మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. అంతకు క్రితం ఉన్న ఆలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలు నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కల్పబడింది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గములు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భాగమైనాయి. 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపొందాడు.

మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి జైపాల్ రెడ్డి

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు మార్చు

 1. కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం
 2. నారాయణపేట అసెంబ్లీ నియోజక వర్గం
 3. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం
 4. జడ్చర్ల అసెంబ్లీ నియోజక వర్గం
 5. దేవరకద్ర అసెంబ్లీ నియోజక వర్గం
 6. మక్తల్ అసెంబ్లీ నియోజక వర్గం
 7. షాద్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం

నియోజకవర్గపు గణాంకాలు మార్చు

 • 2001 లెక్కల ప్రకారము నియోజకవర్గపు జనాభా: 17,41,848.
 • ఓటర్ల సంఖ్య: 13,05,702.
 • ఎస్సీ, ఎస్టీల శాతం: 15.12%, 7.70%

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు మార్చు

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
మొదటి 1952-57 పులి రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
1952-57 కె. జనార్ధన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
రెండవ 1957-62 జానంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
1957-62 పులి రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 జె.బి. ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 జానంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 జె.బి. ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్
ఆరవ 1977-80 జానంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 మల్లికార్జున్‌ గౌడ్‌ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 ఎస్.జైపాల్‌రెడ్డి జనత పార్టీ
తొమ్మిదవ 1989-91 మల్లికార్జున్‌ గౌడ్‌ భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 మల్లికార్జున్‌ గౌడ్‌ భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1996-98 మల్లికార్జున్‌ గౌడ్‌ భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998-99 ఎస్.జైపాల్‌రెడ్డి జనత పార్టీ
పదమూడవ 1999-04 జితేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ
పదునాల్గవ 2004-09 దేవరకొండ విఠల్ రావు భారత జాతీయ కాంగ్రెస్
15వ లోక్‌సభ 2009-14 కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి
16వ లోక్‌సభ 2014- జితేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన 14 వ లోక్‌సభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు.

2004 లో ఫలితాలను తెలిపే చిత్రం

  డి.విఠల్ రావు (49.48%)
  యెల్కోటి యల్లారెడ్డి (43.95%)
  గుండల విజయలక్ష్మి (2.98%)
  రామచంద్రయ్య యాదవ్ (2.11%)
  మజ్‌హెర్ హుసేన్ (1.48%)
2004 ఎన్నికలలో అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
భారత సాధారణ ఎన్నికలు,2004: మహబూబ్ నగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భారత జాతీయ కాంగ్రెస్ దేవరకొండ విఠల్ రావు 428,764 49.48 +6.45
తెలుగుదేశం పార్టీ యెల్కోటి యల్లారెడ్డి 380,857 43.95
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గుండల విజయలక్ష్మి 25,842 2.98
బహుజన సమాజ్ పార్టీ జి.రామచంద్రయ్య యాదవ్ 18,304 2.11
ముస్లిం లీగ్ కేరళ స్టేట్ కమిటీ ముహమ్మద్ మజ్‌హెర్ హుసేన్ 12,783 1.48
మెజారిటీ 47,907 5.53 +11.96
మొత్తం పోలైన ఓట్లు 866,550 63.46 -3.03
భాజపా పై కాంగ్రెస్ విజయం సాధించింది ఓట్ల తేడా +6.45

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ 2004లో విజయం సాధించిన డి.విఠల్ రావు పోటీ చేయగా[1] మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కె.చంద్ర శేఖర్ రావు పోటీచేశాడు. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో తెరాస అధ్యక్షుడు కె.సి.ఆర్. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన విఠల్ రావుపై 20,184 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

మూలాలు మార్చు

 1. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009