ఎగువ మానేరు డ్యామ్
ఎగువ మానేరు డ్యామ్ తెలంగాణ రాష్ట్రం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట్ మండలం నర్మల గ్రామంలో మానేరు నదిపై (1945-48) నిర్మించబడిన జలాశయం.[2] ఇది 1,62,000 హెక్టార్లకు సాగు నీటిని అందించడమేకాకుండా, మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ఎగువ మానేరు డ్యామ్ | |
---|---|
అధికార నామం | ఎగువ మానేరు డ్యామ్ Upper Manair Dam |
ప్రదేశం | రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 18°16′13″N 78°32′40″E / 18.27028°N 78.54444°E |
నిర్మాణం ప్రారంభం | 1945 (నిజాంచే నిర్మించబడింది) |
ప్రారంభ తేదీ | 1948 |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | మానేరు నది, కుద్లైరు నది |
Height | 31 మీటర్లు (102 అడుగులు) నది ఉపరితలం నుండి |
పొడవు | 9,201 మీటర్లు (30,187 అడుగులు) |
జలాశయం | |
సృష్టించేది | ఎగువ మానేరు జలాశయం |
మొత్తం సామర్థ్యం | 62,387,000 మీ3 (50,578 acre⋅ft) |
క్రియాశీల సామర్థ్యం | 61,439,000 మీ3 (49,809 acre⋅ft)[1] |
ఉపరితల వైశాల్యం | 15.3 కి.మీ2 (5.9 చ. మై.) |
నిర్మాణం - ప్రదేశం
మార్చు1945లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడవెళ్లి, పల్వంచ వాగులపై నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టును నిర్మించాడు, 1948లో పనులు పూర్తయ్యాయి.[3] నిజాం గెస్ట్‌హౌజ్ నిర్మించి, ఉద్యానవనం కూడా ఏర్పాటు చేశాడు. ఈ డ్యామ్ సిరిసిల్లా రాజన్న జిల్లాలో మానేరు నదిపై 18°16' అక్షంశ, 79°32' రేఖాంశాల మధ్య ఉంది. మానేరు నది గోదావరి నదికి ఉపనది.
లక్షణాలు
మార్చుఇది తాపీపని భూమి డ్యాం. దీని ఎత్తు నది ఉపరితలం నుండి 31 2మీటర్లు (102 అడుగులు) ఉండగా, డ్యామ్ పొడవు 9,201 మీటర్లు (30,187 అడుగులు) ఉంది.
ఇతర వివరాలు
మార్చు2016, సెప్టెంబర్ 26న రెండేళ్ల విరామ అనంతరం 31 అడుగుల ఎత్తున్న ప్రాజెక్టు మూడు రోజుల్లోనే పూర్తిస్థాయిలో నిండి పొంగిపోర్లుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రాజెక్టును తిలకించారు.[4]
మూలాలు
మార్చు- ↑ "India: National Register of Large Dams 2012" (PDF). Central Water Commission. Archived from the original (PDF) on 20 ఆగస్టు 2014. Retrieved 4 July 2018.
- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ విద్యా వార్తలు (26 April 2016). "తెలంగాణ నీటిపారుదల సౌకర్యాలు". Retrieved 4 July 2018.[permanent dead link]
- ↑ సాక్షి, తెలంగాణ (11 June 2018). "ఎగువ మానేరు ఎడారేనా..?". Retrieved 4 July 2018.
- ↑ ఆంధ్రభూమి, కరీంనగర్ (27 September 2016). "ఎగువ మానేరు జలాశయానికి జనజాతర". Archived from the original on 4 July 2018. Retrieved 4 July 2018.