ఊర్మిళ (నటి)

భారతీయ సినీ నటి

ఊర్మిళ మతోండ్కర్ (జననం. 4 ఫిబ్రవరి 1974) ఒక భారతీయ సినీనటి, రాజకీయ నాయకురాలు.[2] ఈమె ప్రధానంగా హిందీ సినిమాల్లో నటించింది. ఇవి కాకుండా కొన్ని తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది.

ఊర్మిళ మతోండ్కర్
2010 లో ఊర్మిళ
జననం (1974-02-04) 1974 ఫిబ్రవరి 4 (వయసు 49)[1]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1980–ప్రస్తుతం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
(మార్చి 2019 — సెప్టెంబరు 2019)
జీవిత భాగస్వామి
Mohsin Akhtar Mir
(m. 2016)

1980 లో మొదటిసారిగా మరాఠీ సినిమా జాకోల్ లో బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించింది. 1981 లో కలియుగ్ అనే హిందీ సినిమాలో కనిపించింది. 1983 లో మసూం అనే సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించింది. 1989 లో మలయాళం సినిమా చాణక్యన్ తో పెద్ద పాత్రలు ధరించడం ప్రారంభించింది. తర్వాత హిందీలో నరసింహా అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు బాగా విజయవంతం అయ్యాయి.

కొద్ది రోజులు ఆమె సినిమాలు పెద్దగా ఆడకపోయినా 1995 లో వచ్చిన రంగీలా సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది. 1997 లో వచ్చిన జుదాయీ, 1998లో వచ్చిన సత్య ఆమెకు మరిన్ని విజయాలు సంపాదించి పెట్టాయి.

ఊర్మిళ నటించిన తెలుగు చిత్రాలు సవరించు

మూలాలు సవరించు

  1. "Urmila Matondkar birthday: You will be surprised to know these facts about the 'Rangeela' actress; see pics". Times Now. 4 February 2019. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  2. "Urmila Matondkar goes underwater for her birthday". Thaindian.com. 4 February 2009. Archived from the original on 16 జూలై 2011. Retrieved 26 February 2011.