ఏఆర్ మురుగదాస్

(ఎ.ఆర్ మురుగ దాస్ నుండి దారిమార్పు చెందింది)


మురుగ దాస్ దక్షిణ భారతదేశానికి చెందిన చలన చిత్ర దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

'ఏ. ఆర్. మురుగ దాస్'

జన్మ నామంఅజిత్ రాహుల్ మురుగ దాస్
జననం (1977-09-25) 1977 సెప్టెంబరు 25 (వయసు 47)
కళ్ళకూరిచి , తమిళనాడు, ఇండియా
క్రియాశీలక సంవత్సరాలు 2001 - ప్రస్తుతం

బాల్యం

మార్చు

తమిళనాడు లోని సేలం దగ్గర్లోని కళ్లకురిచ్చి అనే పల్లెటూర్లో జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో నాలుగోవాడు. తండ్రిది చిన్న సామాన్ల దుకాణం. ఇంటర్ వరకు అదే ఊర్లో చదివాడు. బీయే కోసం తిరుచ్చి వెళ్ళాడు. కాలేజీలో ఏ సాంస్కృతిక ప్రదర్శనలు జరిగినా ముందుండేవాడు. అక్కడ చదువుతున్నప్పుడు సినిమాలు చూడ్డం పెరిగి, సినిమాల్లో ప్రయత్నించాలనే కోరిక ఎక్కువైంది.

సినిమాల్లో ప్రయత్నం

మార్చు

సినిమాల్లో మంచి కథా రచయితగా స్థిరపడాలని చెన్నై వెళ్ళాడు. కలైమణి అనే తమిళ రచయిత దగ్గర కాపీ రైటర్‌గా చేరాడు. కొన్నాళ్ల తరువాత దర్శకత్వం మీద మోజు పుట్టింది. దాంతో అమృతం అనే దర్శకుణ్ణి ఆశ్రయించాడు. అక్కడ నుంచి దాదాపు పదేళ్ళు దర్శకత్వశాఖలో ఉన్నాడు. ఎస్‌.జె.సూర్య దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వాలి, ఖుషి వంటి సినిమాలకు పనిచేశాడు.

ఆ అనుభవంతో తమిళంలో అజిత్‌తో ఓ సినిమా తీశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. తరువాత సినిమా రమణ (తమిళం). సూపర్‌హిట్‌. దాన్ని తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా ఠాగూర్‌ (సినిమా)గా రీమేక్‌ చేశారు. అది తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది.

తరువాత షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఆధారంగా సూర్య నాయకుడిగా గజినీ సినిమా తీశాడు. అది కూడా తెలుగు తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. దాంతో బాలీవుడ్ లో అదే సినిమాని ఆమిర్ ఖాన్ తో తీసే అవకాశం వచ్చింది. ఆ చిత్రం కూడా సంచలన విజయాన్ని సాధించింది.

సినిమాలు

మార్చు

కుటుంబం

మార్చు

ప్రస్తుతం ఆయన భార్య, పాపతో చెన్నైలో నివసిస్తున్నాడు.

ఆయన అభిమాన దర్శకుడు మణిరత్నం. గాడ్ ఫాదర్, లగేరహో మున్నాభాయ్ ఆయనికిష్టమైన చిత్రాలు.