జీ. పరమేశ్వర
జీ. పరమేశ్వర కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కొరటగెరె నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 20న రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1]
జీ. పరమేశ్వర | |||
| |||
ఉప ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 23 మే 2018 – 23 జులై 2019 | |||
గవర్నరు | వాజుభాయ్ వాలా | ||
---|---|---|---|
ముందు |
| ||
తరువాత |
| ||
నియోజకవర్గం | కొరటగెరె | ||
అధ్యక్షుడు, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
| |||
ముందు | ఆర్. వీ. దేశపాండే | ||
తరువాత | దినేష్ గుండు రావు | ||
శాసనమండలిలో అధికార పక్ష నాయకుడు
| |||
గవర్నరు | వాజుభాయ్ వాలా | ||
ముందు | ఎస్. ఆర్. పాటిల్ | ||
తరువాత | జయమాల రామచంద్ర | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తుంకూర్, కర్ణాటక, భారతదేశం | 1951 ఆగస్టు 6||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ (since 1989) | ||
తల్లిదండ్రులు |
| ||
జీవిత భాగస్వామి | కనికా పరమేశ్వరి పరమేశ్వర (m.1982) | ||
సంతానం | శానా పరమేశ్వర్ (కూతురు) | ||
నివాసం | బెంగుళూరు |
నిర్వహించిన పదవులు
మార్చు- 1989లో మధుగిరి నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి జనతాదళ్‌కు చెందిన సి.రాజవర్ధన్‌పై పరమేశ్వర గెలుపొందాడు.
- 1993లో, వీరప్ప మొయిలీ మంత్రివర్గంలో పరమేశ్వర సెరికల్చర్ మంత్రిగా పనిచేశాడు.
- 1999లో జరిగిన ఎన్నికల్లో మధుగిరి నుంచి పరమేశ్వర 55,802 ఓట్ల తేడాతో గెలిచి రికార్డు సృష్టించారు. ఆ ఏడాది ఎన్నికల్లో ఇదే అతిపెద్ద విజయం.
- 1999 నుండి 2004 వరకు, ఎస్.ఎమ్. కృష్ణ క్యాబినెట్‌లో తుమకూరు జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్నత విద్య & సైన్స్ & టెక్నాలజీ రాష్ట్ర (స్వతంత్ర బాధ్యత) మంత్రిగా పనిచేశాడు.
- 2001 ఆగస్టు 18న, నఫీసా ఫజల్‌తో మెడికల్ ఎడ్యుకేషన్ కోసం సైన్స్ & టెక్నాలజీని ఎక్స్ఛేంజ్ చేస్తూ అతను మెడికల్ ఎడ్యుకేషన్ (ఆరోగ్య మంత్రికి అనుబంధం) రాష్ట్ర మంత్రిగా నియమితుడయ్యాడు.
- 2002 జూన్ 27న, ముఖ్యమంత్రి SM కృష్ణ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా పదోన్నతి లభించింది. 2003 డిసెంబరున, ఐ & పీఆర్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు
- 2004లో మధుగిరిలో తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థి కెంచమరయ్య హెచ్‌పై గెలిచాడు.
- 2007 నుండి 2009 వరకు, డాక్టర్ జి. పరమేశ్వర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా పనిచేశాడు. 2008లో కొరటగెరె నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు
- 2010 అక్టోబరు 27న, ఆర్.వి దేశపాండే స్థానంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.
- 2014 జూలై 1న శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- 2015 అక్టోబరు 30న, కె.జె జార్జ్ స్థానంలో ఆయన కర్ణాటక హోం మంత్రిగా నియమితులయ్యాడు.
- 2016 జనవరి 15న చిక్‌మగళూరు జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమితులయ్యాడు.
- 2017 జూన్ 24న, అతను రాష్ట్ర ప్రచారాన్ని చూసేందుకు చిక్కమగళూరు జిల్లా ఇంఛార్జి మంత్రితో పాటు హోం మంత్రి పదవికి రాజీనామా చేశాడు
- 2018 మే 15న, కొరటగెరె నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు 2018 మే 23న, కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
- 2018 జూన్ 8న, "కర్ణాటక హోం శాఖ (ఇంటెలిజెన్స్ మినహా), బెంగళూరు డెవలప్‌మెంట్ ( BBMP, BDA, BWSSB, BMRDA, పట్టణాభివృద్ధి శాఖ నుండి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్) , యువజన సాధికారత & క్రీడల శాఖ" బాధ్యతలు చేపట్టారు.
- 2018 జూలై 31న, డాక్టర్ జి. పరమేశ్వర బెంగుళూరు అర్బన్& తుమకూరు జిల్లా -ఇంఛార్జి మంత్రిగా నియమితులయ్యాడు.
- 2022 ఆగస్టు 01న, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, 2023 కర్ణాటక శాసనసభకు పార్టీ మేనిఫెస్టోను తయారు చేసేందుకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి 'మేనిఫెస్టో, పాలసీ అండ్ విజన్ కమిటీ 2023' ఛైర్మన్‌గా డాక్టర్ జి. పరమేశ్వరను నియమించింది.
- 2023 మే 13న, కొరటగెరె నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు
- 2023 మే 20న సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు[2][3]
మూలాలు
మార్చు- ↑ Eenadu (21 May 2023). "అష్టదిగ్గజాలే". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
- ↑ Sakshi (27 May 2023). "కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
- ↑ Namasthe Telangana (27 May 2023). "కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సిద్ధూ దగ్గరే ఆర్థిక శాఖ.. డీకేకు నీటి పారుదల శాఖ". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.