ఎం. పతంజలి శాస్త్రి

భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి

మందకొలత్తూరు పతంజలి శాస్త్రి (1889, జనవరి 4 - 1963, మార్చి 16) భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి. 1951 నవంబరు 7 నుండి 1954 జనవరి 3 వరకు ఆ పదవిలో పనిచేశాడు.

ఎం. పతంజలి శాస్త్రి
ఎం. పతంజలి శాస్త్రి


పదవీ కాలం
1951 నవంబరు 7 – 1954 జనవరి 3
నియమించిన వారు బాబూ రాజేంద్ర ప్రసాద్
ముందు హీరాలాల్ జెకిసుందాస్ కనియా
తరువాత మెహర్ చంద్ మహాజన్

వ్యక్తిగత వివరాలు

జననం (1889-01-04)1889 జనవరి 4
మందకొలత్తూరు, మద్రాసు, తమిళనాడు[1]
మరణం 1963 మార్చి 16(1963-03-16) (వయసు 74)
ఢిల్లీ
సంతానం 7

జననం, విద్య

మార్చు

పతంజలి శాస్త్రి 1889, జనవరి 4న తమిళనాడు రాష్ట్రం, మద్రాసు సమీపంలోని మందకొలత్తూరులో జన్మించాడు. ఇతని తండ్రి పండిట్ కృష్ణ శాస్త్రి, మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాల సీనియర్ సంస్కృత పండితుడిగా పనిచేశాడు. పతంజలి శాస్త్రి మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బిఎలో పట్టభద్రుడయ్యాడు. 1910లో ఎల్‌.ఎల్‌.బి పూర్తిచేసి, 1912లో న్యాయవాదిగా మారాడు. 

న్యాయవాదిగా

మార్చు

శాస్త్రి 1914లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, కొంతకాలం ప్రాక్టీస్ చేశాడు. పన్ను చట్టంలో ప్రత్యేకించి చెట్టియార్ క్లయింట్‌ల వద్ద ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తిగా పేరు పొందాడు. 1922లో ఆదాయపు పన్ను కమిషనర్‌కు స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమించబడ్డాడు. 1939 మార్చి 15న బెంచ్‌కి ఎదిగాడు. ఈ సమయంలో సర్ సిడ్నీ వాడ్స్‌వర్త్‌తో కలిసి మద్రాసు వ్యవసాయదారుల రుణ ఉపశమన చట్టం ఆమోదించిన తర్వాత సంక్లిష్టమైన కేసులను విచారించాడు.[2] ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాకు నియమించబడిన తన సన్నిహిత మిత్రుడు సర్ శ్రీనివాస వరదాచారియర్ స్థానంలో ఉన్నాడు.[3]

1947 డిసెంబరు 6న, మద్రాసు హైకోర్టులో సీనియారిటీలో అప్పటికి మూడవ స్థానంలో, ఫెడరల్ కోర్టుకు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు, అది తరువాత సుప్రీంకోర్టుగా మారింది. 1951 నవంబరు 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సర్ హరిలాల్ కనియా, ఆకస్మిక మరణంతో, అత్యంత సీనియర్-అసోసియేట్ జస్టిస్‌గా శాస్త్రి ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడై, 1954 జనవరి 3న పదవీ విరమణ వయస్సు వచ్చేవరకు పనిచేశాడు.[4][5]

1953లో ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్‌గా నియమితుడై, 1956 వరకు ఆ హోదాలో పనిచేశాడు. పదవీ విరమణ సమయంలో, శాస్త్రి ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ ఢిల్లీ శాఖలో చురుకుగా కొనసాగాడు. భారత విమానయాన సంస్థల జాతీయీకరణను పర్యవేక్షించే ఎయిర్‌లైన్స్ కాంపెన్సేషన్ కమిషన్‌కు నాయకత్వం కూడా వహించాడు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డు సభ్యునిగా కూడా పనిచేశాడు. 1958 జూలై నుండి 1962 ఏప్రిల్ వరకు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో పనిచేశాడు. 1959 నుండి కేంద్ర సంస్కృత బోర్డుకు, తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విద్యాపీఠానికి అధ్యక్షత వహించాడు.[6]

పతంజలి శాస్త్రి 1963, మార్చి 16న గుండెపోటుతో ఢిల్లీలోని తన అల్లుడు నివాసంలో మరణించాడు.[7] లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విశిష్ట ప్రొఫెసర్ అవనిధర్ సుబ్రహ్మణ్యం, బెంగళూరులోని వైదేహి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ మందకులుటూరు సుబ్రహ్మణ్య గణేష్ అతని ముని మనవలు.

మూలాలు

మార్చు
  1. "Sastri was first Tamilian Supreme Court Chief Justice". The New Indian Express. 3 July 2013. Archived from the original on 2016-09-22. Retrieved 2022-10-13.
  2. "Homage to Patanjali Sastri". The Indian Express. 17 March 1963. p. 7. Retrieved 2022-10-13.
  3. Gardbois Jr., George H. (2011). Judges of the Supreme Court of India 1950-1989. Oxford University Press. pp. 20–30. ISBN 978-0-19-807061-0.
  4. "M. Patanjali Sastri". supremecourtofindia.nic.in. Retrieved 2022-10-13.
  5. Gardbois Jr., George H. (2011). Judges of the Supreme Court of India 1950-1989. Oxford University Press. pp. 20–30. ISBN 978-0-19-807061-0.
  6. Gardbois Jr., George H. (2011). Judges of the Supreme Court of India 1950-1989. Oxford University Press. pp. 20–30. ISBN 978-0-19-807061-0.
  7. "Homage to Patanjali Sastri". The Indian Express. 17 March 1963. p. 7. Retrieved 2022-10-13.