ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్

భారతదేశం యొక్క రాజకీయ పార్టీ
(ఎం.ఐ.ఎం నుండి దారిమార్పు చెందింది)

ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఆంగ్లం : All India Majlis-e-Ittehadul Muslimeen) (ఉర్దూ : کل ہند مجلس اتحاد المسلمين, కుల్ హింద్ మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అర్థం: అఖిల భారత సమైక్య ముస్లిం మండలి) భారత్ లోని, ముఖ్యంగా హైదరాబాదు పాతబస్తీలోని ముస్లింల రాజకీయ పార్టీ. ఇది కేవలం హైదరాబాదు పాతనగరానికే పరిమితమై ఉంది. ఆంధ్ర ప్రదేశ్లో కొన్ని ప్రదేశాలలో బలమైన ఉనికి గల పార్టీ. 2004 లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీ ఒక సీటు గెలుపొందింది. 1984-2004 వరకు ఆ.ఇ.మ.ఇ.ము. పార్టీ అధ్యక్షుడిగా సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ ఉన్నాడు. సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అనంతరం తన కుమారుడైన అసదుద్దీన్ ఒవైసీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
کل ہند مجلس اتحاد المسلمين
నాయకత్వంఅసదుద్దీన్ ఒవైసీ
వ్యవస్థాపనబహాదుర్ యార్ జంగ్
స్థాపన1927 లో అబుల్ బయాన్ ఖ్వాజా బహావుద్దీన్
ప్రధాన కార్యాలయందారుస్సలాం బోర్డు హైదరాబాదు
పత్రికఇతేమాద్‌ డైలీ (ఉర్దూ దినపాత్రిక)
సిద్ధాంతంలౌకిక వాద ప్రజాస్వామ్యం
రంగుఆకు పచ్చ
తెలంగాణా అసెంబ్లీ
7 / 119
మహారాష్ట్ర అసెంబ్లీ
2 / 288
లోక్ సభ
1 / 545
ఓటు గుర్తు
గాలిపటం
వెబ్ సిటు
http://www.aimim.in
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ లోగో.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాదు నగర కార్పొరేషన్ లోని 100 స్థానాల్లో 36 స్థానాలు కలిగివున్నది.

చరిత్ర

మార్చు

దీని చరిత్ర పూర్వపు హైదరాబాదు సంస్థానం వరకూ పోతుంది. దీనిని 1927 అబుల్ బయాన్ ఖ్వాజా బహావుద్దీన్ స్థాపించాడు. ఈ పార్టీ నిజాం కాలం నాటి పార్లమెంటరీ పార్టీ. భారత్ స్వాతంత్ర్యం సాధించిన తరువాత, హైదరాబాదు ప్రత్యేక ప్రాంతంగా వుండాలని కాంక్షించింది. రజాకార్లు (వాలంటీర్లు), ఒక ముస్లిం పారా-మిలిటరీ సంస్థ. ఇది మజ్లిస్ పార్టీతో సంబంధాలు కలిగివుండేది. దాదాపు లక్షా యాభైవేలమంది రజాకార్లు, కాసిం రిజ్వీ నాయకత్వాన భారత రక్షక దళాలతోనూ కమ్యూనిస్టులతోనూ స్వతంత్ర హైదరాబాద్ కొరకు పోరాడాయి. పోలీస్-యాక్షన్ ద్వారా హైదరాబాదు సంస్థానం భారత-యూనియన్ లో కలుపబడింది. కాసిం రిజ్వీని కారాగారంలో బంధించి, శాంతిభద్రతల దృష్ట్యా పాకిస్తానుకు పంపించివేశారు. మజ్లిస్ పార్టీ నిషేధించబడింది.[1] 1957లో మజ్లిస్ పార్టీ నూతన హంగులతో పునస్థాపించబడింది. 1970లో రాజకీయ ప్రవేశం గావించింది. ఆల్ ఇండియా అనే ప్రజాస్వామ్య పేరును తగిలించడం జరిగింది. నేటివరకు గల తన ప్రస్థానంలో ప్రజాస్వామ్యయుతంగా తన ఉనికిని కలిగివున్నది.[1] 1990 లో మజ్లిస్ పార్టీ చీలిపోయి, అమానుల్లా ఖాన్ (శాసనసభ్యుడు) నాయకత్వంలో మజ్లిస్ బచావో తెహ్రీక్ అనే కూటమి బయలు దేరినది.

2024 లోక్ సభ ఎన్నికలు

మార్చు

అసదుద్దీన్ ఓవైసి 2004 నుండి వరుసగా 5 సార్లు హైదరాబాద్ స్థానం నుండి గెలుస్తున్నాడు. హైదరాబాద్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మరో సారి మజ్లిస్ పార్టీకే పట్టం కట్టారు. ఈ 18వ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సిటింగ్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి ఏకంగా 3,38,087 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. అసదుద్దీన్ ఓవైసీ ఇంటికి 6,61,981 ఓట్లు రాగా,అయిన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొంపల్ల మాధవీలతకు 3,23,894 ఓట్ల వచ్చాయి. ఈ సారి 61.28% ఓట్లు పోలయినాయి.

లోక్ సభ ఫలితాలు

మార్చు
Year Seats Contested Seats Won Vote Share Seat change
1989 8 1 NA  0
1991 2 1 0.17%  0
1996 2 1 0.10%  0
1998 1 1 0.13%  0
1999 1 1 0.12%  0
2004 2 1 0.11%  0
2009 2 1 0.07%  0
2014 5 1 1.4%  0
Year Seats Contested Seats Won Vote Share Seat change
2019 1 1 58.9%  0
2024 1 1 61.28%  0
2000 0 0 0  0
2000 0 0 0  0
2000 0 0 0  0
2000 0 0 0  0
2000 0 0 0  0
2000 0 0 0  0

source Archived 2012-12-07 at the Wayback Machine

సంవత్సరం పోటిచేసిన స్థానాలు గెలిచిన స్థానాలు ఓట్ల శతం సీట్ల మార్పు
1989 35 4 1.99% -
1994 20 1 0.70%  3
1999 5 4 1.08%  3
2004 7 4 1.05%  0
2009 8 7 0.83%  3
2014 9 7 1.5%  0

మతవాదం

ప్రస్తుత నాయకులు

మార్చు

విమర్శలు

మార్చు

తస్లీమా నస్రీన్ పై దాడి

మార్చు

ఆగస్టు 9, 2007, తస్లీమా నస్రీన్ తన పుస్తకం "శోధ్" తెలుగు భాషలో ఆవిష్కరిస్తున్న వేదికపై మజ్లిస్ పార్టీ ముగ్గురు శాసనసభ్యులు, కార్యకర్తలు పూలకుండీలు, కుర్చీలతో దాడి చేశారు. తస్లీమా నస్రీన్ ను ఇస్లాం-ద్రోహిగా వర్ణిస్తూ నానా హంగామా సృష్షించారు.[2] వీరికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.[3]

కూటమి

మార్చు

ఈ పార్టీ ఉత్తరప్రదేశ్‌లోని అప్నా దళ్ (కామెరవాడి)తో కలిసి పిచ్డా దళిత ముస్లిం అనే రాజకీయ కూటమికి ఏర్పాటు చేసింది.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Article in the Hindu on AIMIM". Archived from the original on 2003-07-29. Retrieved 2010-08-08.
  2. "Taslima Attacked". Archived from the original on 2008-05-25. Retrieved 2009-02-19.
  3. Police lodge case against Taslima Nasreen