ఎక్లిప్టా, (Eclipta) పుష్పించే మొక్కలలో ఆస్టరేసి కుటుంబానికి చెందిన ప్రజాతి.ఎక్లిప్టా ఒక చిన్నమొక్క. ఇది 3 నుండి 5 సెం.మీ పొడవు నలుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇరుకైన రెక్కలలాంటి ఆకులు, నల్లటి విత్తనాలు ఉంటాయి.ఎక్లిప్టా పండు. పువ్వులు పూయటం ఆగస్టు - సెప్టెంబరు మధ్య ప్రారంభమవుతుంది. నవంబరు వరకు కనబడతాయి. తేమ ప్రాంతాలలో, వ్యర్థ ప్రదేశాలలో, రోడ్డ్లప్రక్కన ఈ మొక్కలు ఎక్కువుగా పెరిగుతాయి.మొక్క పెరుగుదల నిటారుగా లేదా అడ్డంగా 30 - 40 సెం.మీ వరకు పెరుగుతుంది.ఆకుపచ్చగా వుండి , పువ్వులు , పండ్లు సంవత్సర వరకు కనిపిస్తాయి .

ఎక్లిప్టా
Eclipta prostrata in AP W2 IMG 9785.jpg
Eclipta alba (marsh daisy)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
ఎక్లిప్టా

Type species
Eclipta erecta
L.

చరిత్రసవరించు

భారతదేశం లో అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కేరళ రాష్ట్రములలో మనాకు కనిపిస్తాయి. కేరళలో అన్ని జిల్లాలో ఇది కనపడుతుంది. ఎక్లిప్టా ను మనదేశం లో వివిధ రాష్ట్రాలలో ఈ విధముగా పిలుస్తారు [1]

అస్సామీ భాషలో బృంగరాజ్, ఎలెంచి, కేహ్రాజ్, కేహరాజ్, కాంతరాజ్, కేసరజా

ఇంగ్లీష్ లో బృంగరాజ్, ఎక్లిప్టా, తిస్టిల్స్, ఫాల్స్ డైసీ

గుజరాతీ లో భంగ్రా

హిందీ లో ఉజ్లా, భాంగ్రా, కుకర్ భాంగ్రా, మధుకర్, భింగరాజ్క

కన్నడ లో అజగర, కదిగ్గగరగ, గారగదసప్పు, గరుగలు

కొంకణి లో మాకో

మలయాళం లో కైకేషి, కంజున్నీ, కైయన్-తకారా, కైతోన్నీ, కన్నూని, కయున్ని

మరాఠీ లో భింగరాజ్

ఒరియా లో కేసర్దా

ఇతరులు వైట్ హెడ్స్, ఫాల్స్ డైసీ, ఎక్లిప్టా, కెహ్రాజ్ (గాడిద), కైతోన్నీ,

సంస్కృత లో క్రాజా, భ్రింగిరాజ్, కేశరంజన, కేశరాజ

తమిళములో కారిసిలాంగని, కోటి-కైయన్, కైయంటకరై, కైయంతవరై, కైవిసి, కైసిసి, కరిసిలంగని

తెలుగు సప్లీ బ్రింగరాజము, గుంటగలగర, గాలీజేరు

ఉర్దూ లో భంగ్రా, బాబ్రీ

ఉపయోగములుసవరించు

ఎక్లిప్టా ఆయుర్వేదిక మందులలో మధుమేహం , కాన్సర్ నివారణలలో,[2] ఉదర సంబధింత వ్యాధులలో , చర్మ వ్యాధులు, గాయాలు, బ్లడ్ ప్రషర్ , జ్వరం, కామెర్లు, జుట్టు నల్లబడటానికి, బలోపేతం చేయడానికి, రక్తస్రావం ప్రవాహాలను ఆపడానికి, చిగుళ్ళను బలోపేతం చేయడానికి, ఉపయోగిస్తారు.[3][4] వీటి ఉపయోగం గురించి భారతదేశం, ఘజియాబాద్ లో వున్న ఇండియన్ ఫార్మకోపియా సంస్థ వారు మైక్రో బయోలాజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు[5]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Eclipta prostrata (L.) L." India Biodiversity Portal. Retrieved 2020-10-23.
  2. "Eclipta Herb Plant uses in Ayurveda Medicine" (PDF). Longdom.com. 2020-07-30. Archived from the original (PDF) on 2019-12-14.
  3. "Plant Description". bioinfo.bisr.res.in. Retrieved 2020-08-03.
  4. Bhalerao, Satish (2013-09-17). "Eclipta alba (L.): AN OVERVIEW". International Journal of Bioassays: 1443–1447.
  5. "Antibacterial activity of Eclipta alba" (PDF). Japsonline.com. Archived from the original (PDF) on 2017-08-08.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.