పారాసిటమాల్

(ఎసిటమైనోఫెన్ నుండి దారిమార్పు చెందింది)

పారాసెటమాల్ లేదా ఎసిటమైనోఫేన్ విస్తృతంగా వాడబడుతున్న ఒక ఓవర్-ది-కౌంటర్ నొప్పి నివారిణి (అనల్జసిక్ ), యాంటీ పైరటిక్ (జ్వరము తగ్గించేది). దీన్ని సాధారణముగా జ్వరము, తలనొప్పి, ఇతర చిన్న నొప్పులకు, పోటులకి వాడుతారు. ఇది అనేక జలుబు, ఫ్లూ మందులు తయారీలో చేర్చబడుతున్న ఒక ముఖ్య పదార్ధము. శస్త్ర చికిత్స అనంతరం ఏర్పడే తీవ్రమైన నొప్పులని నివారించడానికి కూడా పారాసెటమాల్ ని స్టెరాయిడ్లతో కాని వాపు తగ్గించే మందులతో, ఒపియాడ్ అనాల్జేసిక్ లతో కలిపి వాడుతారు. పారాసెటమాల్ అనే పేరు రసాయన పేరు par a - ( acet yl am ino) phen ol (లేదా para - ( acet yl amino ) phen ol) నుండి వచ్చింది. ఈ పదార్ధం ఎసిటిక్ ఆమ్లం, అమినోఫెనాల్ పి-హైడ్రాక్సీనిలిన్ రెండింటి ఉత్పన్నం. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన అవసరమైన ఔషధాల జాబితాలో పారాసెటమాల్ చాలా ముఖ్యమైనది.[1] ఈ మందు చాలా తక్కువ దుష్ప్రభావాలతో కూడిన ఔషధం. అయితే పెద్ద ఎత్తున వాడటం వల్ల కాలేయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి.[2]

పారాసిటమాల్ అణు ఆకృతి, బంతి పుల్లల నమూనా
పారాసెటమాల్ జనరిక్ మందు బిళ్ళ రూపంలో

మోతాదు

మార్చు

సిఫార్సు చేయబడిన మోతాదులో (1000 mg ఒక మోతాదుకి చొప్పున పెద్దవాళ్ళకి రోజుకి 4000 mg వరకు, మద్యం తాగే వాళ్ళకయితే రోజుకి 2000 mg వరకు) వాడినప్పుడు మానవులకి సురక్షితమే. కాని పారాసెటమాల్ ని స్వల్పవ్యవధిలో మితిమీరిన మోతాదులో వాడినప్పుడు కాలేయానికి ప్రాణాంతకమైన రీతిలో హాని ఏర్పడే అవకాశము ఉంటుంది. అరుదుగా కొంత మందికి సాధారణ మోతాదుతోనే ఈ హాని కలగొచ్చు; మద్యం సేవించడము వల్ల ఈ ఆపద పెరుగుతుంది. ప్రపంచ దేశాలలో ఈ మందు వాడకం యునైటెడ్ కింగ్డం, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలలో ఎక్కువ మోతాదులో వాడబడే మందులలో పారాసెటమాల్ అగ్ర స్థానములో ఉంది. పిల్లలకు 38.5 ° C (101.3 ° F) కంటే ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మాత్రమే శీతలీకరణ కోసం ఎసిటమినోఫెన్ వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుంది. భారతదేశంలో పారాసెటమాల్ ఆస్పిరిన్‌కు అనువైన ప్రత్యామ్నాయం. పారాసెటమాల్ మందులో అత్యంత సాధారణ బ్రాండ్ క్రోసిన్ , దీనిని గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఆసియా తయారు చేస్తుంది.

