ఎన్.వి. రమణయ్య
ఎన్.వి. రమణయ్య (1935 జూలై 10 - 2018 జనవరి 16) ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, సంపాదకుడు.[1]
ఎన్.వి. రమణయ్య | |
---|---|
జననం | జూలై 10, 1935 |
మరణం | జనవరి 16, 2018 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, సంపాదకుడు |
జననం
మార్చురమణయ్య 1935, జూలై 10న ప్రకాశం జిల్లా, సింగరాయకొండలో జన్మించాడు. బింగినిపల్లి, ఒంగోలు, నెల్లూరు, విజయనగరంలలో విద్యాభ్యాసం పూర్తిచేశాడు.
సామాజిక కార్యకర్తగా
మార్చుడిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు నెల్లూరు విఆర్ కళాశాల కార్యదర్శిగా, డి.ఎస్.యు. కార్యదర్శిగా పనిచేసాడు. చేతన, నవవికాస్ సంస్థల ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహించాడు.
సాహిత్య సేవ
మార్చుఉన్నవ రచనలు, హేతువాద రచనలు, అక్షర, శంకరన్, మధుమురళి బాలమురళి, పరిశోధన, బతుకుచిత్రం, ఏకాంతసేవ మొదలైన గ్రంథాలకు సంపాదకత్వం వహించాడు.
మరణం
మార్చుఈయన 2018, జనవరి 16న హైదరాబాదులో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ ప్రజాసాహితి మాసపత్రిక, ఫిబ్రవరి 2018, జనసాహితి ప్రచురణ, పుట.4.