ఎ.సి. గార్డ్స్
ఎ.సి. గార్డ్స్, తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరంలోని ఒక ప్రాంతం. 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జా VI కాలంలో హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ఆఫ్రికన్ అశ్వికదళ గార్డుల కోసం ఏర్పాటుచేయబడింది.[1]
ఎ.సి. గార్డ్స్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°23′49″N 78°27′25″E / 17.397°N 78.457°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 004 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | నాంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
చరిత్ర
మార్చుఇది 100 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చరిత్రకారుల అభిప్రాయం. నిజాం సైన్యంలోని ఆఫ్రికన్ సైనికులకు ఎసి గార్డ్స్ ప్రాంతంలో వసతి గృహాలు ఇవ్వబడ్డాయి. మాసబ్ ట్యాంక్, ఖైరతాబాదు ప్రాంతాలు ఎసి గార్డ్స్ సమీపంలో ఉన్నాయి.
హైదరాబాదుకి ఆహ్వానం
మార్చు19వ శతాబ్దంలో ఆఫ్రికన్లు మరొక భారతీయ కులీనుడి ఆస్థానంలో పనిచేస్తున్నట్లు 6వ నిజాం రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ తెలుసుకున్నాడు. ఆఫ్రికన్ల సామర్థ్యాల గురించి తెలుసుకున్న నిజాం ఆఫ్రికన్ల బృందాన్ని హైదరాబాదు ఆహ్వానించాడు. అప్పుడు సుమారు 300 మంది యువకుల బృందం హైదరాబాదుకు వచ్చింది.[1] తన కుటుంబాన్ని కాపాడటానికి వచ్చినప్పుడు, 7వ నిజాంకు ఈ బాడీగార్డ్స్‌పై సంపూర్ణ నమ్మకం ఉందని చెబుతారు.[2]
క్రీడలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Hyderabad's African old guard". 2003-08-04. Retrieved 2021-01-16.
- ↑ Ababu Minda Yimene (2004). An African Indian Community in Hyderabad. Göttingen: Cuvillier. ISBN 3-86537-206-6. Archived from the original on 28 September 2013. Retrieved 16 January 2021.
- ↑ "AC Guards wins". The Hindu. 2008-05-04. ISSN 0971-751X. Retrieved 2021-01-16.
- ↑ "2008 Jr. Men's AsiaCup". stick2hockey. Archived from the original on 2016-10-18. Retrieved 2021-01-16.