బండి లేదా వాహనము (ఆంగ్లం: Vehicle) అనగా ఒక చోట నుండి మరొక చోటుకు తీసుకు వెళ్ళే సాధనము. వాహనముల వాడుక వల్ల నడక తగ్గుతుంది. అంటే వాహనములో ఎక్కడికైనా నడవ కుండా వెళ్ళ వచ్చును. దీనిని ఆంగ్లములో 'Vehicle'అని అంటారు. 'Vehicle' అనే పదం లాటిన్ భాష లోని 'vehiculum'అనే పదం నుండి వెలువడినది. ఈ రోజుల్లో వాహనము అనేది ప్రతి ఒక్కరికీ నిత్యావసర సాధనం.

మోటారు వాహనాలు ప్రస్తుత కాలంలో ఎక్కువ ఉపయోగంలో ఉన్న వాహనాలు.

వాహనము లలో చాలా రకాలు ఉన్నాయి.

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాష[1] ప్రకారంగా వాహనము [ vāhanamu ] [Skt.] n. A vehicle, or conveyance of any kind; a carriage, car, horse, &c. పాలకీ గుర్రము మొదలైనవి. వాహము vāhamu. n. A horse. గుర్రము. వాహకుడు vāhakuḍu. n. A porter, a carrier; a bearer of dead bodies. మోసేవాడు, పీనుగను మోసేవాడు. వాహితము vāhitamu. adj. Borne, carried, supported. వహింపబడిన. వాహిని vāhini. n. A river, a stream. నది. An army, or force. సేన. Eloquence, వాగ్ధోరణి. వాహినీపతి vāhinī-pati. n. The leader of an army. సేవానాయకుడు. The ocean, సముద్రుడు. వాహ్యము vāhyamu. n. A carriage, a vehicle, a beast of burden. వాహనము, బరువులు మోయు పశువు. adj. Fit to be carried or borne. మోసికొనిపోదగిన. వాహ్యాళి vāhyāḷi. n. An excursion, trip. విహారము, స్వారి. An expedition.

వాహనముల రకములు

మార్చు

చౌక ఎలక్ట్రిక్‌ వాహనం (ఒలెవ్‌ )

మార్చు

ప్రపంచంలో ఉన్న ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఇదే అత్యంత చౌకది. కాలుష్యం తగ్గడంతోపాటు భారీ బ్యాటరీలు, సుదీర్ఘ ఛార్జింగ్‌ సమయం, పరిమిత దూరం ప్రయాణించడం వంటి ఇబ్బందులు ఉండవు.ఈ వాహనాన్ని నడపటానికి భూమి లోపల (ఉపరితలం నుంచి 30 సెంటీమీటర్ల లోపల) విద్యుత్‌ పట్టిలు పాతిపెడతారు. ఇవి ఒలెవ్‌కు వైర్‌లెస్‌ పద్ధతిలో విద్యుదయస్కాంత శక్తిని అందిస్తాయి. ఫలితంగా వాహనంలో ఉన్న బ్యాటరీ ఛార్జి అవుతుంది. (ఈనాడు 11.3.2010)

గాలితో నడిచే వాహనం

మార్చు

మొయినాబాద్ మండలంలోని వీఐఎఫ్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులు గాలితో నడిచే కారును రూపొందించారు. రు.40 వేల ఖర్చుతో తయారయ్యే ఈ వాహనంపై ఒకరు మాత్రమే ప్రయాణించే వీలుంది. 3 చక్రాలతో ఉండే ఈ వాహనం గరిష్ఠంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.వాహనానికి 2 ఎయిర్ సిలిండర్‌లు, స్టీరింగ్, ఎయిర్ మోటార్, న్యుమాటిక్ మోటార్, డిస్క్ బ్రేక్, గేర్ చేంజింగ్ వీల్స్ ఉంటాయి. కాలుష్యం ఉండదు. ఈ వాహనం నడవాలంటే.. సిలిండర్‌లో 6 కేజీ/సెంటీమీటర్ ఒత్తిడి ఉంటే చాలు. ఒక్కసారి రెండు సిలిండర్లను పూర్తిగా నింపితే.. 20 నిమిషాల సేపు ప్రయాణిస్తుంది.ప్రస్తుతం ఈ తరహా వాహనం భారత మార్కెట్‌లో లేదు.ఇంట్లో చిన్నపాటి మోటార్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా, టైర్లలో గాలి పెట్టే కంప్రెసర్‌తో ఎక్కడైనా సిలిండర్లలో గాలిని నింపుకోవచ్చు

ద్విచక్ర వాహనములు

మార్చు

త్రిచక్ర వాహనములు

మార్చు

ఇతర వాహనములు

మార్చు

నడిచే మార్గాలు

మార్చు

ఈ వాహనాలు నడుపుటకు చాలా మార్గాలు ఉన్నవి:

అన్ని మార్గాలలోకి వాయు మార్గమున ప్రయాణించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది.

ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు

మార్చు

ఈ పాయింట్లలో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్‌ సదుపాయం ఉంటుంది. బైక్‌వో నెట్‌వర్క్‌ కంపనీది 2025 నాటికి దేశవ్యాప్తంగా 20వేల ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లను నెలకొల్పాలన్నది లక్ష్యం. ఈ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్ బైక్‌వో ఫ్రాంఛైజీ నెట్‌వర్క్‌లో భాగస్వామిగా చేరి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు.[2]

మూలాలు

మార్చు
  1. బ్రౌన్ నిఘంటువు ప్రకారం వాహనము పదప్రయోగాలు.[permanent dead link]
  2. "Venkatesh ఈవీ రంగంలో సినీ నటుడు వెంకటేశ్‌ పెట్టుబడులు". EENADU. Retrieved 2022-01-10.
"https://te.wikipedia.org/w/index.php?title=వాహనము&oldid=4359158" నుండి వెలికితీశారు