మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా

తెలంగాణలోని జిల్లా
(మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుండి దారిమార్పు చెందింది)

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]

మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా
తెలంగాణ పటంలో మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా స్థానం
తెలంగాణ పటంలో మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంమేడ్చల్
మండలాలు15
Government
 • లోకసభ నియోజకవర్గాలు1 (మల్కాజ్‌గిరి)
 • శాసనసభ నియోజకవర్గాలు9
Area
 • మొత్తం1,084 km2 (419 sq mi)
Population
 (2011)
 • మొత్తం24,40,073
 • Density2,300/km2 (5,800/sq mi)
 • Urban
22,30,245
జనాభా వివరాలు
 • అక్షరాస్యత82.49
 • లింగ నిష్పత్తి957
Vehicle registrationTS–08 [1]
ప్రధాన రహదార్లు3 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు
Websiteఅధికారిక జాలస్థలి
మేడ్చల్-మల్కాజగిరి జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం

2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (మల్కాజ్‌గిరి, కీసర), 14 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 6తో కలుపుకొని 162 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.[2] ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే. జిల్లా పరిపాలనా కేంద్రం షామీర్‌పేట్.[3] షామీర్‌పేట్ మండలం, అంతయపల్లి గ్రామంలో నిర్మించిన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను 2022 ఆగస్టు 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.

పటం
మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా

స్థానిక స్వపరిపాలన మార్చు

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

విద్యాసంస్థలు మార్చు

 
మేడ్చల్ రైల్వే స్టేషన్

కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ యూనివర్సిటీ, బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, దుండిగల్‌లోని ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్, మైసమ్మగూడలో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ, సూరారంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, శామీర్‌పేటలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఉన్నాయి.

జిల్లాలో శాసనసభ నియోజకవర్గాలు మార్చు

జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

జిల్లాలో పార్లమెంటు నియోజక వర్గాలు మార్చు

జిల్లాలోని మండలాలు మార్చు

  1. మేడ్చల్ మండలం
  2. శామీర్‌పేట్‌ మండలం
  3. కీసర మండలం
  4. కాప్రా మండలం *
  5. ఘట్‌కేసర్ మండలం
  6. మేడిపల్లి మండలం *
  7. ఉప్పల్ మండలం
  8. మల్కాజ్‌గిరి మండలం
  9. అల్వాల్ మండలం *
  10. కుత్బుల్లాపూర్ మండలం
  11. దుండిగల్ గండిమైసమ్మ మండలం *
  12. బాచుపల్లి మండలం *
  13. బాలానగర్ మండలం
  14. కూకట్‌పల్లి మండలం *
  15. మూడుచింతలపల్లి మండలం *

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (7)

జిల్లాలోని పురపాలక సంఘాలు (2018 నాటికి) మార్చు

జిల్లాలో మొత్తం 13 పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉన్నాయి.వాటిలో 10 పురపాలక సంఘాలు కాగా, 3 నగరపాలక సంస్థలు ఉన్నాయి.

  1. జవహార్‌నగర్‌: 21 వార్డులు
  2. దమ్మాయిగూడ: 11 వార్డులు (దమ్మాయిగూ డ, అహ్మద్‌గూడ, కుందనపల్లి, గోధుమకుంట)
  3. నాగారం: 11 వార్డులు (నాగారం, రాంపల్లి)
  4. పోచారం: 11 వార్డులు (పోచారం, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, నారపల్లి, యన్నంపేట్‌)
  5. ఘట్కేసర్‌: 11 వార్డులు (ఘట్కేసర్, కొండాపూర్, ఎన్‌ఎఫ్‌సీనగర్‌)
  6. గండ్లపోచంపల్లి: 07 వార్డులు (గండ్లపోచంపల్లి, కండ్లకోయ, బాసిరేగడి, గౌరవెళ్లి, అర్కలగూడ)
  7. తూంకుంట: 11 వార్డులు (దేవరయాంజల్, ఉప్పరపల్లి)
  8. నిజాంపేట్‌: 25 వార్డులు (నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్‌)
  9. కొంపల్లి: 11 వార్డులు (కొంపల్లి, దూలపల్లి)
  10. దుండిగల్‌: 15 వార్డులు (దుండిగల్, మల్లంపేట్, డీపీపల్లి, గాగిల్లాపూర్, బౌరంపేట్, బహుదూర్‌పల్లి)
  11. బోడుప్పల్‌: 21 వార్డులు (బోడుప్పల్, చెంగిచర్ల),
  12. పీర్జాదిగూడ: 21వార్డులు (ఫిర్జాదిగూడ, పర్వాతాపూర్, మేడిపల్లి)
  13. మేడ్చల్‌: 15 వార్డులు ( మేడ్చల్, అత్వెల్లి) [4]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  2. 2.0 2.1 "Medchal−Malkajgiri district" (PDF). New Districts Formation Portal. Government of Telangana. Archived from the original (PDF) on 30 November 2016. Retrieved 22 April 2019.
  3. "మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ప్రొఫైల్ (అధికార వెబ్సైట్)". Archived from the original on 2017-03-23. Retrieved 2019-04-25.
  4. Sakshi (17 December 2018). "ఇక మున్సిపల్‌ వార్‌". Retrieved 23 March 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)

వెలుపలి లింకులు మార్చు