మానేరు నది
భారతదేశ నది
మానేరు నది లేదా "మానైర్" లేదా మానేరు" భారతదేశంలోని గోదావరి నదికి ఉపనది[1]. మానేరునది సిరిసిల్ల డివిజన్‌లో ప్రారంభం కాగా దీనిపై గంభీరావుపేట్ వద్ద ఎగువ మానేరు డ్యామ్, మధ్య మానేరు డ్యామ్ లను, కరీంనగర్ వద్ద దిగువ మానేరు డ్యామ్ నిర్మించారు. అనంతరం ఈ నది గోదావరిలో కలుస్తుంది.[2] దిగువ మానేరు డ్యామ్ తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ ప్రజలకు త్రాగునీటిని అందిస్తుంది. ఇది 163.000 హెక్టార్లకు (400,000 ఎకరాల) సాగు నీటిని అందించడమేకాకుండా మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ నదిపై కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నిర్మించబడింది.
మూలాలు
మార్చు- ↑ "Study and management of water resources in arid and semi-arid regions: Symposium held at Physical Research Laboratory, Ahmedabad, 5-8th April 1978," Shiv K. Gupta, P. Sharma, Today & Tommorrow's Printers and Publishers, 1979, "... The major river draining the area is the Maner; meandering itself characteristically and flowing in north easterly direction ..."
- ↑ "నదులు - కరీంనగర్". Archived from the original on 2016-10-15. Retrieved 2018-07-05.