లోక్‌సభ

భారతదేశ పార్లమెంటు దిగువసభ
(లోక్ సభ నుండి దారిమార్పు చెందింది)

భారత పార్లమెంటులో దిగువ సభను లోక్‌సభ అంటారు. లోక్‌సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది ప్రజల సభ అయింది. పార్లమెంటులోని రాజ్యసభను ఎగువ సభ అని అంటారు. రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో గరిష్ఠంగా 550 (1950 లో ఇది 500) మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది ప్రజలచేత ఎన్నుకోబడిన సభ్యులు ఉన్నారు.[1][2] వీరిలో 530 మంది రాష్ట్రాల నుండి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైనవారు.[3][4][5] లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు (General Elections) అంటారు. వోటర్ల సంఖ్య రీత్యా, ఎన్నికల పరిమాణం రీత్యా భారత సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికలు.

లోక్‌సభ
18వ లోక్‌సభ
రకం
రకం
నాయకత్వం
ఖాళీ
2019 జూన్ 23 నుండి
నిర్మాణం
సీట్లు543
లోక్‌సభ
రాజకీయ వర్గాలు
పాలకపక్షం (293)
  NDA (293)
  •   BJP (240)
  •   తెదేపా (16)
  •   JD(U) (12)
  •   SHS (7)
  •   LJP(RV) (5)
  •   JD(S) (2)
  •   Janasena Party (2)
  •   RLD (2)
  •   AD(S) (1)
  •   AGP (1)
  •   AJSU (1)
  •   HAM(S) (1)
  •   NCP (1)
  •   SKM (1)
  •   UPPL (1)

Opposition (249)

  INDIA (237)
  •   INC (97)
  •   SP (37)
  •   AITC (29)
  •   DMK (22)
  •   LF (9)
  •   CPI(M) (4)
  •   CPI (2)
  •   CPI(ML)L (2)
  •   RSP (1)
  •   SS(UBT) (9)
  •   NCP(SP) (8)
  •   RJD (4)
  •   AAP (3)
  •   IUML (3)
  •   JMM (3)
  •   JKNC (2)
  •   VCK (2)
  •   BAP (1)
  •   VPP (1)
  •   KEC (1)
  •   MDMK (1)
  •   RLP (1)
  •   IND (3)
Others (12)
  •   వైకాపా (4)
  •   ASP(KR) (1)
  •   SAD (1)
  •   AIMIM (1)
  •   ZPM (1)
  •   IND (4)
Vacant (2)
  •   Vacant (2)[a]
కాలపరిమితి
5 సంవత్సరాలు
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
1951 అక్టోబరు 25 – 1952 ఫిబ్రవరి 21
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2024 ఏప్రిల్ 19 - 2024 జూన్ 1
తదుపరి ఎన్నికలు
2029
సమావేశ స్థలం
భారత పార్లమెంటు స్థానం సంసద్ భవన్ దృశ్యం
లోక్‌సభ ఛాంబర్, సంసద్ భవన్,
118, రఫీ మార్గ్, న్యూ ఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం – 110001
28°37′3″N 77°12′30″E / 28.61750°N 77.20833°E / 28.61750; 77.20833
రాజ్యాంగం
భారత రాజ్యాంగం

చరిత్ర

మార్చు

భారత ఉపఖండంలో ఎక్కువ భాగం 1858 నుండి 1947 వరకు బ్రిటిష్ పాలనలో ఉంది.[6] ఈ కాలంలో బ్రిటీష్ పార్లమెంట్ తన పాలనను నిర్వహించే అధికారంకోసం కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు, సెక్రటరీ ఆఫ్ స్టేట్, భారతదేశ వైస్రాయ్ కార్యాలయం సృష్టించబడ్డాయి. భారతదేశంలోని కార్యనిర్వాహక మండలి, బ్రిటీష్ ప్రభుత్వ ఉన్నత అధికారులను కలిగి ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, అనధికారిక సభ్యులతో కూడిన లెజిస్లేటివ్ కౌన్సిల్ కోసం అందించబడింది. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892 బ్రిటీష్ ఇండియాలోని ప్రతి ప్రావిన్సులలో శాసనసభలను స్థాపించింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికారాలను పెంచింది. ఈ చట్టాలు ప్రభుత్వంలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని పెంచినప్పటికీ, వారి అధికారం పరిమితంగానే ఉంది. ఓటర్లు చాలా తక్కువగా ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 వివిధ కౌన్సిల్‌లలో కొంతమంది భారతీయులను చేర్చుకుంది. భారత ప్రభుత్వ చట్టం 1919 పరిపాలనలో భారతీయుల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించింది, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని సృష్టించింది, దీని కోసం పార్లమెంట్ హౌస్, న్యూఢిల్లీ 1927లో నిర్మించి, ప్రారంభించబడింది.[7]

భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రాంతీయ స్వయంప్రతిపత్తిని ప్రవేశపెట్టింది. భారతదేశంలో సమాఖ్య నిర్మాణాన్ని ప్రతిపాదించింది.[8] 1947 జూలై 18న బ్రిటీష్ పార్లమెంట్ ఆమోదించిన భారత స్వాతంత్ర్య చట్టం 1947, బ్రిటీష్ ఇండియాను (ఇందులో ప్రిన్స్లీ రాష్ట్రాలను చేర్చలేదు) భారతదేశం, పాకిస్తాన్, రెండు స్వతంత్ర దేశాలుగా విభజించారు.అవి ఒక్కొక్కటి ఉండే వరకు కిరీటం క్రింద ఆధిపత్యాలుగా ఉన్నాయి.

భారతదేశం రాజ్యాంగం 1949 నవంబరు 26న ఆమోదించబడింది.1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది, భారతదేశాన్ని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. ఇది భారతదేశాన్ని దాని కొత్త రూపంలో పరిపాలించే భూమి చట్టం స్థాపక సూత్రాలను కలిగి ఉంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 (పార్టు V-ది యూనియన్.) ప్రకారం, భారత పార్లమెంటులో భారత రాష్ట్రపతి, రాష్ట్రాల కౌన్సిల్ (రాజ్యసభ) ప్రజల సభ (లోక్‌సభ) అని పిలువబడే పార్లమెంటు రెండు సభలు ఏర్పడ్డాయి.[9]

లోక్‌సభ (ప్రజల దిగువ సభ) 1951 అక్టోబరు 25 నుండి 1952 ఫిబ్రవరి 21 వరకు జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత 1952 ఏప్రిల్ 17న 1952న మొదటిసారిగా ఏర్పాటు చేయబడింది.[10]

కాల పరిమితి, సమావేశాలు

మార్చు

లోక్‌సభ కాలపరిమితి ఐదేళ్ళు. ఎన్నికలు జరిగిన వెంటనే జరిగే మొదటి సమావేశం తేదీ నుండి 5 సంవత్సరాలకు ఆ లోక్‌సభ గడువు తీరిపోతుంది. అయితే అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఈ పరిమితిని ఒక్కో సంవత్సరం చొప్పున పొడిగించుకుంటూ పోవచ్చు. అయితే, అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తరువాత 6 నెలలకు మించి పొడిగించేందుకు వీలులేదు. అయితే, సభను ఐదేళ్ళ కంటే ముందే రద్దు చేయ్యవచ్చు. సంవత్సరానికి 3 సార్లు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. అందులో మొదటిగా బడ్జెట్ సమావేశం, (మొదటి) 4 నెలలు కాగా సాధారణంగా ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరుగుతుంది. (రెండవ) జూలై, ఆగస్టు, సెప్టెంబరులలో (మూడు) నవంబరు లేదా డిసెంబరు నెలలలో ప్రవేశ పెట్టడం జరగుతుంది.

జీతభత్యాలు

మార్చు

చరణ్‌దాస్‌ మహంత్‌ నేతృత్వంలోని ఎంపీల వేతనాలు, భత్యాల పార్లమెంటరీ సంయుక్త కమిటీ చేసిన సిఫార్సులు:

  • ఎంపీల వేతనాన్ని నెలకు రూ.16 వేల నుంచి రూ.80,001కి పెంచాలి.
  • పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యే ఎంపీకి ఒక రోజుకి ప్రస్తుతం ఇస్తున్న భత్యం రూ.వెయ్యిని రూ.2 వేలకు పెంచాలి.
  • ఎంపీలు తమ నియోజకవర్గాలకు వెళ్లేందుకు 34 ఉచిత విమాన ప్రయాణాలకు అనుమతించాలి.

