ఎస్.ఏ. సంపత్ కుమార్
ఎస్.ఏ. సంపత్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో అలంపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి[1], ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నాడు.
ఎస్.ఏ. సంపత్ కుమార్ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2014 - 2018 | |||
ముందు | వి.ఎం. అబ్రహం | ||
---|---|---|---|
తరువాత | వి.ఎం. అబ్రహం | ||
నియోజకవర్గం | అలంపూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 20 జూన్ 1972 చిన్న తాండ్రపాడు గ్రామం, అయిజ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఆనందరావు & కె.టి. లూషమ్మ | ||
జీవిత భాగస్వామి | మహాలక్ష్మి | ||
నివాసం | హైదరాబాద్ |
జననం, విద్యాభాస్యం
మార్చుసంపత్ కుమార్ 20 జూన్ 1972న తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, చిన్న తాండ్రపాడు గ్రామంలో ఆనందరావు & కె.టి. లూషమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1987లో పదవ తరగతి, 1987-1989 వరకు ఇంటర్మీడియట్, 1989-1992 వరకు మహబూబ్‌నగర్‌లోని ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల నుండి బీఎస్సీ, 1992-1993 వరకు మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ విద్యా కళాశాలలో బి.ఇడి పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుసంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అలంపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మందా శ్రీనాథ్ పై 57419 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర బాల కార్మిక సలహా మండలి సభ్యుడిగా, మహారాష్ట్ర ఇంచార్జిగా పని చేశాడు. సంపత్ కుమార్ 2018 & 2023 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] ఆయన 2023లో కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులుగా పని చేశాడు.[3]
సంపత్ కుమార్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు, ఆ తరువాత ఆయనను 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మార్చి 31న మహబూబ్‌నగర్ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ప్రకటించింది.[4]
మూలాలు
మార్చు- ↑ Eenadu (13 November 2023). "తొలి ప్రయత్నం.. వరించిన విజయం". EENADU. Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Eenadu (7 December 2023). "కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులుగా తెలుగు నాయకులు". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
- ↑ Andhrajyothy (31 March 2024). "లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను ప్రకటించిన కాంగ్రెస్.. హైదరాబాద్‌కు ఎవరంటే." Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.