ఎరిక్ ఉపశాంత

శ్రీలంక మాజీ క్రికెటర్

కలుతరాగే ఎరిక్ అమిలా ఉపశాంత, శ్రీలంక మాజీ క్రికెటర్. శ్రీలంక తరపున రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 12 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[1]

ఎరిక్ ఉపశాంత
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కలుతరాగే ఎరిక్ అమిలా ఉపశాంత
పుట్టిన తేదీ (1972-06-10) 1972 జూన్ 10 (వయసు 52)
కురునేగల, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 75)1999 ఫిబ్రవరి 24 - భారతదేశం తో
చివరి టెస్టు2002 జూన్ 13 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 87)1995 అక్టోబరు 3 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2001 ఫిబ్రవరి 3 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1990/91–2003కోల్ట్స్ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 2 12
చేసిన పరుగులు 10 49
బ్యాటింగు సగటు 3.33 7.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 6 15
వేసిన బంతులు 306 564
వికెట్లు 4 12
బౌలింగు సగటు 50.00 40.08
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/41 4/37
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/–
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 9

లైన్, లెంగ్త్ బౌలింగ్ చేస్తాడు. 2004లో ట్వంటీ 20 క్రికెట్ ఆడాడు, ఆ తర్వాతి సీజన్‌లో లిస్ట్ ఎ క్రికెట్ ఆడాడు. 2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[2]

జననం, విద్య

మార్చు

కలుతరాగే ఎరిక్ అమిలా ఉపశాంత 1972, జూన్ 10న శ్రీలంకలోని కురునేగలలో జన్మించాడు. కురునేగలలోని మలియదేవ కళాశాలలో చదువుకున్నాడు.[3]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

1995-1996లో తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసి,[4] అనేక సంవత్సరాలపాటు శ్రీలంక జట్టులో ఉన్నాడు. 1999 ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు.[5] పెప్సీ కప్, 1999 క్రికెట్ ప్రపంచ కప్‌లో కూడా పాల్గొన్నాడు.

2000 నుండి శ్రీలంక కోసం అప్పుడప్పుడు మాత్రమే ఆడాడు. అతని స్థానంలో దిల్హార ఫెర్నాండోకు చమిందా వాస్‌కు బ్యాకప్‌గా జట్టులో రెండవ ఆటగాడిగా ఎంపికయ్యాడు.

మూలాలు

మార్చు
  1. "Eric Upashantha Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  2. "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-18.
  3. "Maliyadeva have the edge over St. Anne's". The Sunday Times (Sri Lanka). 8 March 2015. Retrieved 2023-08-18.
  4. "PAK vs SL, Sri Lanka tour of Pakistan 1995/96, 3rd ODI at Rawalpindi, October 03, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  5. "IND vs SL, Asian Test Championship 1998/99, 2nd Match at Colombo, February 24 - 28, 1999 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.

బాహ్య లింకులు

మార్చు