అధికారాలు

మార్చు

పార్లమెంటులో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రజలసభయైన లోక్‌సభకు విశేష అధికారాలున్నాయి. ఆర్థికాధికారాల్లో, మంత్రిమండలిని తొలగించే విషయంలో లోక్‌సభకు ప్రత్యేక అధికారాలున్నాయి. ఇంకా శాసన నిర్మాణాధికారాలు, ఆర్థిక, న్యాయ సంబంధ, రాజ్యాంగ సవరణ, ఎన్నిక పరమైన, కార్యనిర్వాహక శాఖపై నియంత్రనాధికారాలు లోక్‌సభకు ఉంటాయి.

శాసన నిర్మాణాధికారాలు

మార్చు

ఆర్థిక బిల్లులతోబాటు సాధారణ బిల్లులను కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టవచ్చు.సాధారణ బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్థికేతర, పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించినవి. ఆర్థిక బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంబంధించినవి. సాధారణ బిల్లులను ఏ సభలోనైనా మొదట ప్రవేశపెట్టవచ్చును.

రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ లో పేర్కొన్న అధికారాల జాబితాలో కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలపై లోక్‌సభ శాసనాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాపై కూడా ఇది శాసనాలు చేస్తుంది.

ఆర్థికాధికారాలు

మార్చు

ఆర్థికాధికారాల విషయంలో రాజ్యసభ అధికారాలు నామమాత్రం. లోక్‌సభకు ఆర్థిక విషయాల్లో ఎక్కువ అధికారాలున్నాయి. ఉదాహణకు

  • వార్షికాదాయ, వ్యయ పట్టిక (బడ్జెట్) ను లోక్‌సభలో ప్రవేశపెట్టడం
  • పన్నుల విధింపు, తొలగింపు, తగ్గింపు
  • ప్రభుత్వం చేసే ఋణాలకు పరిమితి విధించడం

ఒక బిల్లు సాధారణ బిల్లు అవుతుందా, ఆర్థిక బిల్లు అవుతుందా అనే విషయాన్ని లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తాడు. లోక్‌సభ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి లేదు.స్పీకర్ ఒక బిల్లును ఆర్థిక బిల్లు అని ధ్రువీకరించిన తర్వాత రాష్ట్రపతి అనుమతితోనే మొదట దాన్ని లోక్‌సభలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాజ్యసభకు పంపుతారు. రాజ్యసభ దాన్ని 14 రోజుల్లోగా అనుమతించి తిరిగి లోక్‌సభకు పంపాలి. ఏ కారణంతోనైనా రాజ్యసభ ఆర్థిక బిల్లును ఆమోదించక చేర్పులు, మార్పులను సూచించి పంపితే, లోక్‌సభ ఆ ప్రతిపాదనలను ఆమోదించవచ్చు.

న్యాయ సంబంధమైన అధికారాలు

మార్చు

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, యు.పి.ఎస్.సి ఛైర్మన్ మొదలైనవారి తొలగింపు విషయంలో లోక్‌సభకు అధికారం ఉంటుంది. రాష్ట్రపతిని తొలగించేందుకు ఏ సభలోనైనా మొదట మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే మొదట రాజ్యసభలోనే అభియోగ తీర్మానం ప్రవేశపెట్టాలి.

రాజ్యాంగ సవరణ అధికారం

మార్చు

368 నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లోక్‌సభకు ఉంది. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును కూడా ఉభయ సభలు ఆరు నెలల్లోగా ఆమోదించాలి. ఒకవేళ అలా ఆమోదించకపోతే ఆ బిల్లు విరిగిపోతుంది. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అవకాశం లేదు.

