సుధీ రంజన్ దాస్

భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి
(ఎస్.ఆర్. దాస్ నుండి దారిమార్పు చెందింది)

సుధీ రంజన్ దాస్ (1894, అక్టోబరు 1 - 1977, సెప్టెంబరు 18) భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి. 1956 ఫిబ్రవరి 1 నుండి 1959 సెప్టెంబరు 30 వరకు పనిచేశాడు. దాస్ ది స్టేట్స్‌మన్ చైర్మన్‌గా కూడా పనిచేశాడు.[2]

సుధీ రంజన్ దాస్
సుధీ రంజన్ దాస్
5వ భారత ప్రధాన న్యాయమూర్తి
In office
1956 ఫిబ్రవరి 1 – 1959 సెప్టెంబరు 30
Appointed byబాబూ రాజేంద్ర ప్రసాద్
అంతకు ముందు వారుబిజన్ కుమార్ ముఖర్జియా
తరువాత వారుభువనేశ్వర్ ప్రసాద్ సిన్హా
వ్యక్తిగత వివరాలు
జననం(1894-10-01)1894 అక్టోబరు 1
కలకత్తా, పశ్చిమ బెంగాల్[1]
మరణం1977 సెప్టెంబరు 18(1977-09-18) (వయసు 82)
కళాశాలకలకత్తా విశ్వవిద్యాలయం
యూనివర్సిటీ కాలేజ్ లండన్‌
పథ భవనం

జననం, విద్య

మార్చు

సుధీ రంజన్ దాస్ 1894, అక్టోబరు 1న రాఖల్ చంద్ర దాస్ - బినోదిని దాస్‌ దంపతులకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని తెలిర్‌బాగ్‌లోని ప్రముఖ బైద్య దాస్ కుటుంబంలో (వాస్తవానికి దాస్‌గుప్తా) జన్మించాడు. శాంతినికేతన్‌లోని పథ భవనంలో చేరిన సుధీ రంజన్ దాస్, రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి నలుగురు విద్యార్థులలో ఒకడు.[2] స్కాటిష్ చర్చి కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తిచేసి, కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న బంగాబాసి కళాశాలలో చేరాడు. తరువాత యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో న్యాయశాస్త్రం అభ్యసించి, 1918లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి ఫస్ట్-క్లాస్ ఆనర్స్ ఎల్.ఎల్.బి. అందుకున్నాడు. 1918లో లండన్‌లోని గ్రేస్ ఇన్‌లోని బార్‌లో చేరాడు.[2][3][4]

వ్యక్తిగత జీవితం

మార్చు

సివిల్ సర్వీస్ అధికారి ఎస్.బి. మజుందార్ కుమార్తె స్వప్న మజుందార్‌తో సుధీ రంజన్ దాస్ వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (గ్రూప్ కెప్టెన్ సురంజన్ దాస్, సుహృద్ రంజన్ దాస్), ఒక కుమార్తె (అంజన) ఉన్నారు. దేశబంధు చిత్తరంజన్ దాస్, సరళా రాయ్, అబ్లాబోస్, సతీష్ రంజన్ దాస్ అతని బంధువులు.

న్యాయవృత్తి

మార్చు

1942లో కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బెంచ్‌కు పదోన్నతి పొంది, 1944లో కలకత్తా హైకోర్టులో ప్యూస్నే న్యాయమూర్తి అయ్యాడు. 1949 నుండి 1950 వరకు పంజాబ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. 1950లో కొత్త రాజ్యాంగం ప్రారంభానికి రోజులముందు భారత ఫెడరల్ కోర్టు/సుప్రీం కోర్టుకు నియమించబడ్డాడు. మూడు సంవత్సరాలకుపైగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం- చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవిని చేపట్టేముందు, రెండుసార్లు భారతదేశ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. 1959 సెప్టెంబరు 30న పదవీ విరమణ చేశాడు.

1, సఫ్దుర్‌జంగ్ రోడ్

మార్చు

అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన నివాసంగా ఉపయోగించుకున్న సఫ్దుర్‌జంగ్ రోడ్‌లోని 1లోని బంగ్లాలో మొదట్లో ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఆర్ దాస్ నివసించేవాడు. ఈ బంగ్లా 1984లో ఇందిరా గాంధీ హత్యకు సాక్షిగా నిలిచింది. ఆ తరువాత మ్యూజియంగా మార్చబడింది.

మూలాలు

మార్చు
  1. "Sudhi Ranjan Das" (PDF). Journal of the Indian Law Institute (in ఇంగ్లీష్). II (2–3). The Indian Law Institute: 154–156. January–June 1960.{{cite journal}}: CS1 maint: date format (link)[permanent dead link]
  2. 2.0 2.1 2.2 Biography on Supreme Court of India's NIC webpage
  3. 175th Year Commemoration Volume. Scottish Church College. April 2008. p. 593. OCLC 243677369. S. R. Das (Chief Justice, Supreme Court)
  4. Sen, Asit.