ఎం. బి. రాజేష్
ఎం. బి. రాజేష్ (జననం 12 మార్చి 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాలక్కాడ్ నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
ఎం. బి. రాజేష్ | |||
| |||
కేరళ స్వపరిపాలన & ఎక్సైజ్ శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 6 సెప్టెంబర్ 2022 | |||
ముందు | ఎం.వి. గోవిందన్ | ||
---|---|---|---|
పదవీ కాలం 25 మే 2021 – 3 సెప్టెంబరు 2022 | |||
ముందు | పి. శ్రీరామకృష్ణన్ | ||
తరువాత | ఏ.ఎన్. షంసీర్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 24 మే 2021 | |||
ముందు | వీటీ బలరాం | ||
నియోజకవర్గం | త్రిథాల | ||
పదవీ కాలం 31 మే 2009 – 23 మే 2019 | |||
ముందు | ఎన్ఎన్ కృష్ణదాస్ | ||
తరువాత | వి. కె. శ్రీకందన్ | ||
నియోజకవర్గం | పాలక్కాడ్ | ||
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 జూన్ 2024 | |||
ముందు | కె. రాధాకృష్ణన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జలంధర్, పంజాబ్, భారతదేశం | 1971 మార్చి 12||
రాజకీయ పార్టీ | సీపీఎం | ||
తల్లిదండ్రులు | బాలకృష్ణన్ నాయర్, ఎంకే రెమాని | ||
జీవిత భాగస్వామి | నినిత కనిచేరి | ||
సంతానం | 2 | ||
నివాసం | పాలక్కాడ్, కేరళ, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి |
|
జననం, విద్యాభాస్యం
మార్చుఎం. బి. రాజేష్ 1971 మార్చి 12న పంజాబ్, జలంధర్‌లో బాలకృష్ణన్ నాయర్, రేమని దంపతులకు జన్మించాడు. ఆయన చలవరలోని హయ్యర్ సెకండరీ స్కూల్, ఒట్టప్పలం ఎన్ఎస్ఎస్ కాలేజ్, తిరువనంతపురంలోని లా అకాడమీ లా కాలేజీ నుండి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.
వివాహం
మార్చుఎం. బి. రాజేష్ 21 డిసెంబర్ 2003న నినిత కనిచ్చేరిని వివాహం చేసుకున్నాడు.[2] వీరికి ఇద్దరు పిల్లలు నిరంజన, ప్రియదత్త ఉన్నారు.
రాజకీయ జీవితం
మార్చుఎం. బి. రాజేష్ ఎస్ఎఫ్ఐ పాలక్కాడ్ జిల్లా కమిటీ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ సంయుక్త కార్యదర్శిగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జాతీయ అధ్యక్షుడిగా డివైఎఫ్‌ఐ పత్రిక యువధారకు చీఫ్ ఎడిటర్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పాలక్కాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సతీషన్ పాచేనిపై 1,820 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఎం. బి. రాజేష్ 2014లో పాలక్కాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.పీ. వీరేంద్ర కుమార్ పై 1,05,300 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో శక్తిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, వ్యవసాయ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
ఎం. బి. రాజేష్ 2021లో జరిగిన శాసనసభ ఎన్నికలలో త్రిథాల శాసనసభ నియోజకవర్గం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వీటీ బలరాంపై 3,016 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 25 మే 2021 నుండి 3 సెప్టెంబరు 2022 వరకు కేరళ శాసనసభ 23వ స్పీకర్‌గా పని చేశాడు.[3][4][5] ఆయన 6 సెప్టెంబర్ 2022 నుండి పినరయి విజయన్ మంత్రివర్గంలో రాష్ట్ర స్వపరిపాలన & ఎక్సైజ్ శాఖ మంత్రిగా,[6] 23 జూన్ 2024 పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.
మూలాలు
మార్చు- ↑ Onmanorama (19 May 2021). "MB Rajesh: The first-timer who would steer the Assembly". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ The News Minute (6 February 2021). "Appointment of MB Rajesh's wife Ninitha at university sparks row, college denies foul play" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ The Hindu (25 May 2021). "M. B. Rajesh elected Speaker of Kerala Assembly" (in Indian English). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ The Indian Express (25 May 2021). "CPM's MB Rajesh elected Kerala Assembly Speaker with support from 96 legislators" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ India Today (4 September 2022). "MB Rajesh resigns as Kerala Assembly Speaker, CPI(M) to appoint him as minister" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ The Indian Express (6 September 2022). "M B Rajesh sworn in as minister in Pinarayi Vijayan cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.