ఎస్. రామమునిరెడ్డి
సిరిగిరెడ్డి రామమునిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983లో కడప నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశాడు.[1]
ఎస్. రామమునిరెడ్డి | |||
రాజ్యసభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2014 | |||
నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్ | ||
---|---|---|---|
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1983 - 1985 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004 - 2014 | |||
ముందు | ఎస్.ఏ. ఖలీల్ బాషా | ||
తరువాత | అంజాద్ భాషా షేక్ బెపారి | ||
నియోజకవర్గం | కడప నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | దస్త్రం:Bharatiya Janata Party logo.svg భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఎస్. రామమునిరెడ్డి 1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత ఎన్టీఆర్ తొలి కేబినెట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, 1984లో జరిగిన రాజకీయ సంక్షోభంలో నాదెండ్ల భాస్కరరావు వర్గంలో చేరి ఆయన మంత్రివర్గంలో ఒక నెల పాటు మంత్రిగా పనిచేశాడు.[2]
ఎస్. రామమునిరెడ్డి ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ, తిరిగి 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా నియమిడయ్యాడు. ఆయన 2019 జులై 7న హైదరాబాదులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Sakshi (15 March 2019). "కడప.. మంత్రుల గడప". Archived from the original on 20 మార్చి 2022. Retrieved 11 June 2022.
- ↑ Sakshi (23 March 2019). "కడప జిల్లా ముఖచిత్రం". Sakshi. Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
- ↑ Andhra Jyothy (7 July 2019). "బీజేపీలో చేరిన టీడీపీ మాజీ మంత్రి". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.