చరిత్ర

మార్చు

అసిటెనోలైడ్ అనాల్జేసిక్ ఇంకా యాంటిపైరెటిక్ లక్షణాలను కలిగి ఉన్న మొట్టమొదటి అనిలిన్ ఉత్పన్నం ,1886 లో ప్రారంభంలో A. కాహ్న్ , పి. హీప్ యాంటిఫాబ్రిన్ పేరుతో వైద్య విధానంలో ప్రవేశపెట్టబడినది.  కానీ దాని ఆమోదయోగ్యం కాని విష ప్రభావాల వల్ల, ముఖ్యంగా మెథెమోగ్లోబినిమియా కారణంగా సైనోసిస్ ప్రమాదం ఉన్నందున, తక్కువ విషపూరిత అనిలిన్ ఉత్పన్నం ఆవిష్కరణకు ప్రాధాన్యత ఇవ్వబడింది. 1887 లో మొదటిసారి క్లినికల్ ఫార్మసిస్ట్ జోసెఫ్ వాన్ మెరింగ్ రోగులపై పారాసెటమాల్‌ను పరీక్షించాడు.1893 లో, వాన్ మెరింగ్ ఒక పత్రాన్ని ప్రచురించాడు, ఇది పారాసెటమాల్ క్లినికల్ ఫలితాలను ఫెనాసెటిన్, ఇతర అనిలిన్ ఉత్పన్నాలతో నివేదించింది. పారాసెటమాల్‌ను మొట్టమొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌లో స్టెర్లింగ్-విన్‌థోర్ప్ కంపెనీ 1953 లో విక్రయించింది. 1956 లో, పెనాడోల్ అనే వాణిజ్య పేరుతో 500 మి.గ్రా పారాసెటమాల్ అమ్మడం ప్రారంభమైంది, దీనిని స్టెర్లింగ్ డ్రగ్ ఇంక్ అనుబంధ సంస్థ ఫ్రెడరిక్ స్టెర్న్స్ & కంపెనీ తయారు చేసింది. పారాసెటమాల్ అమెరికా పేటెంట్లు కలిగి ఉన్నది, వీటి గడువు ముగిసిన తరువాత ,వివిధ ప్రాంతాల్లో వివిధ కంపెనీల చేత వాణిజ్యపరంగా ఎక్కువగా ఉత్పత్తి, తక్కువ ధరలో లోనే లభించాయి.

ఉత్పత్తి

మార్చు

పారాసెటమాల్ ఫినాల్ నుండి తయారవుతుంది. ఇది క్రింది పద్ధతిని ఉపయోగిస్తుంది.

  1. నైట్రేట్ సమూహాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లం, సోడియం నైట్రేట్‌తో ఫినాల్‌కు కలుపుతారు.
  2. పారా ఐసోమర్ ఆర్థో ఐసోమర్ నుండి వేరుచేయబడుతుంది.
  3. పారా నైట్రోఫెనాల్‌ను సోడియం బోరోహైడ్రైడ్ ఉపయోగించి పారా అమినోఫెనాల్‌గా మారుస్తుంది.
  4. పారా అమినోఫెనాల్ ఎసిటిక్ అన్హైడ్రైడ్‌తో పనిచేయడం ద్వారా పారాసెటమాల్ ఉత్పత్తి అవుతుంది.

రకాలు

మార్చు

పారాసెటమాల్ మందులలో టాబ్లెట్ లుగా, క్యాప్స్లు గా, ద్రవం ( టానిక్- చిన్నపిల్లలకు )వాడతారు, నీటిలో  కరిగే మాత్రలుగా, ఇంజెక్షన్ గా ( ఆసుపత్రిలో మాత్రమే రోగులకు ఇవ్వబడుతుంది) ఇందులో కొన్ని ఉత్పత్తులలో, పారాసిటమాల్ను ఇతర పదార్ధాలతో కలుపుతారు.ఇందులో జలుబు, ఫ్లూ నివారణ, నొప్పి నివారణ వంటివి ఉన్నాయి. పారాసిటమాల్ ఎలా తీసుకోవాలి అనే దానిని  రోగుల వయస్సు, బరువు, పారాసిటమాల్ మందును వైద్యులు సూచన మేరకు రోగులు వాడాలి[3] .

మూలాలు

మార్చు
  1. "WHO | Paracetamol – oral liquid 120 mg/5 mL – EML and EMLc". WHO. Retrieved 2020-11-05.
  2. "Researchers shed new light on how paracetamol causes liver damage". British Liver Trust (in ఇంగ్లీష్). 2017-02-01. Retrieved 2020-11-05.
  3. "Paracetamol". NHS inform (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-08-31.