ఎన్నిక పరమైన అధికారాలు

మార్చు

రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం నియోజక గణంలో లోక్‌సభ భాగంగా ఉంటుంది. అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా భాగంగా ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొంటారు. లోక్‌సభ స్పీకర్ ను, ఉప స్పీకర్ ను లోక్‌సభ సభ్యులే ఎన్నుకుంటారు. రాజ్యసభ ఛైర్మన్ ను మాత్రం రాజ్యసభ సభ్యులు ఎన్నుకోరు. ఉపరాష్ట్రపతే రాజ్యసభకు ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు. రాజ్యసభ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ ని ఎన్నుకుంటారు. లోక్‌సభ వివిధ పార్లమెంటరీ కమిటీలకు సభ్యులను ఎన్నుకుంటుంది. పార్లమెంటు చేపట్టాల్సిన విధులు, బాధ్యతలు పెరగడం, పార్లమెంటు సమావేశాల కాలవ్యవధి తక్కువగా ఉండటం వలన పార్లమెంటు తన విధులు, బాధ్యతలు నెరవేర్చేందుకు పార్లమెంటరీ కమిటీలు సహాయం చేస్తాయి. ఉదాహరణకు అంచనాల సంఘం, ప్రణాళికా సంఘం మొదలైనవి.

నియంత్రణాధికారం

మార్చు

లోక్‌సభ అధికారాల్లో కార్యనిర్వాహక వర్గం కూడా ఒకటి. అంటే మంత్రిమండలిని నియంత్రించడం. భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలి లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలిలో ఎక్కువ లోక్‌సభ సభ్యులే కావడంతో లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. లోక్‌సభ విశ్వాసం పొందినంత కాలం మాత్రమే మంత్రిమండలి అధికారంలో ఉండి, విశ్వాసం కోల్పోయిన తర్వాత వైదొలగాల్సి ఉంటుంది. కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణను లోక్‌సభ రెండు రకాలుగా చేపడుతుంది.

  1. ప్రభుత్వ వ్యవహారాల గురించి సమాచారాన్ని తెలుసుకోవడం
  2. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం లేదా విమర్శించడం

వీటికోసం వివిధ పార్లమెంటరీ ప్రక్రియలను అనుసరిస్తుంది. ఈ ప్రక్రియల్లో ప్రశ్నోత్తరాలు, తీర్మానాలు ఉంటాయి.

అర్హతలు

మార్చు

అర్టికల్ 84 (పార్టు V) [11] భారత రాజ్యంగం ప్రకారం లోక్‌సభ సభ్యునికి ఈక్రింది అర్ఘతలు ఉండాలి.

  • భారతీయ పౌరులై ఉండాలి
  • 25 ఏళ్ళ వయసు నిండి ఉండాలి.
  • పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
  • భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా ఓటర్ల జాబితాలో తన పేరును కలిగి ఉండాలి.
  • నామినేషన్ తో పాటు రూ. 25000/- చెల్లించాలి.

అనర్హతలు

మార్చు
  • ఒక వ్యక్తి ఏక కాలంలో ఉభయ సభల్లో సభ్యుడిగా కొనసాగలేడు.
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయం పొందే పదవిలో ఉండటం
  • మతిస్థిమితం లేనివాడని న్యాయస్థానం ధ్రువీకరించడం

ఒక వ్యక్తి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగడానికి అర్హత కోల్పోయాడా లేదా అనేది రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. దీనికోసం మొదట ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకుంటారు.

కాలక్రమేణా లోక్‌సభ ఏర్పాటు

మార్చు

1950 జనవరి 26 న రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52 లో జరిగాయి. మొదటి ఎన్నికైన లోక్‌సభ ఏప్రిల్, 1952 న అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి వివిధ లోక్‌సభల వివరాలు ఇలా ఉన్నాయి:

ప్రధానమంత్రుల జాబితా

మార్చు
కాలక్రమేణా లోక్‌సభ ఏర్పాటు
లోక్‌సభ ప్రారంభించిన తేదీ ప్రధాని ఉప ప్రధానమంత్రి
1వ లోక్‌సభ 1952 మే 13 జవహర్‌లాల్ నెహ్రూ ఖాళీ
2వ లోక్‌సభ 1957 ఏప్రిల్
3వ లోక్‌సభ 1962 ఏప్రిల్ జవహర్‌లాల్ నెహ్రూ,

లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరా గాంధీ

4వ లోక్‌సభ 1967 మార్చి ఇందిరా గాంధీ మొరార్జీ దేశాయ్ (1969 వరకు)
5వ లోక్‌సభ 1971 మార్చి ఖాళీ
6వ లోక్‌సభ 1977 మార్చి మొరార్జీ దేశాయ్

చరణ్ సింగ్

చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్

యశ్వంత్ రావ్ చవాన్

7వ లోక్‌సభ 1980 జనవరి ఇందిరా గాంధీ

రాజీవ్ గాంధీ

ఖాళీ
8వ లోక్‌సభ 1984 డిసెంబరు రాజీవ్ గాంధీ
9వ లోక్‌సభ 1989 డిసెంబరు విశ్వనాధ్ ప్రతాప్ సింగ్

చంద్రశేఖర్

దేవీలాల్
10 లోక్‌సభ 1991 జూన్ పి. వి. నరసింహారావు ఖాళీ
11వ లోక్‌సభ 1996 మే అటల్ బిహారీ వాజ్‌పేయి

హెచ్.డి.దేవెగౌడ ఐ. కె. గుజ్రాల్

12వ లోక్‌సభ 1998 మార్చి అటల్ బిహారీ వాజ్‌పేయి
13వ లోక్‌సభ 1999 అక్టోబరు లాల్ కృష్ణ అద్వానీ
14వ లోక్‌సభ 2004 మే మన్మోహన్ సింగ్ ఖాళీ
15వ లోక్‌సభ 2009 మే
16వ లోక్‌సభ 2014 మే నరేంద్ర మోడీ
17వ లోక్‌సభ 2019 మే
18వ లోక్‌సభ 2024 జూన్

స్పీకర్లు జాబితా

మార్చు
లోక్‌సభ ఏర్పాటు సభాపతి (స్పీకరు)
1వ లోక్‌సభ| 1952 ఏప్రిల్ జి.వి.మావలాంకర్

ఎం.ఎ. అయ్యంగార్

2వ లోక్‌సభ 1957 ఏప్రిల్ ఎం.ఎ. అయ్యంగార్
3వ లోక్‌సభ 1962 ఏప్రిల్ సర్దార్ హుకం సింగ్
4 లోక్‌సభ 1967 మార్చి నీలం సంజీవరెడ్డి,

జి.ఎస్.ధిల్లాన్

5వ లోక్‌సభ 1971 మార్చి జి.ఎస్.ధిల్లాన్,

బలీ రామ్ భగత్

6వ లోక్‌సభ 1977 మార్చి కె.ఎస్.హెగ్డే
7వ లోక్‌సభ 1980 జనవరి బలరామ్ జాఖర్
8వ లోక్‌సభ 1984 డిసెంబరు బలరామ్ జాఖర్
9వ లోక్‌సభ 1989 డిసెంబరు రబీ రాయ్
10వ లోక్‌సభ 1991 జూన్ శివరాజ్ పాటిల్
11వ లోక్‌సభ 1996 మే పి.ఎ.సంగ్మా
12వ లోక్‌సభ 1998 మార్చి జి.ఎం. బాలయోగి,
13వ లోక్‌సభ 1999 అక్టోబరు జి.ఎం. బాలయోగి,

మనోహర్ జోషి

14వ లోక్‌సభ 2004 మే సోమనాథ్ చటర్జీ
15వ లోక్‌సభ 2009 మే మీరా కుమార్
16వ లోక్‌సభ 2014 మే సుమిత్ర మహాజన్
17 లోక్‌సభ 2019 మే ఓం బిర్లా
18వ లోక్‌సభ 2024 జూన్ 26 ఓం బిర్లా

గమనిక:17 వ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. 2019 జూన్ నుండి వరపసగా 18వ లోక్‌సభకు ప్రస్తుత స్పీకరుగా కొలసాగుచున్నారు.

  • ఐదవ లోక్‌సభ సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆత్యయిక పరిస్థితి విధించి, సభ కాలపరిమితిని పొడిగించింది. లోక్‌సభ చరిత్రలో కాలపరిమితి పొడిగించబడిన సభ ఇదే.

సభా నిర్వహణ

మార్చు

లోక్‌సభా నిర్వహణ బాధ్యతను స్పీకర్ నిర్వహిస్తారు. సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌కు సహాయంగా ఒక డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఎనుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్‌సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు ఒక తాత్కాలిక స్పీకరును సభులలో ఒకరిని ఎంచుకుంటారు. సాధారణంగా అనుభవజ్ఞుడైన సభ్యుని ఎంచుకోవడం రివాజు. తరువాత స్పీకరు ఎన్నిక జరుగుతుంది. ఆపై, సభా నిర్వహణ బాధ్యత పూర్తిగా స్పీకరుదే. సభానిర్వహణ కొరకు వివిధ నిబంధనలు ఏర్పాటయ్యాయి. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ ప్రవర్తనా నియమావళి ఉంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కొరకు బిజినెస్ ఎడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది.

