ఎనుమాముల
ఎనుమాముల, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, వరంగల్ మండలం లోని, జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం.[1] ఈ పట్టణం వరంగల్ మహానగరపాలక సంస్థలో ఒక భాగంగా ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లా లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ గ్రామీణ జిల్లా స్థానంలో వరంగల్ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3]2011 జనగణన సమాచారం ప్రకారం ఎనుమాముల గ్రామ లొకేషన్ కోడ్ (గ్రామం కోడ్) 578155.[4] ఈ గ్రామంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉంది. దాదాపు 117 ఎకరాల్లో విస్తరించివున్న ఈ మార్కెట్ ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్.[5]
ఎనుమాముల | |
---|---|
Coordinates: 17°59′09″N 79°37′29″E / 17.9857°N 79.6248°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
భాష | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 |
పిన్‌కోడ్ | 506013 |
Vehicle registration | టిఎస్ |
భౌగోళికం మార్చు
ఈ పట్టణం 17°59′09″N 79°37′29″E / 17.9857°N 79.6248°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[6]
జనాభా గణాంకాలు మార్చు
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఎనుమాముల పట్టణంలో 13,183 జనాభా ఉంది. ఇక్కడ 3,430 గృహాలు ఉన్నాయి. అందులో 6,628 మంది పురుషులు, 6,555 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1438 మంది ఉన్నారు. ఎనుమాముల సగటు అక్షరాస్యత రేటు 70.06% కాగా ఇది రాష్ట్ర సగటు 67.02% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత దాదాపు 80.19% కాగా, స్త్రీ అక్షరాస్యత రేటు 59.91%గా ఉంది.[7]
సమీప గ్రామాలు మార్చు
ఖిలా వరంగల్, ఉరుసు, అల్లీపూర్, తిమ్మాపూర్, మమ్నూర్, నక్కలపల్లి, వసంతపూర్, బొల్లికుంట, గాదెపల్లి మొదలైన గ్రామాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
రవాణా మార్చు
ఇక్కడికి సమీపంలోని వరంగల్, హన్మకొండ ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు, రోడ్డు కనెక్టివిటీ ఉంది.
ప్రార్థనా మందిరాలు మార్చు
- బ్రాహ్మణ పోచమ్మ దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- మైసమ్మ గుడి
- మస్జిద్-ఈ-మహమూదియా
- అఫ్జాలియా జామా మస్జిద్
విద్యాసంస్థలు మార్చు
- నోబుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్
- డాక్టర్ జాకీర్ హుస్సేన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
- సికెయం ఆర్ట్స్ & సైన్స్ కళాశాల
- చందా కాంతయ్య మెమోరియల్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల
- ఉర్దూ ప్రాథమిక పాఠశాల
- ఎడ్-ఫోర్ట్ టెక్నో స్కూల్
- జీనియస్ ఉన్నత పాఠశాల
మూలాలు మార్చు
- ↑ "Enumamula Locality". www.onefivenine.com. Archived from the original on 2021-11-11. Retrieved 2021-11-11.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch (help) - ↑ 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "Enumamula Village in Hanamkonda (Warangal) Telangana | villageinfo.in". villageinfo.in. Archived from the original on 2021-11-11. Retrieved 2021-11-11.
- ↑ "Telangana government's Rs 30 lakh deposit norm stuns agricultural traders". The New Indian Express. Archived from the original on 2020-09-29. Retrieved 2021-11-11.
- ↑ "Enumamula - Village in Hanamkonda Mandal". www.indiagrowing.com. Retrieved 2021-11-11.
- ↑ "Enumamula Census Town City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2021-09-15. Retrieved 2021-11-11.