మల్లనగౌడ బసనగౌడ పాటిల్ (జననం 1964 అక్టోబరు 7) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదు సార్లు శాసనసభ సభ్యుడిగా, ఒకసారి పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఎంబి పాటిల్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) & కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) లో అనేక పదవులను నిర్వహించాడు.

ఎం.బీ. పాటిల్
ఎం.బీ. పాటిల్

7 అక్టోబర్ 1964 (వయస్సు 59)


క్యాబినెట్ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
20 మే 2023
గవర్నరు థావర్‌చంద్ గెహ్లాట్
పదవీ కాలం
28 డిసెంబర్ 2018 – 23 జులై 2019
గవర్నరు వాజుభాయ్ వాలా
ముందు జీ. పరమేశ్వర
తరువాత బసవరాజ్ బొమ్మై
పదవీ కాలం
20 మే 2013 – 17 మే 2018
గవర్నరు వాజుభాయ్ వాలా
ముందు బసవరాజ్ బొమ్మై
తరువాత డీ.కే. శివ కుమార్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2008
నియోజకవర్గం బబలేశ్వర్
పదవీ కాలం
2004 – 2008
నియోజకవర్గం తికోట
పదవీ కాలం
1991 – 1994
నియోజకవర్గం తికోట

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
10 మార్చి 1998 – 3 అక్టోబర్ 1999
ముందు బసనగౌడ రుద్రగౌడ పాటిల్
తరువాత బసనగౌడ పాటిల్ యత్నల్
నియోజకవర్గం బీజాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-10-07) 1964 అక్టోబరు 7 (వయసు 59)
విజయపుర, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఆశ పాటిల్
నివాసం బీజాపూర్

ఎంబి పాటిల్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కర్ణాటక ప్రభుత్వంలో పెద్ద & మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రిగా పనిచేశాడు.[1]

జననం, విద్యాభాస్యం మార్చు

ఎంబీ పాటిల్ 1964 అక్టోబరు 7న ప్రముఖ విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు దివంగత బీఎం పాటిల్, కమలాబాయి దంపతులకు జన్మించాడు. ఆయన వచన పితామహ పీజీ హలకట్టి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

ఎంబీ పాటిల్ 1991లో తన తండ్రి బీఎం పాటిల్ మరణానంతరం తికోట నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత ఆ తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. ఎంబీ పాటిల్ 1998లో లోక్‌సభ ఎన్నికల్లో బీజాపూర్ నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఎంబీ పాటిల్ 2004లో తికోట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత విజయపూర్ జిల్లాలోని బబలేశ్వర్ నియోజకవర్గం నుంచి 2008, 2013, 2018లో జరిగిన ఎన్నికల్లో వరుసగా హ్యాట్రిక్ సాధించాడు. ఆయన 2013లో సిద్ధరామయ్య మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, నీటిపారుదల శాఖ మంత్రిగా కర్ణాటకలో అంతటా నిలిచిపోయిన వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు కొత్త జీవం పోశాడు.

ఎంబీ పాటిల్ 2018 లో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. హెచ్‌డీ కుమారస్వామి మంత్రివర్గంలో హోంమంత్రిగా పనిచేశాడు.[2] ఆయన ఆ తరువాత ఏఐసీసీ, కేపీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. ఆయన 2023లో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి సిద్ధరామయ్య మంత్రివర్గంలో ప్రభుత్వంలో పెద్ద & మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3]

మూలాలు మార్చు

  1. "Meet five-time MLA and new Karnataka Minister MB Patil" (in ఇంగ్లీష్). 20 May 2023. Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  2. The Times of India (13 April 2019). "State home minister MB Patil hits out at DKS for Lingayat apology". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  3. ETV Bharat News (31 May 2023). "Priyank Kharge is now Karnataka IT & BT Minister, M B Patil given additional charge of Infra Development" (in ఇంగ్లీష్). Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.