శూన్య సమయం (జీరో అవర్)

మార్చు

జీరో అవర్ అనేది భారత పార్లమెంటు సొంతంగా రూపొందించుకున్న పద్ధతి. 1962లో పార్లమెంటులో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత జీరో అవర్ ఉంటుంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం 11 గంటలకు, జీరో అవర్ 12గంటలకు ప్రారంభమౌతాయి. ఇందులో ఎలాంటి నోటీసు లేకుండా ప్రశ్నలడగవచ్చు.

సమావేశాలు

మార్చు

లోక్‌సభ సమావేశాలు సాధారణంగా ఉ.11 గంటల నుండి మ.1 వరకు, మళ్ళీ మ.2 నుండి 6 వరకు జరుగుతాయి. విషయ ప్రాముఖ్యతను బట్టి ఈ సమయాలు పొడిగించబడటం జరుగుతూ ఉంటుంది. కనీస సంఖ్యలో సభ్యులు ఉంటేనే సమావేశం మొదలవుతుంది. ఈ సంఖ్యను కోరం అంటారు. లోక్‌సభకు కోరం - స్పీకరుతో కలిపి 55. కొత్తగా ఎన్నికై, ఇంకా ప్రమాణస్వీకారం చెయ్యని సభ్యులు ఉంటే, వారి చేత ముందు ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇటీవలి కాలంలో గతించిన ప్రస్తుత లేదా పూర్వపు సభ్యుల పట్ల సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు.

లోక్‌సభలో కింది ముఖ్యమైన వ్యాపకాలు చేపడతారు.

  • ప్రశ్నోత్తరాలు: సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రుల సమాధానాలు ఇస్తారు. ప్రశ్నల్లో మూడు రకాలు ఉంటాయి. అవి:
    • నక్షత్ర గుర్తు గల ప్రశ్నలు. వీటికి మంత్రులు సభలో జవాబిస్తారు. వీటికి అనుబంధ ప్రశ్నలు కూడా అడగవచ్చు
    • నక్షత్ర గుర్తు లేనీ ప్రశ్నలు: వీటికి రాతపూర్వక సమాధానాలు ఇస్తారు. వీటికి అనుబంధ ప్రశ్నలు ఉండవు.
    • స్వల్ప అవధి ప్రశ్నలు: పై రెండు రకాల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు కనీసం 10 రోజుల వ్యవధి ఉంటుంది. విషయ ప్రాముఖ్యతను బట్టి కొన్ని ప్రశ్నలకు మరింత త్వరగా సమాధాన్ని సభ్యులు ఆశించవచ్చు. వీటిని స్వల్ప అవధి ప్రశ్నలు అంటారు. స్పీకరు అనుమతితో ఇటువంటి ప్రశ్నలు అడగవచ్చు.
  • ఇతరత్రా వ్యాపకాలు: ప్రశ్నోత్తరాల సమయం ముగిసాక, ఈ కార్యక్రమం చేపడతారు. వాయిదా తీర్మానాలు, హక్కుల తీర్మానాలు, అధికార పత్రాల సమర్పణ, రాజ్యసభ సందేశాలు, సభాసంఘాల నియామకాలు, నివేదికలు, రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన బిల్లుల వివరాలు మొదలైనవి ఇందులో ఉంటాయి.
  • ప్రధాన వ్యాపకం: వివిధ రకాలైన బిల్లులు, సాధారణ బడ్జట్, రైల్వే బడ్జట్ వంటి ఆర్థిక అంశాలు, ప్రభుత్వం గానీ, లేదా ప్రైవేటు సభ్యుడు గానీ ప్రవేశపెట్టే తీర్మానాలు ఈ సమయంలో చేపడతారు.

పై వ్యాపకాలు కాక, అరగంట చర్చలు, అత్యవసర ప్రజా ప్రాముఖ్య విషయాలు కూడా సభాకార్యక్రమాల్లో భాగం.

