తెలంగాణ శకుంతల (జూన్ 9, 1951 - జూన్ 14, 2014) రంగస్థల నటి, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి.

తెలంగాణ శకుంతల
Telangana Shakunthala.jpg
తెలంగాణ శకుంతల
జననంకడియాల శకుంతల
జూన్ 9, 1951
మహారాష్ట్ర
మరణంజూన్ 14, 2014
కొంపల్లి, హైదరాబాద్, తెలంగాణ
మరణ కారణముగుండెపోటు
నివాస ప్రాంతంకొంపల్లి
ఇతర పేర్లుతెలంగాణ శకుంతల
వృత్తిసినిమా నటి
ప్రసిద్ధిసినిమా నటి, హాస్య నటి,ప్రతి నాయిక
పదవీ కాలము1979 నుండి 2014 వరకు
మతంహిందువు
పిల్లలుఇద్దరు

జీవిత విశేషాలుసవరించు

శకుంతల ముందుగా రంగస్థలం ద్వారా పరిచయమయ్యారు. ఒంటికాలి పరుగు నాటికతో రంగస్థల ప్రవేశం చేశారు. అభివృద్ధికి దోహదపడిన నటుడు, దర్శకుడు వల్లం నాగేశ్వరావు గారు. కూడా గుర్తొస్తున్నారు.. పద్య పఠనంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి, శ్రీ కృష్ణ తులాభారం నాటకంలో సత్యభామగా, మహాకవి కాళిదాసు నాటకంలో విద్యాధరిగా నటించారు. పరభాషా నటీమణి అయినా తెలుగును చాలా స్పష్టంగా ఉచ్చరించి, ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చాలా చిత్రాల్లో తెలంగాణా యాస మాట్లాడటం వలన తెలంగాణ ఇంటి పేరుగా మారిపోయింది.

1979లో మా భూమి ద్వారా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు.[1] 75కు పైగా సినిమాలలో నటించారు. ఈవిడ నటించిన చివరి సినిమా పాండవులు పాండవులు తుమ్మెద.[2] ఈమెకు కుక్క సినిమాలో నటనకు గాను నంది ఉత్తమ నటీమణి అవార్డు లభించింది.

నటించిన తెలుగు చిత్రాలు[3]సవరించు

తమిళ సినిమాలుసవరించు

  • మచక్ కాలయ్ (2009)- తమిళం
  • ధూల్ (2003) - తమిళం

మరణంసవరించు

హైదరాబాద్ లోని కొంపల్లిలోని వీరి ఇంట్లో 2014, జూన్ 14 న తెల్లవారు ఝామున దాదాపు 3.00 గంటలకు గుండెపోటు రావడంతో నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి డాక్టర్లు శకుంతల గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు.[5]

మూలాలుసవరించు

  1. సాక్షి దినపత్రికలో శకుంతలపై కథనం[permanent dead link]
  2. "తెలంగాణ శకుంతల కన్నుమూత, నమస్తే తెలంగాణ జూన్ 14, 2014". మూలం నుండి 2014-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-06-14. Cite web requires |website= (help)
  3. http://www.imdb.com/name/nm1328049/ IMDB జాల స్థలిలో తెలంగాణ శకుంతల గురించి
  4. మా భూమి గురించి Rajadhyaksha, Ashish and Paul Willemen. Encyclopedia of Indian Cinema, (New Delhi) 1999; p.441
  5. Telangana Shakuntala passes away ది హన్స్ లో శకుంతల మరణంపై కథనం

బయటి లంకెలుసవరించు