ఎ. కృష్ణారావు
ఎ. కృష్ణారావు (అప్పరుసు కృష్ణారావు)[1] సీనియర్ పాత్రికేయుడు, కవి, రచయిత, అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు.[2] ఉదయం, వార్త, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పనిచేశాడు. కృష్ణుడు అనే మారుపేరుతో తన కవితలను ప్రచురించాడు. 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం గెలుచుకున్నాడు.[3]
ఎ. కృష్ణారావు | |
---|---|
జననం | |
వృత్తి | పాత్రికేయుడు |
జీవిత భాగస్వామి | మంజుల |
పిల్లలు | ఒక కొడుకు, కూతురు |
జననం
మార్చుకృష్ణారావు 1962, జూన్ 6న తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్ జిల్లా, కోయిలకొండ మండలంలోని వింజమూరు గ్రామంలో జన్మించాడు. తండ్రి తెలంగాణ పోరాటంలో మఖ్ధూం మొహియిద్దీన్ వంటి వారితో కలిసి పాల్గొన్నాడు, ఉర్దూ కవితలు రాసేవాడు. కొంతకాలం సియాసత్ పత్రికలో కూడా పనిచేశాడు. తాత అప్పరుసు లక్ష్మీనరసింహారావు గోలకొండ కవుల్లో ఒకరు. వీరరాఘవా అన్న శీర్షికతో ఆయన కవిత్వం గోలకొండ సంచికలో కనపడుతుంది.[4]
సాహిత్య ప్రస్థానం
మార్చుపాతబస్తీలోని అభినవ కళాసాహితి, హైదరాబాద్ పాతనగర రచయితల సంఘం కార్యక్రమాలు, అక్కడి గ్రంథాలయాలు కృష్ణారావుపై ప్రభావాన్ని చూపాయి. చిన్నతనం నుండే ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై అభిరుచి ఏర్పడింది. 12 ఏళ్ల వయస్సులో `కటిక చీకటిలోన కలువమా, కాంతి చెందెందవేలచెపుమా, నిశీథిలో అసురుడివలె ఎసరేక ఎల పెరిగెదవో' అన్న కవిత రాశాడు.8వ తరగతి చదువుతుండగానే 'బాలభాను' అన్న లిఖిత మాస పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించారు.
వృత్తిరంగం
మార్చుసిర్పూర్ పేపర్ మిల్స్, తర్వాత హైదరాబాద్‌లో బ్రిస్టల్ ఫార్మసుటికల్స్‌లో పనిచేసి ఈ తరువాత ఉదయం పత్రిక ప్రారంభమైనప్పుడు అందులో చేరాడు. 1983లో ఆంధ్రభూమిలో సాహితీ చౌరస్తా అన్న పేరిట ఒక సాహితీ కాలమ్ నిర్వహించాడు. సాహితీ సభల్లో మాట్లాడడం, సాహిత్య విమర్శకుడుగా అనేకమంది రచయితల పుస్తకాలు సమీక్షించాడు.
ఉదయం, ఎపిటైమ్స్, ఆంధ్రభూమి తదితర పత్రికల్లో పనిచేసిన కృష్ణారావు ఇండియన్ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ ఎడిషన్ కు ఇంఛార్డ్ సంపాదకుడుగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో ఛీఫ్ గా ఉన్నకృష్ణారావు 'ఇండియాగేట్' పేరుతో రచిస్తున్న కాలమ్స్ ఎంతో ప్రసిద్ధి చెందాయి.[5] ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర[6] పేరుతో ఆయన సమకాలీన రాజకీయాలపై పుస్తకాలు రాశాడు. ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి, ఒక్క కరచాలనం చేయి పేర్లతో ఆయన కవితా సంకలనాలు ప్రచురితమయ్యాయి. 'కృష్ణ పక్షం' పేరుతో సాహితీ విమర్శా వ్యాసాల సంకలనాన్ని ప్రచురించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలంగాణ, పి.వి, ఇందిరాగాంధీ లపై రచించిన పుస్తకాలను అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ రచించిన 'సునో రాధికా' అనే కావ్యాన్ని 'రాధికా, ఆలకించు' పేరుతో అనువదించారు. ప్రధాని పి.వి. నరసింహారావు పై తెలుగులో 'విప్లవతపస్వి', ఇంగ్లీషులో 'ద క్వింటిసెన్షియల్ రెబెల్' పేరిట పుస్తకాలు రాశారు. కృష్ణారావు కేంద్ర సమాచార మంత్రి వెంకయ్య నాయుడుకు సలహాదారుగా కూడా పనిచేశాడు.
పురస్కారాలు
మార్చుకృష్ణారావుకు గోరాశాస్త్రి, మోటూరు హనుమంతరావు, తాపీ ధర్మారావు, ఎన్ ఆర్ చందూర్ తదితర దిగ్గజాల పేరిట ఉత్తమ జర్నలిస్టుగా పురస్కారాలు లభించాయి.[7] . కవిగా ఆలూరి బైరాగి, రొట్టమాకు రేవు, తెలుగు యునివర్సిటీ పురస్కారాలను అందుకున్నారు. కవయిత్రి పద్మా సచ్‌దేవ్ రాసిన కవితలను ‘గుప్పెడు సూర్యుడు-మరికొన్ని కవితలు‘ పేరిట తెలుగులో అనువదించినందుకు 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది.
కుటుంబం
మార్చుప్రస్తుతం కృష్ణారావు న్యూఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య మంజుల, ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ "Award presented to scribe". The Hindu (in Indian English). Special Correspondent. 2010-06-19. ISSN 0971-751X. Retrieved 2022-01-20.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "ప్రశ్నించడమే కవిత్వం". m.andhrajyothy.com. 2019-02-25. Archived from the original on 2022-01-20. Retrieved 2022-01-20.
- ↑ "సీనియర్ జర్నలిస్టు కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం | Telangana Magazine". magazine.telangana.gov.in. 2019-02-09. Archived from the original on 2021-01-28. Retrieved 2022-01-20.
- ↑ Pratap (2013-03-30). "నేపథ్యం: స్వభావం కవిత్వం". www.telugu.oneindia.com. Archived from the original on 2022-01-20. Retrieved 2022-01-20.
- ↑ "Media told to focus on factual reporting". The Hindu (in Indian English). 2009-08-30. ISSN 0971-751X. Retrieved 2022-01-20.
- ↑ "A page-turning tour de force". The New Indian Express. Retrieved 2022-01-20.
- ↑ http://webcache.googleusercontent.com/search?q=cache:2vso3Ooe6LgJ:www.metroindia.com/cities/article/05/09/2015/tapi-dharma-rao-award-for-journalist-krishna-rao/13694+&cd=4&hl=en&ct=clnk&gl=in