తీర్మానాలు

మార్చు

తీర్మానాల్లో అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానం మొదలైనవి ఉన్నాయి

అవిశ్వాస తీర్మానం

మార్చు

ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తివంతమైన రాజ్యాంగ పద్ధతుల్లో అవిశ్వాస తీర్మానం ఒకటి. దీన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి. అవిశ్వాస తీర్మానం ఫలానా అంశంపై అని చెప్పనవసరం లేదు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయి. ఈ తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ స్వీకరించడానికి కనీసం 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయాధికారం స్పీకర్ కు ఉంటుంది.

విశ్వాస తీర్మానం

మార్చు

దీన్ని కూడా లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. అధికార పక్షం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. విశ్వాస తీర్మానంపై చర్చ, ఆ తరువాత ఓటింగ్ జరుగుతాయి. ఓటింగ్ లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాలి. భారతదేశం పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా విశ్వాస తీర్మానాన్ని 1979, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. అప్పటి చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని సభావిశ్వాసాన్ని పొందవలసిందిగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆదేశించారు. దాంతో భారతదేశ పార్లమెంటరీ సంప్రదాయాల్లో విశ్వాస తీర్మానం ఆచరణలోకి వచ్చింది.

వాయిదా తీర్మానం

మార్చు

ప్రజాప్రాముఖ్యం ఉన్న ఆకస్మిక లేదా హఠాత్ సంఘటనలను చర్చించడానికి స్పీకర్ అనుమతితో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. వాయిదా తీర్మానం అనుమతి పొందితే సభలో మిగిలిన వ్యవహారాలన్నీ వాయిదా వేస్తారు. ఈ తీర్మానం యొక్క ముఖ్యోద్దేశం ముఖ్యమైన విషయం మీదకు సభ దృష్టిని మళ్ళించడం. ఈ తీర్మానంపై ఓటింగ్ జరగదు.

సావధాన తీర్మానం

మార్చు

ప్రజాప్రాముఖ్యం ఉన్న సమస్యను అత్యవసరంగా చర్చించేందుకు, ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ తీర్మానం ముఖ్యోద్దేశం సమస్యపై సంబంధిత మంత్రి నుంచి అధికారిక వ్యాఖ్యను కోరడం. సభ నియమాల ప్రకారం కనీసం ఇద్దరు సభ్యులు స్పీకర్ కు ఒక గంట ముందు నోటీసు ఇవ్వాలి.స్పీకర్ అనుమతి లభిస్తే 2.30 గంటలపాటు చర్చ జరుగుతుంది. ఒక విధంగా ఇది ప్రభుత్వ మందకొడితనానికి చికిత్స లాంటిది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు, వనరులు

మార్చు
  1. "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2023-12-08. Retrieved 2023-12-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. https://www.mea.gov.in/Uploads/PublicationDocs/19167_State_wise_seats_in_Lok_Sabha_18-03-2009.pdf
  3. EENADU (30 April 2024). "ఏ సభలో ఎంత మంది సభ్యులు?". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  4. "Parliament of India: Lok Sabha". Archived from the original on 1 జూన్ 2015. Retrieved 23 డిసెంబరు 2018.
  5. Part V—The Union. Article 83. p. 40 Archived 24 జనవరి 2013 at the Wayback Machine
  6. "Indian Freedom Struggle (1857–1947) – Culture and Heritage – Know India: National Portal of India". Archived from the original on 22 July 2013.
  7. The Journal of Parliamentary Information, Volume 46 (2000), pg. 400
  8. "Government of India Act of 1935 – Dictionary definition of Government of India Act of 1935". encyclopedia.com. Archived from the original on 12 June 2018. Retrieved 10 May 2018.
  9. Part V—The Union. Article 79. p. 38 Archived 24 జనవరి 2013 at the Wayback Machine
  10. "How India pulled off its first general election". The Indian Express (in ఇంగ్లీష్). 12 April 2024. Retrieved 14 April 2024.
  11. Part V—The Union. Article 81. p. 41 Archived 24 జనవరి 2013 at the Wayback Machine

బయటి లంకెలు

మార్చు


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు

"https://te.wikipedia.org/w/index.php?title=లోక్‌సభ&oldid=4309080" నుండి వెలికితీశారు