గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం


ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం చాలా మార్పులకు గురైంది. ఇంతకు క్రితం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు శాసనసభా నియోజకవర్గములు నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలుసవరించు

 1. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
 2. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం
 3. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం
 4. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం
 5. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
 6. ఉత్తర గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గం
 7. దక్షిణ గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గం

నియోజకవర్గపు గణాంకాలుసవరించు

 • 2001 లెక్కల ప్రకారం జనాభా: 18,36,008 [1]
 • ఓటర్ల సంఖ్య: 12,97,103.
 • ఎస్సీ, ఎస్టీల శాతం: 18.33%, 3.07%.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులుసవరించు

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 ఎస్.వి.ఎల్.నరసింహారావు స్వతంత్ర అభ్యర్ధి
రెండవ 1957-62 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు
తొమ్మిదవ 1989-91 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 ఎస్.ఎమ్.లాల్ జాన్ పాషా తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ 1999-04 ఎంపరాల వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ 2004-2009 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2009- 2014 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పదహారవ 2014- ప్రస్తుతం గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలుసవరించు

2004 ఎన్నికల ఫలితాలను చూపే చిత్రం

  యంపర్ల వెంకటేశ్వరరావు (40.95%)
  జె.హనుమంతరావు గౌడ్ (1.14%)
  ఇతరులు (1.15%)
భారత సాధారణ ఎన్నికలు,2004గుంటూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ రాయపాటి సాంబశివరావు 4,66,221 56.75 +10.83
తె.దే.పా యంపర్ల వెంకటేశ్వరరావు 3,36,429 40.95 -10.13
బసపా జూపల్లి హనుమంతరావు గౌడ్ 9,375 1.14 +1.14
తెరాస గుండి వెంకటేశ్వర్లు 5,444 0.66 +0.66
స్వతంత్ర అభ్యర్ది మువ్వ వెంకటరావు 4,009 0.49 +0.46
మెజారిటీ 1,29,792 15.80 +20.96
మొత్తం పోలైన ఓట్లు 8,21,478 70.06 +5.95
కాంగ్రెస్ గెలుపు మార్పు +10.83

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు. [2] ప్రజారాజ్యం తరఫున తోట చంద్రశేఖర్ పోటీలో ఉన్నాడు. [3]. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మేడల రాజేంద్రపై విజయం సాధించారు. రాయపాటి సాంబశివరావుకు 403937 ఓట్లు రాగా, రాజేంద్రకు 364582 ఓట్లు వచ్చాయి.

2014 ఎన్నికలుసవరించు

సార్వత్రిక ఎన్నికలు, 2014: గుంటూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తె.దే.పా గల్లా జయదేవ్ 618,417 49.68
వై.కా.పా వల్లభనేని బాలశౌరి 549,306 44.12
కాంగ్రెస్ అబ్దుల్ వహిద్ షేక్ 46,818 3.76
Jai Samaikyandhra Party మల్లెల వెంకటరావు 5,608 0.45
బసపా మల్లెల బాబూరావు 4,223 0.34
AAP కోట వెంకట భవానీ వీర వరప్రసాద్ 2,344 0.19
Pyramid Party of India అబ్బూరి కోటేశ్వరరావు 1,636 0.13
NOTA None of the Above 7,596 0.61
మెజారిటీ 69,111 5.56
మొత్తం పోలైన ఓట్లు 1,244,926 79.19 +2.66
కాంగ్రెస్ పై తె.దే.పా విజయం సాధించింది ఓట్ల తేడా

మూలాలుసవరించు

 1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92862&subcatid=17&categoryid=3
 2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
 3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009