ఎల్. నాగేంద్ర కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో చామరాజ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

ఎల్. నాగేంద్ర

పదవీ కాలం
2018 మే 15 – 2023 మే 13
ముందు వాసు
తరువాత కె. హరీష్ గౌడ్
నియోజకవర్గం చామరాజ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం కర్ణాటక
భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

ఎల్. నాగేంద్ర భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2008 నుండి 2013 వరకు మైసూర్ సిటీ కార్పొరేషన్‌లో మాజీ కౌన్సిలర్‌గా, 2011 నుండి 2013 వరకు మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా, 2014 నుండి 2016 వరకు కర్ణాటక బీజేపీలో స్లమ్ మోర్చా అధ్యక్షుడిగా, 2016లో బీజేపీ కర్ణాటకలో మైసూర్ డివిజన్ ఇన్‌ఛార్జ్‌గా పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో చామరాజ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వాసుపై 14,936 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కె. హరీష్ గౌడ్ చేతిలో 4,094 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

మూలాలు

మార్చు
  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. The Times of India (25 March 2023). "Will 2018's first-time poll winners see success again?". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
  3. Election Commision of India (8 October 2024). "Karnataka Assembly Elections 2023: Chamaraja". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.