పాలెగాడు (పుస్తకం)
పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట గాథను తెలియజేసిన పుస్తకం. దీనిని ఎస్.డి.వి. అజీజ్ రచించాడు.[1]
పుస్తక విశేషాలు
మార్చుకుంఫిణీ ప్రభుత్వాన్ని ఎదిరించిన వీరుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. ఆయన పోరాట గాథను యస్.డి.వి. అజీజ్ ‘పాలెగాడు’ పేరుతో ఆద్యంతం ఆసక్తికరంగా రచించాడు. నరసింహారెడ్డికి గురువులాంటి గోసాయి వెంకన్న, నీడలాగా పనిచేసిన ఓబయ్యతో పాటు, అతని సిద్ధాంతాలతో ఏకీభవించి, పనిచేసిన వ్యక్తుల గురించి ఇందులో చాలా చక్కగా వివరించాడు. నరసింహారెడ్డిని హతమార్చడంలో కీలక పాత్ర వహించిన కుంఫిణీ ప్రభుత్వాధికారులు, ఆయన సోదరుడు మల్లారెడ్డి స్వభావాలను కళ్లకు కట్టినట్లు వివరించాడు. అహోబిలం నరసింహస్వామిని, మారెమ్మకుంటలో కొలువైన మారెమ్మ తల్లిని, ఆనాడు ఆచారంలో ఉన్న కోళ్ళ పందేలు, నాగుల చవితి పూజలు, ప్రజల్లోని మంచీచెడులు, పల్లె పదాలు, జానపద కళల గురించి కూడా సందర్భోచితంగా రాసాడు. [2] చారిత్రక సంఘటనలను వస్తువుగా స్వీకరించి రాసిన నవలలు గతంలో అనేకం వచ్చాయి. కాని అజీజ్ చిత్రించిన చారిత్రక నవల పాలెగాడు – నరసింహారెడ్డి సాహసగాథ మన హృదయాలను తాకుతుంది.[3]
మన దేశ స్వతంత్య్ర పోరాటంలో కర్నూలు జిల్లా వీరుల పాత్ర అనిర్వచనీయమైనదని, చరిత్రను వక్రీకరించి రాసి వీరులను విస్మరించారని, అటువంటి వీరులను ఒకొక్కక్కరిని పరిశోధించి ఆజీజ్ తన నవలల ద్వారా ప్రపంచానికి చాటాడని లలితకళాసమితి అధ్యక్షులు పత్తిఓబులయ్య అన్నాడు. పాలెగాడు నవలలోని పాత్రలు సహజంగానూ వీరత్వంగానూ, ఆనాటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా మలిచారు.[4]
మూలాలు
మార్చు- ↑ "పాలెగాడు: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట గాథ, 1805-1847".
- ↑ "పాలెగాడి పోరాట పటిమ!". Archived from the original on 2017-12-17. Retrieved 2019-01-20.
- ↑ "కినిగెలో పుస్తక పరిచయం". Archived from the original on 2019-02-01. Retrieved 2019-01-20.
- ↑ "సాహిత్య చరిత్రలో 'పాలెగాడు' అజరామరం".[permanent dead link]