer video clips showtimes". IndiaGlitz. 3 May 2012. Archived from the original on 2011-04-26. Retrieved 2022-02-17.
- ↑ "Premalo Padithe Movie Review @ 3/5". Aplive.Net. 4 May 2012. Retrieved 31 December 2012.
- ↑ "Movie Review:Vazhakku Enn 18/9". Sify.com. Archived from the original on 8 October 2013. Retrieved 2022-02-17.
- ↑ DNA, Daily News Analysis. "Urmila Mahanta".
- ↑ Soman, Deepa (8 November 2015). "Urmila Mahanta wants to speak Malayalam". The Times of India. Retrieved 2022-02-17.
- ↑ Ashish Roy & Barkha Mathur (26 December 2013). "Now, rustic charm of the region draws Hindi filmmakers too". The Times of India. Nagpur. TNN. Archived from the original on 10 January 2014. Retrieved 2022-02-17.
- ↑ Soman, Deepa (8 November 2015). "Urmila Mahanta wants to speak Malayalam". The Times of India. TNN. Retrieved 2022-02-17.
- ↑ "Hindi film on Kanaklata". The Assam Tribune. Guwahati. 21 September 2015. Archived from the original on 2016-03-04. Retrieved 2022-02-17.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఊర్మిళ మహంత పేజీ