ఎ.ఎస్. రావు నగర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతం

ఎ.ఎస్. రావు నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతం. నగరానికి ఈశాన్యం వైపున ఉన్న ఈ ప్రాంతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ లో 2వ వార్డు నంబరుగా ఉంది.[1]

ఎ.ఎస్. రావు నగర్

డా. ఎ.ఎస్. రావు నగర్
సమీపప్రాంతం
ఎ.ఎస్. రావు నగర్ is located in Telangana
ఎ.ఎస్. రావు నగర్
ఎ.ఎస్. రావు నగర్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
ఎ.ఎస్. రావు నగర్ is located in India
ఎ.ఎస్. రావు నగర్
ఎ.ఎస్. రావు నగర్
ఎ.ఎస్. రావు నగర్ (India)
నిర్దేశాంకాలు: 17°28′23″N 78°33′59″E / 17.47306°N 78.56639°E / 17.47306; 78.56639
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
పేరు వచ్చినవిధండాక్టర్ అయ్యగారి సాంబశివరావు (డాక్టర్ ఎ.ఎస్.రావు)
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
సముద్రమట్టం నుండి ఎత్తు
543 మీ (1,781 అ.)
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500062
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుటిఎస్-08
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఉప్పల్ శాసనసభ నియోజకవర్గం
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ
పట్టణ ప్రణాళిక సంస్థహెచ్ఎండిఏ

2012లో ఈ ఏరియాలో అద్దె ధరలు బాగా పెరిగాయి.[2] ఇది నేరెడ్‌మెట్‌, ఇసిఐఎల్, సైనిక్‌పురి, మౌలాలీలతో మొదలైన ప్రాంతాలకు సమీపంలో ఉండి, అనేక టౌన్‌షిప్‌లను కలిగి ఉంది.[3]

పేరు వెనుక చరిత్ర సవరించు

హైదరాబాదులో ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐఎల్) వ్యవస్థాపకుడు డాక్టర్ అయ్యగారి సాంబశివరావు (డాక్టర్ ఎ.ఎస్.రావు) పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఎ.ఎస్. రావు నగర్ అని పేరు పెట్టారు. అటామిక్ ఎనర్జీ, ఇసిఐఎల్, ఎన్‌ఎఫ్‌సి, టిఎఫ్‌ఆర్ విభాగాల ఉద్యోగుల ప్రయోజనాల కోసం 1976లో ఇసిఐఎల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయడంలో ఎ.ఎస్. రావు ముఖ్యపాత్ర పోషించాడు.

ఆర్థిక వ్యవస్థ సవరించు

ఇక్కడ రిటైల్ దుకాణాలు, వాణిజ్య భవనాలు ఉన్నాయి.[4]

రవాణా సవరించు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఎ.ఎస్. రావు నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. రామకృష్ణాపురం గేట్ రైల్వే స్టేషను, మౌలాలీ రైల్వే స్టేషనులు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతం ఘటకేసర్, ఇసిఐఎల్, నేరెడ్‌మెట్‌, కీసర, సైనిక్‌పురి, మల్కాజ్‌గిరి ప్రాంతాలకు రవాణా పరంగా కలుపబడి ఉంటుంది.

మూలాలు సవరించు

  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-01-11.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "A S Rao Nagar in high street map of India". The Times of India. Retrieved 2021-01-11.
  3. "Small steps make a big difference". The Hindu. Retrieved 2021-01-11.
  4. "On the fast lane: AS Rao Nagar turns a shopper's paradise". The Times of India. Retrieved 2021-01-11.