ఎలిమినేటి ఉమామాధవరెడ్డి

ఎలిమినేటి ఉమామాధవరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొల్యూట్ బ్యూరో సభ్యురాలు మాజీ మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యడు ఎలిమినేటి మాధవ రెడ్డి భార్యైన ఈవిడ తెలుగుదేశం పార్టీ తరపున భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2004, 2009లో ప్రాతినిథ్యం వహించింది.[1]

ఎలిమినేటి ఉమామాధవరెడ్డి
ఎలిమినేటి ఉమామాధవరెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2014
నియోజకవర్గం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి ఎలిమినేటి మాధవ రెడ్డి
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

జననం - విద్యాభ్యాసంసవరించు

ఉమామాధవరెడ్డి 1956, మార్చి 4న బి. విఠల్ రెడ్డి, దేవకమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, వలిగొండ మండలం వరకటపల్లిలో జన్మించింది. డిగ్రీ వరకు చదువుకుంది.

వివాహంసవరించు

1970, మే 21 న ఎలిమినేటి మాధవరెడ్డితో ఈవిడ వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు.

రాజకీయరంగ ప్రస్థానంసవరించు

2000, మార్చి 7 న ఎలిమినేటి మాధవ రెడ్డి మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు గురై దుర్మరణం చెందాడు. దాంతో ఉమామాధవరెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించి, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటిచేసి గెలుపొందింది.

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఆలె నరేంద్ర పై 17536 ఓట్ల మెజారిటీతో, 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డిపై విజయం సాధించింది. చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో మైనింగ్ శాఖ మంత్రిగా కూడా పనిచేసింది.

మూలాలుసవరించు

  1. నోకరెప్షన్. "Alimineti Uma Madhava Reddy". Archived from the original on 26 మార్చి 2016. Retrieved 13 May 2017.