నల్లకొండ గారి రెడ్డప్ప ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఎన్నికయ్యాడు . అతను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన పుట్టనూర్ గ్రామానికి చెందినవాడు.[1][2][3]

నల్లకొండ గారి రెడ్డప్ప

పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు నారమల్లి శివప్రసాద్
నియోజకవర్గం చిత్తూరు, ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-10-01) 1951 అక్టోబరు 1 (వయసు 73)
వల్లిగట్ల , చిత్తూరు జిల్లా, మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్)
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కొండయ్య, వెంకటమ్మ
జీవిత భాగస్వామి ఎన్. రెడ్డమ్మ
సంతానం దినేష్ ( లెఫ్టినెంట్‌ ఆర్మీ కర్నల్‌)

రాజకీయ జీవితం

మార్చు

ఎన్.రెడ్డప్ప కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆయన న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా 14 సార్లు పని చేశాడు.ఎన్.రెడ్డప్ప 1981 నుంచి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఏడాది పాటు , ఏజీపీగా 1984 నుంచి 1987 వరకు, ఎస్‌బీఐ, సప్తగిరి గ్రామీణబ్యాంకు, మున్సిపాలిటీకి, ఇతర ప్రైవేటు కంపెనీలకు లీగల్‌ అడ్వైజర్‌గా పని చేశాడు.

ఎన్.రెడ్డప్ప కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో మినరల్‌ డైవలెఫ్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా , కేంద్ర ఉక్కు పరిశ్రమశాఖ డైరెక్టర్‌గా 2008–2009లో పని చేసి, దివంగత వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర లిడ్‌క్యాప్‌ చైర్మన్‌గా పని చేశాడు.

మూలాలు

మార్చు
  1. "Chittoor Election Results 2019". Times Now. 23 May 2019. Archived from the original on 23 మే 2019. Retrieved 24 May 2019.
  2. "Chittoor LS Seat Poses A Tough Challenge To TDP". Sakshi Post. 31 March 2019. Archived from the original on 21 ఆగస్టు 2019. Retrieved 22 August 2019.
  3. "Crushing defeat for TDP in Naidu's home turf of Chittoor". The Hindu. 25 May 2019. Retrieved 22 August 2019.

బయటి లంకెలు

మార్చు