ఎడుల్జీ ఐబారా

భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్.

ఎడుల్జీ బుజోర్జీ 'ఎడ్డీ' ఐబారా (25 ఏప్రిల్ 1914 - 7 నవంబరు 2000) తెలంగాణకు చెందిన భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. రంజీ ట్రోఫీలో హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున ఆడాడు. ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లలో 51 మ్యాచ్ లు హైదరాబాదు జట్టు తరపున, మిగిలిన ఇరవై మ్యాచ్ లలో ఎక్కువగా పార్సీస్ క్రికెట్ జట్టు, సౌత్ జోన్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు.[2]

ఎడుల్జీ ఐబారా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎడుల్జీ బుజోర్జీ 'ఎడ్డీ' ఐబారా
పుట్టిన తేదీ(1914-04-25)1914 ఏప్రిల్ 25
భారతదేశం
మరణించిన తేదీ2000 నవంబరు 7(2000-11-07) (వయసు 86)
సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి బ్యాట్ మన్
పాత్రబ్యాట్ మన్
బంధువులుసోరబ్జీ మెహతా (మామయ్య)
నౌషీర్ మెహతా (కజిన్)[1]
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1934–1959హైదరాబాదు క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్
మ్యాచ్‌లు 71
చేసిన పరుగులు 3,819
బ్యాటింగు సగటు 36.72
100లు/50లు 9/18
అత్యుత్తమ స్కోరు 144*
వేసిన బంతులు 116
వికెట్లు 2
బౌలింగు సగటు 39.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/5
క్యాచ్‌లు/స్టంపింగులు 15/0

ఎడుల్జీ ఐబారా 1914, ఏప్రిల్ 25న జన్మించాడు.

క్రీడారంగం

మార్చు

కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అయిన ఐబారా, కొంతకాలం హైదరాబాదు క్రికెట్ జట్టు కెప్టెన్ గా పనిచేశాడు. హైదరాబాదు జట్టు రెండు రంజీ ట్రోఫీ విజయాల మధ్య 50 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికీ, 1937–38లో జట్టులో ఆటగాడిగా 100 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించగా, 1986–87లో కోచ్‌గా జట్టును గెలిపించాడు. 1937–38లో నవానగర్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 137 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐబారా కు ఇది తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీ. హైదరాబాదు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకు ఆలౌట్ కాగా, నాల్గవ ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేసింది. జట్టు స్కోర్ 67 పరుగులు ఉన్నప్పుడు 3వ బ్యాట్ మన్ గా ఐబారా బ్యాటింగ్‌కు వచ్చాడు. కేవలం ఒక వికెట్ మిగిలి ఉండగానే హైదరాబాదును గెలిపించాడు.[3]

హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున 38.50 సగటుతో తొమ్మిది సెంచరీలతో 2849 పరుగులు చేసిన ఐబారా 1959లో పదవీ విరమణ చేశాడు. 1949/50లో సెంట్రల్ ప్రావిన్స్, బెరార్‌పై 144 నాటౌట్ తో గెలిచిన మ్యాచ్ కెప్టెన్‌గా ఉన్నాడు.[4]

విజయవాడలోని కోచింగ్ క్లినిక్‌కు వెళ్ళేదారిలో పడిపోవడంతో కోమాలోకి వెళ్ళగా ఆరోగ్యం క్షీణించి తన 86 సంవత్సరాల వయసులో 2000, నవంబరు 7న మరణించాడు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Eddie Aibara passes away". The Hindu. నవంబరు 8 2000. {{cite web}}: Check date values in: |date= (help)
  2. "First-class Batting and Fielding For Each Team by Edulji Aibara". CricketArchive.
  3. "Hyderabad v Nawanagar Ranji Trophy Final 1937/38". CricketArchive.
  4. "Hyderabad v Central Provinces and Berar 1949/50". CricketArchive.

బయటి లింకులు

మార్చు