ఎస్.వి.ఎల్.నరసింహం

భారతీయ రాజకీయనేత
(ఎస్.వి.ఎల్.నరసింహారావు నుండి దారిమార్పు చెందింది)

శిష్ట్లా వెంకట లక్ష్మీ నరసింహం ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికైన మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడు.[1]

శిష్ట్లా వి. లక్ష్మీ నరసింహం
ఎస్.వి.ఎల్.నరసింహం

నియోజకవర్గము గుంటూరు

వ్యక్తిగత వివరాలు

జననం మే 24, 1911,
గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
మరణం సెప్టెంబర్ 28, 2006
రాజకీయ పార్టీ స్వతంత్ర అభ్యర్ధి
సంతానము 5 కుమారులు, 2 కుమార్తెలు.
వెబ్‌సైటు లేదు

జననంసవరించు

నరసింహం 1911, మే 24గుంటూరు జిల్లాలో జన్మించాడు. 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసిన ఎన్.జి.రంగాను ఓడించి గుంటూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యాడు.[2] ఆ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనని భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఈయనకు మద్దతిచ్చింది. మార్క్సిస్టు సిద్ధాంతాలని పూర్తిగా నమ్మినా, నరసింహారావు కమ్యూనిస్టు పార్టీలో చేరలేదు. పార్టీలో చేరకుండా బయటనుండే సిద్ధాంతాలకు పూర్తిగా న్యాయం చేయగలననే నమ్మకంతో స్వతంత్ర అభ్యర్థిగానే ఉన్నాడు.[3] 1957లో తిరిగి గుంటూరు నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీ చేసినా, కాంగ్రేసు అభ్యర్థి కొత్త రఘురామయ్య చేతిలో ఓడిపోయాడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన నరసింహం 1936 నుండి 2004 వరకు న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూనే ఉన్నాడు. 1930లలో కృష్ణా సిమెంట్ కంపెనీ యొక్క ట్రేడ్ యూనియన్‌కు అధ్యక్షత వహించాడు. 1939లో గుంటూరు పురపాలకసంఘంలో బ్రాడీపేట కౌన్సిలర్ గా ఎన్నికయ్యాడు. 1965 నుండి 1970 వరకు బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. స్వాతంత్ర్యోద్యమంలో రెండు సార్లు జైలుకు కూడా వెళ్ళాడు.

మరణంసవరించు

ఈయన 2006, సెప్టెంబర్ 28 న గుంటూరులోని కృష్ణానగర్ లో 96 ఏళ్ల వయసులో మరణించాడు. నరసింహం భార్య శిష్ట్లా రాజ్యలక్ష్మి.[4] వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.[5]

మూలాలుసవరించు