ఎస్‌.డి.వి. అజీజ్

చరిత్రకారుడు, రచయిత
(ఎస్‌.డి.వి. అజీజ్‌ నుండి దారిమార్పు చెందింది)

ఎస్‌.డి.వి. అజీజ్‌ చరిత్రకారుడు, రచయిత.[1]

ఎస్‌.డి.వి. అజీజ్ రాసిన పాలెగాడు బుక్

జీవిత విశేషాలు మార్చు

ఎస్.డి.వి అజీజ్ 1964 ఆగస్టు 11న మోహమున్సీసా, బాబూసాహెబ్‌ దంపతులకు జన్మించాడు. తండ్రి రంగస్థల కళాకారుడు. తన తండ్రికి బొబ్బిలి యుద్ధం నాటకంలోని రంగారాయుడు పాత్ర అతనుకు ప్రీతీపాత్రమైనది. అదే పాత్రలో నటిస్తూ కన్నుమూశాడు. అజీజ్‌కు కళాకారుల కుటుంబ నేపథ్యం ఉన్నందున తన రచనలకు చిన్నప్పుడే బీజం పడింది. అతను కర్నూలు లోని కోల్సు కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. అక్కడ తెలుగు అధ్యాపకుడైన "ప్రసాద్ బాబు" అజీజ్ లోని రచయితను గుర్తించి ప్రోత్సహించాడు. తరువాత ఉస్మానియా కళాశాలలో బి.ఎ. చదివాడు. అక్కడి గ్రంథాలయంలో ఉన్న మంచి సాహిత్య, చరిత్ర పుస్తకాలన్నింటినీ కొద్దికాలంలోనే చదివేశాడు. చిదంబరరావు వీధిలోని కేంద్ర గ్రంథాలయంలో గల పుస్తకాలను కూడా అధ్యయనం చేసాడు. మంచి మంచి పుస్తకాలెన్నీంటినో చదవటం ఇతరులతో చర్చించటం, విషయాన్ని లోతుగా అధ్యయనం చేయడం అతనికి అలవాటయ్యింది. చరిత్ర విద్యార్థి కాబట్టి వెలుగులోకి రాని నిజాల్ని, పోరాటాల్ని బయటకు తేవాలన్న తపన ఉన్నట్టు అతని రచనల వల్ల తెలుస్తుంది. మయూరి వారపత్రికలో ఇరవై వారాలకు పైగా తెరమరుగైన చారిత్రక సత్యాలు శీర్షికన వ్యాసాలు రాసాడు.[2] చలం, కొడవటిగంటి కుటుంబరావు, బుచ్చిబాబు, గోపిచంద్‌, పులికంటి కృష్ణారెడ్డిలు అతనికి ఇష్టమైన కవులు. ఎవరి కవిత్వమైనా పదికాలాలపాటు నిలవాలంటే సొంత శైలి ఉండటం అవసరమని అజీజ్‌ చెబుతాడు. మనుషుల భావాల్ని కవితలో చెప్పినట్లు ఇతర ప్రక్రియల్లో చెప్పలేమని చెబుతాడు. చరిత్రలో వాస్తవంగా జరిగిన ఇతివృత్తాలు వేరు వేరు కారణాల వల్ల మరుగున పడిపోతున్న నేపథ్యంలో దుమ్ముపట్టిన చిరిత్రను వెలికి తీసి, వాటికి తన నాటకీయత జోడించి, మన కళ్ల ముందే జరిగినట్టు రాయడం అతని రచనలలోని విశేషం. తెరణెకంటి ముట్టడి, గులాం రసూల్‌ఖాన్‌, పాలెగాడు, తదితర చారిత్రక నవలలు చదివితే మనకా విషయం తెలుస్తుంది. 1857 అంటే ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికంటే ముందే జరిగిన ఈ దేశభక్తి పోరాటాలు చరిత్రలో నమోదు కావాలని అతను ఆకాంక్ష.

రచనలు మార్చు

అజీజ్‌ రచనా వ్యాసంగాన్ని తీసుకుంటే 40 దాకా కవితలు, నాలుగు చారిత్రక నవలలు, 50 దాగా రేడియో నాటికలు, నాటకాలు, రూపకాలు ఉన్నాయి. సామ అన్న నాటకానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. స్టేజీ నాటకాలు ఐదు రాశారు. అందులో ప్రకాశం పంతులుపై రాసింది కూడా ఉంది. వందకు పైగా కథలు, భారతదేశంలో స్త్రీ పరిశోధనా గ్రంథం, ఐదు సాంఘిక నవలలు, బాలల కథలు 30, డిటెక్టివ్‌ కథలు 20 రాశారు.

