ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, ఎనుమాముల గ్రామంలో ఉంది.[1] దాదాపు 117 ఎకరాల్లో విస్తరించివున్న ఈ మార్కెట్ ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్.[2][3][4]
చరిత్ర
మార్చుతెలంగాణ ప్రభుత్వ మార్కెటింగ్ విభాగం కమిటీ ఈ వ్యవసాయ మార్కెట్‌ను నిర్వహిస్తుంది. 2017నాటికి మొత్తం ఆదాయం సుమారు 20 కోట్లు.
మార్కెట్ వివరాలు
మార్చువాణిజ్యపరంగా ఇది ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన మార్కెట్. సుమారు 450మంది కమీషన్ ఏజెంట్స్, 300 మంది కొనుగోలుదారులు, 800 మంది అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది, వేలమంది కూలీలతో నిత్యం ఈ మార్కెట్ రద్దీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే పంటను బట్టి ఈ మార్కెట్ వేరువేరు భాగాలుగా (మిరప యార్డు, పత్తి యార్డు) విభజించబడింది. వరంగల్ జిల్లా, నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల ప్రాంతాలనుండి వచ్చే మిర్చి అమ్మకానికి ఈ మార్కెట్ అనువుగా ఉంటుంది. గుంటూరు, మహారాష్ట్ర నుండి కొనుగొలుదారులు ఇక్కడికి వచ్చి మిర్చి కొనుగోలుచేస్తారు.
ఈ-నామ్ మార్కెట్
మార్చుఇక్కడ ఎలక్ట్రానిక్ బరువు ప్రమాణాలను ఉపయోగించి ధాన్యపు బరువును నిర్ధారించడానికి జరుగుతుంది. అందుకే 2016, ఏప్రిల్ 14న భారత ప్రభుత్వం జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ప్రాజెక్ట్ (నామ్ ప్రాజెక్ట్) కోసం తెలంగాణలోని 40 మార్కెట్లలో ఒకటిగా మార్కెట్‌ను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పద్ధతిని ఈ-నామ్ అని పిలుస్తారు. ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారి అయినా మధ్యవర్తులు లేకుండా ఈ మార్కెట్లోని ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.
మూలాలు
మార్చు- ↑ TRS indifferent to farmers’ distress: Cong. - The Hindu
- ↑ Telangana government's Rs 30 lakh deposit norm stuns agricultural traders- The New Indian Express
- ↑ "Farmer run over by truck in Warangal". Archived from the original on 2019-07-27. Retrieved 2019-07-27.
- ↑ Trouble likely at Enumamula market yard - The Hindu