ఎల్లాప్రగడ రామచంద్రరావు

ఎల్లాప్రగడ రామచంద్రరావు గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ హార్మోనియం విద్వాంసులు.

జీవిత విశేషాలు

మార్చు

రామచంద్రరావు గుంటూరు జిల్లా పండరీపురం లో జన్మించారు. ఆయన తండ్రి శేషగిరిరావు. తన తండ్రి గారి వద్ద 16 వఏట హార్మోనియంతో పాటు సంగీతం లో శిక్షణ కూడా ప్రారంభించారు. హరికథలు, బుర్ర కథలకు సంగీతం సమకూర్చుతూ ఆ కళలో ప్రావీణ్యం సంపాదించారు. రవీంద్రభారతిని ఆస్థాన సంస్థగా భావించి శ్రీకృష్ణ తులాభారంతదితర పలు నాటకాలకు ప్రాణం పోశారు. నటి జమున, తెలంగాణ శకుంతల ఆయన వద్ద శిష్యరికం చేశారు. నంది నాటక పోటీల్లో అనేక అవార్డులు అందుకున్నారు. రెండు సార్లు గండపెందేరం అందుకున్నారు. ఆయన భార్య పేరు నాంచారి. ఆయనకు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.ఆయన కొత్తపేట డివిజన్ మోహన్ నర్ లో నివాసం ఉండేవారు.

అస్తమయం

మార్చు

ఆయన తన 81 వ యేట 2014 మే 21 న గుండెపోటుతో మరణించారు.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు