శరత్ చంద్ర శంకర్ శ్రీఖండే (జననం. అక్టోబరు 19 1917) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన "సంయోగ గణితశాస్త్రం"లో ప్రత్యేకమైన మరియు బాగా గుర్తింపు పొందిన విజయాలు సాధించారు. ఆయన ఆర్.సి.బోస్ మరియు ఇ.టి.పార్కర్ లతో కలసి "ప్రతి n విలువకు 4n + 2 వర్గం ఆర్థోగోనల్ లాటిన్ చదరములు రెండు వ్యవస్థితములు కావు" అనే సూత్రమునకు 1782 లో లియొనార్డ్ ఆయిలర్ చేయని నిరూపణను చేసి విశేష గుర్తింపు పొందారు.[1] శ్రీఖండే గణిత శాస్త్రంలో "సంయోగాలు" మరియు సాంఖ్యక శాస్త్ర డిసైన్లులో ప్రత్యేకతను సంతరించుకున్నారు. శ్రీఖండే గ్రాఫ్ [2] సాంఖ్యక శాస్త్ర డిజైన్లలో ఉపయోగిస్తున్నారు.

శరత్‌చంద్ర ఎస్.శ్రీఖండే
జననం (1917-10-19) 1917 అక్టోబరు 19 (వయస్సు: 102  సంవత్సరాలు)
Sagar, Madhya Pradesh, India
నివాసంభారతదేశము
పౌరసత్వంభారతీయుడు Flag of India.svg
రంగములుCombinatorics
విద్యాసంస్థలుముంబై విశ్వవిద్యాలయం ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
పూర్వ విద్యార్థిUniversity of North Carolina, Chapel Hill
పరిశోధనా సలహాదారుడు(లు)రాజ్ చంద్ర బోస్
ప్రసిద్ధిEuler's conjecture

శ్రీఖండే 1950 లో చాపెల్ హిల్ల్ లోని నార్త్ కారొలినా విశ్వవిద్యాలయంలో శ్రీ ఆర్.సి.బోస్ గారి ఆధ్వర్యంలో పి.హెచ్.డిని పొందారు. ఆయన యు.ఎస్.ఎ మరియు భారతదేశములలో వివిధ విశ్వవిద్యాలయాలలో బోధన చేశారు.[3]

శ్రీఖండే బానారస్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు. ముంబై విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర విభాగానికి అధిపతిగా కూడా యున్నారు. ఈయన సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీకి డైరక్టరుగా యున్నారు. ఆయన 1978 లో పదవీవిరమణ చేసిన వరకు ఆ పదవిలోనే కొనసాగారు. ఈయన "ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ", "ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్" మరియు యు.ఎస్.ఎ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్ ఇనిస్టిట్యూట్ లలో ఫెలోగా యున్నారు.

ఆయన కుమారుదు మోహన్ శ్రీఖండే[4] మిచిగాన్ లోని మౌంట్ ప్లెజంట్ నందుగల సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో సంయోగ గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ గా యున్నారు.

మూలాలుసవరించు

  1. Osmundsen, John A. (April 26, 1959), Major Mathematical Conjecture Propounded 177 Years Ago Is Disproved, New York Times. Scan of full article.
  2. Shrikhande graph
  3. "Prof. S. S. Shrikhande – An Outstanding Statistician", Statistical Newsletter, XXVIII (3): 3, July–September 2003, మూలం నుండి 2008-01-04 న ఆర్కైవు చేసారు, retrieved 2014-01-26CS1 maint: date format (link).
  4. "M. S. Shrikhande". మూలం నుండి 2009-10-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-01-26. Cite web requires |website= (help)