నంజయ్య మహేష్ (జననం 1 జూన్ 1956) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో కొల్లేగల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] హెచ్. డి. కుమారస్వామి మంత్రివర్గంలో ప్రాథమిక & మాధ్యమిక విద్యా శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

నంజయ్య మహేష్

ప్రాథమిక, మాధ్యమిక విద్య & సకల శాఖ మంత్రి
పదవీ కాలం
జూన్ 2018 – అక్టోబర్ 2018
ముందు తన్వీర్ సైత్
తరువాత ఎస్. సురేష్ కుమార్

పదవీ కాలం
2018 మే 15 – 2023 మే 13
ముందు ఎస్. జయన్న
తరువాత ఎ.ఆర్. కృష్ణమూర్తి
నియోజకవర్గం కొల్లేగల్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-06-01) 1956 జూన్ 1 (వయసు 68)
చామరాజనగర్
కర్ణాటక
భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (5 ఆగస్టు 2021-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు *స్వతంత్ర
నివాసం కొల్లేగల్
కర్ణాటక
భారతదేశం
వృత్తి సామాజిక కార్యకర్త,రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

ఎన్. మహేష్ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 శాసనసభ ఎన్నికలలో కొల్లేగల్ శాసనసభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవస్థానంలో, 2008 శాసనసభ ఎన్నికలలో మూడోస్థానంలో, 2013 శాసనసభ ఎన్నికలలో రెండోస్థానంలో నిలిచాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎ.ఆర్. కృష్ణమూర్తిపై 19,454 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హెచ్. డి. కుమారస్వామి మంత్రివర్గంలో ప్రాథమిక & మాధ్యమిక విద్యా శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2][3][4]

ఎన్. మహేష్ 2019లో కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ హైకమాండ్ నుండి ఆదేశాలు ఉన్నప్పటికీ ఓటింగ్‌కు దూరంగా ఉన్నందుకు, పార్టీ ఆదేశాలను ఉల్లంఘించినందుకు బీఎస్‌పీ నుండి బహిష్కరించబడాడ్డు.[5] ఆయన ఆ తరువాత 2021లో భారతీయ జనతా పార్టీలో చేరి[6] 2023 శాసనసభ ఎన్నికలలో కొల్లేగల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎ.ఆర్. కృష్ణమూర్తి చేతిలో 59,519 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7]

మూలాలు

మార్చు
  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. TheQuint (6 June 2018). "Karnataka BSP MLA N Mahesh Becomes First Minister Outside UP" (in ఇంగ్లీష్). Retrieved 17 November 2024.
  3. The Indian Express (11 October 2018). "N Mahesh, lone BSP minister in Congress-JDS coalition in Karnataka, quits" (in ఇంగ్లీష్). Archived from the original on 21 October 2018. Retrieved 17 November 2024.
  4. The Times of India (12 October 2018). "Ties with Congress sour, lone BSP minister N Mahesh resigns". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
  5. India Today (23 July 2019). "Mayawati expels lone BSP MLA in Karnataka for not voting in favour of Kumaraswamy govt" (in ఇంగ్లీష్). Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
  6. The Hindu (5 August 2021). "N. Mahesh joins BJP" (in Indian English). Archived from the original on 1 March 2024. Retrieved 17 November 2024.
  7. Mint (13 May 2023). "Karnataka Assembly Election result 2023: These new MLAs won by a margin of 50,000 votes or more". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.