నౌషీర్ మెహతా
నౌషీర్ మెహతా, భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. 1967/68, 1976/77 మధ్యకాలంలో హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా ఆడాడు. 2014లో తన క్రికెట్ కెరీర్ లో 50 సంవత్సరాలు పూర్తి చేశాడు.
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | 1947/1948 (age 75–76)[1] | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||
బంధువులు | సోరబ్జీ మెహతా (తండ్రి), ఎడుల్జీ ఐబారా (కజిన్) | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
1967–1977 | హైదరాబాదు క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: ఇఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో, 2016 ఫిబ్రవరి 15 |
క్రీడారంగం
మార్చుకుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేయడానికి ముందు మెహతా ఫాస్ట్ బౌలర్‌గా తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. 16 సంవత్సరాల వయసులో 1964లో సికింద్రాబాదు యూనియన్ క్రికెట్ క్లబ్ లో క్రికెట్ ఆడిన మెహతా,[2] 1967/68 నుంచి ప్రారంభమయిన పది సీజన్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇతని తండ్రి సోరబ్జీ మెహతా 1930, 1940లలో హైదరాబాదు, పార్సీ క్రికెట్ జట్లకు ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మ్యాచ్ లు ఆడాడు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) చైర్మన్ గా కూడా పనిచేశాడు.[1]
1970ల ప్రారంభంలో మెహతా, ముంతాజ్ హుస్సేన్ లు హైదరాబాదు జట్టు కోసం స్పిన్ బౌలింగ్ చేసేవారు. 1970–71 రంజీ ట్రోఫీలో మెహతా 13.55 సగటుతో 29 వికెట్లు, 1971–72 రంజీ ట్రోఫీలో 16.55 సగటుతో 34 వికెట్లు తీశాడు. ఇందులో ఐదు ఫోర్లు, పది వికెట్లు ఉన్నాయి.[3] అదే సీజన్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున భారతీయ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో భారత టెస్ట్ కెప్టెన్ అజిత్ వాడేకర్, ఓపెనర్ అశోక్ మన్కడ్, సయ్యద్ అబిద్ అలీ వికెట్లు తీశాడు.[4] తన కెరీర్ లో సౌత్ జోన్ మాత్రమేకాకుండా హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ ఎలెవన్, ఆంధ్ర ముఖ్యమంత్రి ఎలెవన్ లకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.
1976/77 సీజన్ లో మెహతా తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడినప్పటికీ, స్థానిక లీగ్ లలో ఆటను కొనసాగించాడు. 2014, నవంబరులో తన క్రీడా జీవితంలో 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాడు. ఆ సమయంలో మెహతా హెచ్‌సిఎ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. 2005 క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఇక్బాల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Venu, TP (నవంబరు 22 2014). "Noshir to weave his magic for one last time". The Hans India. Retrieved జూలై 22 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(help) - ↑ Kondety, Moses (నవంబరు 24 2014). "A bowler's half-century". Deccan Chronicle. Retrieved జూలై 22 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(help) - ↑ "Bowling in Ranji Trophy 1971/72 (Ordered by Wickets)". CricketArchive. Retrieved జూలై 22 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
(help) - ↑ "ఇండియాn XI v Rest of India in 1971/72". CricketArchive. Retrieved జూలై 22 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
(help)
బయటి లింకులు
మార్చు- క్రిక్ఇన్ఫో లో నౌషీర్ మెహతా ప్రొఫైల్
- క్రికెట్ ఆర్కివ్ లో నౌషీర్ మెహతా వివరాలు