ఆస్టరేసి
ఆస్టరేసి (Asteraceae) కుటుంబం ద్విదళబీజాలలో అన్నింటికంటే ఎక్కువ పరిణతి చెందినదిగా పరిగణిస్తారు. పూర్వం దీనిని కంపోజిటె అని పిలిచేవారు. ఆవృతబీజాలలో ఆస్టరేసి అతిపెద్ద కుటుంబం. దీనిలో సుమారు 950 ప్రజాతులు, 20,000 జాతులు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి.
Sunflowers | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | ఆస్టరేసి Martynov, 1820
|
Type genus | |
Aster | |
ఉపకుటుంబాలు | |
See also List of Asteraceae genera | |
Diversity | |
About 1500 genera and 23,000 species | |
Synonyms | |
కంపోజిటె Giseke |
కుటుంబ లక్షణాలు
మార్చు- మొక్కలు ఎక్కువగా ఏకవర్షిక గుల్మాలు, కొన్ని ఎగబాకే తీగలు.
- సరళ పత్రాలు, పుచ్ఛరహితము, ఏకాంతర లేదా అభిముఖ పత్ర విన్యాసము.
- శీర్షవత్ లేదా సంయుక్త శీర్షవత్ పుష్ప విన్యాసము.
- అండకోశోపరిక, సౌష్టవయుత లేదా పాక్షిక సౌష్టవయుత పుష్పకాలు.
- రక్షక పత్రాలు క్షీణించి కేశగుచ్ఛంగా మారుట.
- పరాగకోశ సంయుక్త కేసరాలు 5, మకుట దళోపరిస్థితము.
- నిమ్న అండాశయము, ద్విఫలయుత సంయుక్తము, ఏకబిలయుతము.
- పీఠ అండము.
- సిప్పెలా ఫలము.
ముఖ్యమైన మొక్కలు
మార్చు- ఆర్టిమీసియా (Artemisia) :
- ఎక్లిప్టా (Eclipta) :
- ఎక్లిప్టా ఆల్బా (గుంటకలగర)
- క్రైసాంథిమమ్ (చేమంతి)
- టాగెటిస్ (బంతిపువ్వు)
- హీలియాంథస్ (సూర్యకాంతం పువ్వు)
- స్టెవియా (మధుపత్రి)
- పిక్క్ (బల్లె)
- కార్థమస్ (Carthamus) : కుసుమ
- బ్రహ్మ కమలము
- అనాసైక్లస్ (Anacyclus) :
- అనాసైక్లస్ పైరెత్రమ్ : అక్కలకర్ర
మూలాలు
మార్చు- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.