  • పాలెగాడు : చారిత్రక నవల - నరసింహారెడ్డి సాహసగాథ[3]
  • సామా:[4] బానిస వ్యవస్థ పై రాయబడిన రచన, జాతీయ స్థాయిలో బహుమతి పొందిన రచన
  • అల్లాఉద్దీన్ అధ్బుత దీపం.[5]
  • బతుకు చిత్రం[6]
  • గులాం రసూల్ ఖాన్:[7] 1839లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ పోరాట చరిత్ర.
  • తుర్రెబాజ్ ఖాన్
  • తడి (కథల సంఫుటి)[8]
  • గౌతమ బుద్ధుడు[9]
  • రాబిన్‌సన్ క్రూసో[10]
  • మనిషి (కథల సంఫుటి)[11]
  • బుడ్డా వెంగళరెడ్డి [12] - చారిత్రిక నవల
  • గెలివర్ సాహసయాత్రలు[13]
  • భారతదేశంలో స్త్రీ[14]

కథలు మార్చు

అతను రాసిన కథలు వివిధ దిన, వార, త్రైమాసిక, పక్ష పత్రికలలో ప్రచురితమయ్యాయి.[1]

కథ పత్రిక పత్రిక అవధి ప్రచురణ తేది
అనుభూతి ఆంధ్రజ్యోతి వార పత్రిక 1999-05-07
అనైతికం స్వాతి మాస పత్రిక 2004-03-01
అరణ్యరోదన ఆంధ్రప్రభ వార పత్రిక 1989-02-15
ఆత్మతృప్తి ప్రియదత్త వార పత్రిక 2005-08-31
ఆదర్శం ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం 2004-10-31
ఆనందం ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం 2009-03-01
ఎన్నోరాత్రి స్వాతి వార పత్రిక 2004-11-26
ఖాన్ కో సలామ్ మయూరి వార పత్రిక 1994-04-08
జీవితం నవ్య వార పత్రిక 2006-03-08
తీరిన కోరిక ఈనాడు ఆదివారం అనుబంధం 2004-08-22
తెర తెరచి చూస్తే మయూరి వార పత్రిక 1994-05-13
దత్తత ప్రస్థానం త్రైమాసిక పత్రిక 2006-04-01
పరితప్తం ఆంధ్రప్రభ వార పత్రిక 1988-05-11
ప్రేమవైఫల్యం జ్యోతి మాస పత్రిక 1990-05-01
బతుకు చిత్రం ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం 2007-08-26
బాధ్యత స్వాతి మాస పత్రిక 2008-08-01
మరుభూమిలో స్వాతి వార పత్రిక 2004-04-30
మరో శ్రీనాధుడు మయూరి వార పత్రిక 1994-04-29
మహాపరిత్యాగి మయూరి వార పత్రిక 1994-04-01
మారాలిమనం కథాకేళి మాస పత్రిక 2008-03-01
రుణం నవ్య వార పత్రిక 2005-10-12
రేపటి తరం స్వాతి మాస పత్రిక 2002-12-01
విజయనగరం నవ్య వార పత్రిక 2007-09-26
విషపు నవ్వు అన్వేషణ వార పత్రిక 1995-12-26
స్మృతి పధం పత్రిక మాస పత్రిక 2005-12-01
స్వేచ్ఛ ఆంధ్రభూమి మాస పత్రిక 2006-04-01

పురస్కారాలు మార్చు

  1. 2021: తుర్రెబాజ్ ఖాన్ నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, 2023)[15]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2019-01-19.
  2. "ఇతిహాసానికి రంగులద్దే చిత్ర (చరిత్ర)కారుడు అజీజ్‌ | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2019-01-19.
  3. పాలెగాడు(Palegadu) By S.D.V. Aziz - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2019-02-01. Retrieved 2019-01-19.
  4. "Free Books". www.sathyakam.com. Retrieved 2019-01-19.[permanent dead link]
  5. "Free Books". sathyakam.com. Archived from the original on 2019-01-08. Retrieved 2019-01-19.
  6. బతుకు చిత్రం(Batuku Chitram) By S.D.V. Aziz - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2018-09-29. Retrieved 2019-01-19.
  7. "Mary Martin Booksellers- Gulam Rasool Khan - S.D.V. Aziz". www.marymartin.com. Retrieved 2019-01-19.[permanent dead link]
  8. "మానవత్వం పరిమళించే కథలు - Prajasakti". DailyHunt (in ఇంగ్లీష్). Retrieved 2019-01-19.
  9. "Free Books". sathyakam.com. Retrieved 2019-01-19.[permanent dead link]
  10. "Free Books". www.sathyakam.com. Retrieved 2019-01-19.[permanent dead link]
  11. "Free Books". www.sathyakam.com. Retrieved 2019-01-19.[permanent dead link]
  12. "బుడ్డా వెంగళరెడ్డి". 2019-01-19.
  13. "Free Books". www.sathyakam.com. Retrieved 2019-01-19.[permanent dead link]
  14. "Bharatadesamlo Stree - భారతదేశంలో స్త్రీ by S.D.V.Ajeez -". anandbooks.com/ (in ఇంగ్లీష్). 2019-01-19. Archived from the original on 2018-07-25. Retrieved 2019-01-19.
  15. "తెలుగు వర్సిటీ 2021 సాహితీ పురస్కారాలు". EENADU. 2023-10-13. Archived from the original on 2023-10-14. Retrieved 2023-10-20.

బయటి లంకెలు మార్చు